- రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్
నెల్లూరు, డిసెంబర్ 25, (రవికిరణాలు) : నెల్లూరు నగరంలోని 15వ డివిజన్ లక్ష్మీనగర్ నందు రూ.11.20 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా|| పి.అనీల్ కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి అనీల్ కుమార్ మాట్లాడుతూ బాలాజీనగర్ లక్కీబోర్డు సెంటర్ ప్రాంతంలో 30 ఏళ్ళ నుంచి కాలువ మీద దాదాపు 15 ఇళ్ళు ఉండి 100 మీటర్ల వరకు రోడ్డు చిన్నదై పోవడంతో 2, 3 వేల కుటుంబాలకు ఆ ప్రాంతం నుంచి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడిందన్నారు. ఈ ప్రాంతంలో అనేకమార్లు పర్యటించానని, ప్రతిసారి రోడ్డు వెడల్పు చేయమని స్థానికులు చెప్తుండడం జరుగుతోందన్నారు. ఈ ప్రాంతంలో కాలువపై ఇళ్ళు నిర్మించుకొని నివసిస్తున్న 15 కుటుంబాలకు ఇళ్ళ స్థలాలు కేటాయించి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలు ఇప్పించడం జరిగిందని, వెంటనే ఆ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా 10, 15 కుటుంబాలు కాలువలపై నివసిస్తున్నవారి ఇళ్ళను తొలగించాల్సినప్పుడు వారికి ప్రత్యామ్నాయం చూపిస్తే వారికి, ప్రజలకు గాని ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. గత ఐదేళ్ళుగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానిక నాయకులు రోడ్డు వెడల్పు చేయాలని కోరారని, ప్రస్తుతం బాధితులకు ప్రత్యామ్నాయం చూపించి, వెంటనే రోడ్డుకు శంకుస్థాపన చేసి, డ్రెయిన్లు కూడ నిర్మించాలని చెప్పడం జరిగిందన్నారు. అలాగే నెల్లూరు నగరంలో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాటన్నింటిని పరిష్కరించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నెల్లూరు నగరానికి సంబంధించి దాదాపు 120 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలవడం జరిగిందని, 2 ఫ్లెఓవర్లకు కూడ అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపడం జరిగిందని, మరో 2, 3 నెలల్లో 450 కోట్ల రూపాయల పనులు జరగబోతుందన్నారు. ఏదో ఎన్నికల ఆరు నెలల ముందు పనులు చేయడం లాంటి కార్యక్రమాలు కాకుండ, ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, గత ప్రభుత్వం హడ్కో నుంచి 180 కోట్ల రూపాయలు అప్పు తెచ్చామని చెప్పారో వాటిని కూడ ఈ ప్రభుత్వమే భరించి, మొత్తం దాదాపు 600 కోట్ల రూపాయల అభివృద్ధి చేపడుతున్నామన్నారు. అంతేకాకుండ ఓ ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడ చేపట్టామన్నారు. ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పాఠశాలలకు ఈ ఏడాది 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నామన్నారు. బాలాజీనగర్ నందు గల వేణుగోపాలస్వామి దేవస్థాన స్థలం 3 ఎకరాలు, రంగనాథస్వామి దేవస్థాన స్థలం ఇరుకళల పరమేశ్వరి గుడి వద్ద ఉందో వాటిని నక్షత్ర వనంగా తీర్చిదిద్ది, దేవస్థాన ఆస్తులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు - ముందుగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, అలాగే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు ఆ ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు గణేశం వెంకటేశ్వర్లురెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, శివప్రసాద్ రెడ్డి, శరత్ రెడ్డి, ఎస్ కె.సుభాన్, నాగూరు నాగార్జునరెడ్డి, ఫయాజ్, కిషోర్, రఫి, కీచు, ద్వారకనాథ్ రెడ్డి, వినయ్, ఆసిఫ్,
రామచంద్రారెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, ఊటుకూరు నాగార్జున, మల్లు సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment