సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం నాయకులకు గుర్తింపు కార్డులు పంపిణీ


నెల్లూరు, డిసెంబర్‌ 29, (రవికిరణాలు) : సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యావర్గంలోని నాయకులకు రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి పి.అనీల్‌ కుమార్‌ యాదవ్‌ చేతుల మీదుగా సంఘం యెుక్క గుర్తింపు కార్డులను ఇవ్వడం జరిగినది. మంత్రి నివాసం వద్ద రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కె.శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.పద్మజ, జిల్లా అధ్యక్షులు కె.శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, సిహెచ్‌ హనుమంతురావు, టి.శివశంకర్‌, ఎన్‌.మోహన్‌రెడ్డి జిల్లా కార్యదర్శులు కె.జయరామరాజు, పి.విజయకుమార్‌ తదితరులకు గుర్తింపు కార్డులు యివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అద్యక్షులు వుల్లిపాయల శంకరయ్య మాట్లాడుతూ గుర్తింపు కార్డుల ద్వారా ప్రబుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి బిసి ప్రజల సమస్యలు పరిష్కరించవలసినదిగా తెలిపారు. రాష్ట్రంలో బిసి హామీలను 80శాతం నెరవేర్చే విధంగా జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేయడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రం అన్ని ప్రాంతాల అబివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న నిర్ణయాలను కొన్ని పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. ప్రాంత విభేదాలు లేకుండా అన్ని ప్రాంతాల అబివృద్దికి కృషి చేయడం అబినందనీయమని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్దికి మంచి నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని అవ్యదా భావించరాదని రాజధాని ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం సస్యశ్యామలంగా వుంది ఓర్వలేని కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ధర్నాలు, దీక్షలు చేయించుట మంచిదికాదని సమస్యను నేరుగా మంత్రికి వివరిస్తే రైతులకు ఎలాంటి హానీ జరగదని రాజదాని రైతులు వారి బాధలను ముఖ్యమంత్రికి వివరిస్తే తప్పనిసరిగా రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. నవరత్నాలలోని హామీలు ప్రతి పేదకుటుంబానికి బాసటగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ మునిరాజా, కె.దయాకర్‌
యాదవ్‌, జె.చలపతి, వి.శంకర్‌, పి.వంశీ, ఎమ్‌.గురుమోహన్‌, వి.శివకుమార్‌, పి.కృష్ణమ్మ, ఎన్‌.వి.కృష్ణయ్య, బి.రమేష్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget