ఆంధ్రప్రదేశ్‌ అన్ని ప్రాంతాల అభివృద్ది మంచిదే

నెల్లూరు, డిసెంబర్‌ 22, (రవికిరణాలు) : సీమాంద్ర బిసి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు వుల్లిపాయల శంకరయ్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్ది కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలులో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో పరిపాలన విభాగం మంచిదే. దీనివలన అన్ని ప్రాంతాలలో అభివృ్దది జరుగుతుందని అన్నారు. ప్రాంత విభేదాలు తలెత్తకుండా వుంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి చాలా ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అంతేకాకుండా అమరావతి, విశాపట్నంలలో హైకోర్టు బెంచిలు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. అమరావతి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదని అమరావతిలోనే  రాజధాని వుంటుందని అన్ని ప్రాంతాల అభివృద్ది జరుగుతుందన్నారు. గతంలో హైదరాబాదు వలన నష్టం జరిగినట్టు ప్రస్తుతం జరగదని అన్నారు కాబట్టి మూడు ప్రాంతాల అబివృద్ది అందరూ స్వాగతించాలే కాని అనవసరమైన రాజకీయాలు చేయ్యెద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.జయరామరాజు, బి.రమేష్‌ యాదవ్‌, వి.శంకర్‌, కె.శ్రీనివాసులు, వి.శివకుమార్‌, ఎమ్‌.వెంకటరామరాజు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget