సోమశిల దక్షిణ కాలువ పనుల్లో రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్ నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలి
*సోమశిల దక్షిణ కాలువ పనుల్లో రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్ నిధుల గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరపాలి*
**అవినీతికి పాల్పడిన అధికారులను తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..*
**సోమశిల ప్రాజెక్టు చైర్మన్ శ్రీ కేశవ చౌదరిని వెంటనే తొలగించాలి*
*ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. లీలా మోహన్ డిమాండ్*
నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 27, రవి కిరణాలు :
సోమశిల ప్రాజెక్టు దక్షిణ కాలువ పనులకు కేటాయించిన రూ.10 కోట్ల ఎఫ్‌డీఆర్ నిధుల గోల్‌మాల్‌పై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి. లీలా మోహన్ నెల్లూరు నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. సోమశిల ప్రాజెక్టు చైర్మన్, సంబంధిత అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు కోట్లాది రూపాయలు కేటాయిస్తుంటే, ఆ నిధులను సక్రమంగా వినియోగించాల్సిన అధికారులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. దక్షిణ కాలువ పనుల పేరుతో కేటాయించిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.
ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు తేలిన అధికారులను విధుల నుంచి తొలగించాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దుర్వినియోగమైన ప్రభుత్వ ధనాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మంత్రి ఆనం గారి నియోజకవర్గంలోని కాలువల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పి. లీలా మోహన్ ప్రశ్నించారు. పొదలకూరు, కలువాయి, చేజర్ల మండలాల్లోనూ కాలువల పరిస్థితి ఇదే విధంగా ఉందని విమర్శించారు.
కాలువల అభివృద్ధి, మరమ్మతుల కోసం కేటాయిస్తున్న నిధులు సక్రమంగా వినియోగించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి సోమశిల దక్షిణ కాలువ పనుల్లో నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని పి. లీలా మోహన్ డిమాండ్ చేశారు విజిలెన్స్ విషయాలను ప్రభుత్వం ఆదేశించిందని తెలిసి కౌన్సిల ప్రాజెక్టు చైర్మన్ శ్రీ కేశవ చౌదరి నిన్నటి రోజున తన స్వగ్రామమైన నాగుల వెళ్ళటూరులో రెండు జెసిబి ల్ని పెట్టి పారుతున్న కాలువల్లో నీళ్లలో ఏదో చేస్తున్నట్లు అనిపించడం జరిగింది పై కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ షాన్వాస్ నాయకులు టీ సుబ్రహ్మణ్యం మున్వర్ జనార్ధన్ పముజుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .

