నెల్లూరు, డిసెంబర్ 22, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు.దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాభవన్లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం విజయవంతంగా జరిగింది.కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు సూచనలు,సలహాలు ఇచ్చిన చేవూరు.క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా ప్రజల కోసం పార్టీకి సేవలందించే ప్రతి ఒక్కరి కృషిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందన్నారు. జిల్లా, మండల, గ్రామ, పంచాయతీ, వార్డు స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తిస్తూ వారికి అందుబాటులో ప్రతీ నాయకులు కార్యకర్తల లాగా శ్రమించాలని సూచించారు. రానున్న పంచాయతీ,స్థానిక సంస్థల ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సంబంధిత ఎన్నికల బరిలో పోటీ చెయ్యొచ్చని ఆశావాహుల్ని ప్రేరేపించారు. గెలుపు ఓటములు ప్రాముఖ్యం కాదని, ప్రజల మన్ననలు పొందడమే గొప్పని దానికి ప్రతీ ఒక్కరూ క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు.అంతేగాక సిఏబి-ఎన్‌ఆర్‌సి బిల్లు పై స్పందించిన దేవకుమార్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినంత మాత్రాన దేశ భక్తులుకారని,రాజ్యాంగాన్ని అనుసరించి చట్టాలను గౌరవించి వాటిని పరిరక్షిస్తేనే దేశభక్తులని గుర్తుచేశారు. ఎన్‌ఆర్‌సి బిల్లు రాజ్యాంగ విరుద్ధం.పౌరసత్వం అనేది దేశంలోకి చొరబడిన అక్రమదారులకు కాదని,శాంతిని కోరే శరణార్ధుల కోసమని వివరించారు.పౌరసత్వ బిల్లు అమలు విషయంలో భాజపా తన దుర్మార్గపు స్వభావాన్ని దేశ ప్రజలపై చూపుతుందన్నారు.ముస్లిం,మైనారిటీ వర్గాలకు పౌరసత్వం రద్దు చేయాలని భాజపా అధ్యక్షుడు అమిత్ షా తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలను విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు.భారతదేశం కేవలం హిందూ దేశం కాదని...సర్వమత సమ్మేళనమే అసలైన భారతదేశమని...చరిత్రను మరచిపోకూడదని భాజపాకు హితవు పలికారు.ఇప్పటికే నోట్ల రద్దు, ఆర్టికల్ 370 వంటి అనేక రకాల సంక్షోభాలు దేశాన్ని కుదిపేఅతున్నాయని...ఎన్‌ఆర్‌సి బిల్లును ప్రజలపై రుద్ది మరొక సమస్యను తీసుకురావద్దని భాజాపాకు సూచించారు.దేశాన్ని సమర్ధవంతంగా పరిరక్షించాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రే స్వయంగా ప్రజలకు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం దుర్మార్గం.తమ పైశాచిక ఆనందం కోసం ప్రజల ప్రాణాలతో,విద్యార్థుల భవిష్యత్తుతో,దేశ ఖ్యాతితో చెలగాటం ఆడడం భాజపాకు తగదన్నారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇటువంటి సంఘటనలు ఎన్నడూ దేశంలో జరగలేదని తెలిపారు.తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్షంతో పాటు రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినెలా కాకుండా,రైతుల భూములను పరిరక్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్ర అధికార పక్షం, ప్రతిపక్షం తమ తమ వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం దృష్టి సారించమన్నారు.అసెంబ్లీలో, శాసన మండలిలో జరిగే ప్రతీ చిన్న విషయాన్ని ప్రజలు సూక్మంగా గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సి.వి.శేషారెడ్డి,సేవాదల్ రాష్ట్ర అధ్యక్షుడు భవానీ నాగేంద్ర ప్రసాద్,నగర అధ్యక్షుడు ఉడతా.వెంకట్రావు, పిసిసి సభ్యులు లేళ్లపల్లి. సురేష్ బాబు,అన్నీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జీలు చేవూరు.శ్రీధర్ రెడ్డి, చింతాల.వెంకట్రావు, షేక్.ఫయాజ్, పరిమళ, వెంకటేశ్వర్లు, చందనమూడి.పెద్ద ఈశ్వరయ్య, పూల.చంద్రశేఖర్ రావు,దుద్దుకూరి.రమేష్ నాయుడు, సత్తెనపల్లి.బాలయ్య,టి.బాల సుధాకర్,షేక్.సర్ఫరాజ్ షబ్బీర్,ఏటూరు. శ్రీనివాసులు రెడ్డి, షేక్.హుస్సేన్ భాషా, ఏ.శ్రీనువాసులు, శక్తి ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ కొండా. అనిల్ కుమార్, షేక్. అల్లావుద్దీన్, ఏ.మోహన్,ఎన్.మోహన్ రెడ్డి,లతా రెడ్డి,అనురాధా రెడ్డి, అమీనా, మంజుల, ఖాసిం,ప్రసాద్,కిషోర్, ఏ.రాంప్రసాద్, కరిముల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment