ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.
వాసిపల్లి శంకర్ రెడ్డి నియామకం
జలదంకి, మేజర్ న్యూస్ :-
ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జలదంకి మండలం అన్నవరం పంచాయతీ గడ్డవారిపాలెం గ్రామానికి చెందిన వాసిపల్లి శంకర్ రెడ్డిని నియమించారు. ఇటీవల విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్ లో ఆంధ్ర విద్యార్థి సంఘం (ఏవీఎస్) రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా బ్లైండ్ క్రికెట్ టీం ఫార్మర్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి, ప్రముఖ అనలిస్ట్ కే ఎస్ ప్రసాద్, ఆంధ్ర విద్యార్థి సంఘం అడ్వైజర్ రిటైర్డ్ సీనియర్ సివిల్ జడ్జ్ బాలకృష్ణ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర విద్యార్ధి సంఘం రాష్ట్ర మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మల్లవరపు అశోక్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వాసుపల్లి శంకర్ రెడ్డి లు నియమాకమయ్యారు. వీరితో పాటు మొత్తం 52 మంది రాష్ట్ర కమిటీ నియామకం జరిగింది. రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ సమస్యలు, రాష్ట్ర స్థితి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర, స్వచ్ఛందంగా సమాజంలో సేవ చేస్తున్న యువకులను ప్రోత్సహించడం కోసం మహాసభల్లో శ్రీ పొట్టి శ్రీరాములు యువసేవ పురస్కార్ అవార్డు ను స్వచ్ఛంద సేవ సమస్థ వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సాయి మహంతీర్ కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసుపల్లి శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కరించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఏమిటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఎలా భాగస్వామ్యం అవ్వాలని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతుల పైన, రాష్ట్రంలో పీజీ విద్యార్థులకు గుది బండగా మారిన మారిన జీవో నెంబర్ 77, పెండింగ్ ఎలా ఉన్న ఫ్రీజర్ అయంబర్స్మెంట్, ప్రభుత్వ వసతి గృహాల మౌలిక సదుపాయాలు, గ్రాడ్యుయేట్ కంప్లీట్ ఐపోయేలోపు ఉద్యోగానికి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్పించే అంశం తో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క ప్రాముఖ్యత గురించి ప్రపంచానికి వెలుగెత్తి చాటేలా, రాష్ట్రంలో ఉన్నటువంటి మహా పురుషులను గుర్తు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఒక బలమైన శక్తిగా తయారయ్యే విధంగా రాష్ట్ర మహాసభల్లో చర్చలు జరిగాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తురకా ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు శివ, మనోజ్, కార్తీక్, కావ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు అఖిల్, వంశీ, నాగరాజు, శివ, హనుక్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.