బ్రోచర్ విడుదల లో కాకాణి


నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో జరిగిన రైతు దినోత్సవంలో  రైతులతో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.రైతు దినోత్సవ బ్రోచర్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకాణి.రైతులందరికీ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.
దేశానికి ప్రధానిగా, రైతుల కోసం ఎంతో పనిచేసిన వ్యక్తి చరణ్ సింగ్.దేశ ప్రధానిగా ఉన్నా, రైతుల గురించి ఆలోచన చేసిన వ్యక్తీ.
మన రాష్ట్రంలో రైతుల కోసం పనిచేసిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు.చంద్రబాబు వ్యవసాయం దండగా అన్నారు .కానీ రాష్ట్రంలో  70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేశారు.గతంలో చంద్రబాబు పాలనలో రైతులు రైతు బిడ్డలు అవస్థలు పడిన పరిస్థితి.తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు రైతులను రాజులుగా, వ్యవసాయం అంటే పండగలాగా చేశారు.
ఆయన మరణం తరువాత అన్ని పనులు ఆగిపోయాయి.ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రైతుల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నారు.
గతంలో చంద్రబాబు రుణమాఫీ అని రైతులను మోసం చేశాడు.కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చెప్పిన దాని కన్నా మిన్నగా, ముందుగా ఇస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి రైతుభరోసా అందిస్తాము.గతంలో ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతి వల్ల ఉపయోగించుకోలేక పోయాము.రైతులు మూడు సార్లు పండించేలా చేస్తున్నాం.గతంలో సాగు నీటి పంపిణీ లో కూడా రాజకీయాలు  చేశారు.
గతంలో నీరు-చెట్టు లో దోచుకొన్నారే తప్ప, రైతులకు ఏమి చేయలేదు.
నియోజకవర్గములో అన్ని అవసరమైన పనులు చేసే విధంగా చూస్తున్నాము.
రైతుల కోసం ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొరకడం మన అదృష్టం.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget