నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఉదయగిరి, డిసెంబర్ 26, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గౌతమ్ రెడ్డి తలుచుకుంటే ఉదయగిరి ప్రాంత రూపురేఖలు మారిపోతాయని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఉదయగిరిలో డిఆర్ డిఎ ఆధ్వర్యంలో నిర్వహించిన పొదుపు మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదే ప్రాంతానికి చెందిన మంత్రి గౌతమ్ రెడ్డి ఈ ప్రాంతానికి పరిశ్రమలను తేవాలని కోరారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల ఇబ్బందులను తీర్చాలని కోరారు. ఉదయగిరి దుర్గం అభివృద్ధి గురించి తాను పార్లమెంట్లో ప్రస్తావించానని ఈ
సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కి తాను చేదోడువాదోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అడిగిన విధంగా పది లక్షలు తన నిధుల నుంచి కేటాయిస్తానని చెప్పారు. వైయస్ బతికున్న రోజుల్లో చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ కనిపించినా ఉదయగిరి ప్రాంతం గురించి అడిగే వారిని గుర్తు చేశారు ఆయన బతికి ఉంటే ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తి అయ్యెవని, రైతుల కరువుకాటకాలు తీరే వని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ హయాం వచ్చింది కనుక మంచి రోజులు వచ్చాయని తెలిపారు. ఈ సభకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చారని, గతంలో ఇలా ఉండేది కాదని చెప్పారు మహిళల్లో చైతన్యం పెరిగిందని, జగన్ మోహన్ రెడ్డి కూడా మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చారని తెలిపారు పిల్లలను బడికి పంపేందుకు గాను అమ్మ ఒడి కింద ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబాలకు ఎంతో చేయిస్తున్నారని చెప్పారు ఏ దేశమైనా బాగుపడింది అంటే మహిళల వల్లనేనని వారు పురుషులతో సమానంగా పోటీ పడినప్పుడే సమాజం బాగుంటుంది అని తెలిపారు. అంతకుముందు ఉదయగిరి పట్టణంలో అంతర్గత రోడ్లు, సైడ్ కాలువ నిర్మాణానికి మంత్రులు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్ర శేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు అంతకుముందు ఆనకట్ట నుంచి రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, పాముల హరి, అల్లూరు రాజు, చేజర్ల సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి ప్రాంత పొదుపు మహిళలకు 102 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.

Post a Comment