రాష్ట్రంలోని వసతి గృహాలు మెనూ పాటించని వార్డన్లు

నెల్లూరు, డిసెంబర్‌ 23, (రవికిరణాలు) : సీమాంధ్ర బి.సి.సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు వుల్లిపాయల శంకరయ్య విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యస్.సి., యస్.టి. బి.సి. వసతి గృహాల్లో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇరుకు గదులు చాలీచాలని నాణ్యతలేని భోజనం వసతి గృహాల్లోని అధికారులు వార్డన్లు హాస్టల్స్ పలసరుకుల విషయం నిర్లక్షం, వంటగదులు కూడా లేని వసతి గృహాలు ఇలాంటి బాధలు కొన్ని చోట్ల వుంటే వార్డన్లను వేదిస్తూవసూలుచేస్తున్న పై అధికారులు హాజరు పట్టికల్లో లోపాలు ఏ.సి.బి. అధికారుల సోదాలు అప్పడుమాత్రమే అధికారుల్లో చలనం తరువాత సరామామూలే వ్యవహారంలో మునిగి తేలు ఉన్న అధికారులు ప్రోటోకాల్ ఖర్చులు భరించలేని అధికారులు పక్కదారిపడుచున్న క్రిందిస్థాయి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించే స్థాయిలో లేరు. అదే విధంగా నెల్లూరు జిల్లాలోని కోటమండలంలోని కొత్తపాళెంలో ఉన్న బి.సి. సంక్షేమ వసతి గృహంలో ఏ.సి.బి. దాడులు జరుగగా హాస్టల్ నందు 83 మంది విద్యార్థులకు గాను కేవలం 9 మంది మాత్రమే ఉన్నారంటే వార్డన్లు అధికారులు ఎంతటి నిర్లక్షమో అర్ధం అవుచున్నది. ఈ ప్రకారం ఒక్క హాస్టల్లోనే ఇలా వుంటే ఎంత బియ్యం  సరుకులు కూరగాయలు, గుడ్లు ఎంత పక్కదారి పడుచున్నాయి. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, జిల్లాలో వందలాది వసతి గృహాల పరిస్థితి ఏమిటి రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో వసతి గృహాలు, లక్షల్లో విద్యార్ధులు ఉన్నా కొంతమంది సిబ్బంది పై అధికారులక మామూళ్ళు ఇవ్వాల్సి వస్తుందని వాపోవుచున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం యస్.సి., ఎస్.టి., బి.సి. వసతి గృహాలపై ఒక్క నిఘా విభాగాన్ని ఏర్పాటుచేసి విద్యార్థులకు మంచి విద్యా, భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నామని అన్నారు. లేకుంటే అక్రమాలకు అవినీతి అడ్డాగా వసతి గృహాలు మారే అవకాశం వుందని ఆవేదన చేందారు. ఈ కార్యక్రమంలో ఎన్.వి. కృష్ణయ్య, పి. శ్రీనివాస రావు, వి. శంకర్, వి. శివకుమార్, కె.ఎల్. రాజు, ఎస్. ప్రభాకర్ రాజు, పి. మురళీ, కె. యాదవ్, యం. వెంకటేశ్వర్లు రాజు, యం. వెకంటరామరాజు, టి. హరి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget