అధికారపార్టీ వత్తిడితో రోజుకొక లిస్టు మారుస్తున్న తహసీల్దార్
గిరిజనులుకు తీరని అన్యాయం,గ్రామ సభలో పిర్యాదు చేసిన చర్యలు లేవు - చేజర్ల
కోవూరు, డిసెంబర్ 28, (రవికిరణాలు) : ముఖ్యమంత్రి వైయెస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ పథకాల ఎంపికలో మేము కులం చూడం,మతం చూడం,ప్రాంతం చూడం, పార్టీ చూడం అంటారు ఇక్కడేమో అధికారపార్టీ చెప్పినోళ్ళనే ఇళ్ల స్థలాలకు ఎంపిక చేస్తున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.శనివారం కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పటంతో నిజంగానే అర్హులకు ఇస్తారేమో అని ఆశపడి పేదవారు పెద్ద ఎత్తున అర్జీలు పెట్టుకున్నారని కానీ కోవూరు మండలంలో అధికారపార్టీ నాయకుల వత్తిడికి తలవొగ్గి తహసీల్దార్ అర్హులకు ముఖ్యంగా గిరిజనులకు అన్యాయం చేస్తూ అర్హుల జాబితాను రోజు,రోజుకు మారుస్తున్నారని, మండలంలో మొత్తం ఇళ్ల స్థలాలు కోసం 12,321 దరఖాస్తులు వచ్చాయని వాటిలో 5549 మందిని అర్హులుగా గుర్తించామని స్వయంగా తహసిల్దార్ గారే ప్రకటించి మరలా అధికారపార్టీ నాయకుల వత్తిడితో ఆ జాభితా మార్చి కేవలం 2487 మందే అర్హులుగా నిర్ణయించారని దీనిని కూడా రోజు రోజుకు మారుస్తున్నారని, అదేవిధముగా కోవూరు గ్రామ పరిధిలో 5549 దరఖాస్తులు వచ్చాయని వారిలో 2750 మంది అర్హులు గా గుర్తించిమని చెప్పి మరలా గ్రామ సభ జరిగే నాటికి 984 మందే అర్హులుగా ప్రకటించారని,ఈ జాబితాలో అనర్హులు చాలా మంది ఉన్నారని,అదేవిధంగా చాలామంది అర్హుల పేర్లు ఈ జాబితాలో లేవని అక్టోబరు 18 వ తేదీ జరిగిన గ్రామ సభలో తెలుగుదేశం పార్టీ పిర్యాదు చేసిందని, ఆరోజు జాబితాలో అక్రమాలు జరిగింది వాస్తవమేనని అధికారులు అంగీకరించి,అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని,అయితే ఇప్పటి వరకు దాని పై చర్య తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా రోజుకొక లిస్టు తయారు చేస్తున్నారని, కోవూరు పడుగుపాడు పంచాయతీ పరిధిలో ఎక్కువ అక్రమాలు జరిగాయని,కనీసం తలదాసుకోవడానికి కూడా అవకాశం లేని గిరిజనులను ఎంపిక చేయకుండా అధికారపక్షం వత్తిడితో సొంత ఇల్లు కలిగిన వారిని కూడా ఎంపిక చేసారని,అందరికి న్యాయం చేయ వలసిన తహసీల్దార్ ఏక పక్షముగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికయినా కోవూరు తహసీల్దార్ స్పందించి అర్హులు అందరికి న్యాయం చేయాలని,లేని ఎడల ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడముతో పాటు, అర్హులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరిరెడ్డి, శివుని రమణారెడ్డి, కలువాయి చెన్నకృష్ణారెడ్డి, ఉయ్యురు వేణు, పాశం
పరందామయ్య, బుధవరపు శివకుమార్, గుంజి పద్మనాభం, సాయి రోశయ్య, దువ్వూరు రంగారెడ్డి, ఇందుపూరు మురళీకృష్ణ రెడ్డి, కె నారాయణ రెడ్డి, గరికిపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment