వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నెల్లూరు లోని వారి నివాసంలో కోవూరు మండలం, పడుగుపాడు పంచాయతీ నాయకులు గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ షైక్ అహమ్మద్ గారు మరియు తపెట్ల భాస్కర్, రావి నాగార్జున, గొల్లపల్లి తులసీ కృష్ణ, షైక్ నజార్, గరికపాటి అనిల్, షైక్ సర్దార్ బాషా మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్కని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు
అతి తక్కువ ఖర్చుతోనే మోకాలి మార్పిడి ఆపరేషన్లు : అపోలో హాస్పిటల్ ప్రకటన
మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో అపోలో హాస్పిటల్ నెంబర్ వన్
రోబోటిక్ సహాయంతో చేసే శస్త్ర చికిత్సలు 100 శాతం సురక్షితం
శస్త్ర చికిత్స చేయించుకునే వారికి పరీక్షలు ఉచితం
సద్వినియోగం చేసుకోవాలన్న నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యులు
అతి తక్కువ ఖర్చుతోనే రోబోటిక్ సహాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. రోబోటిక్ మోకాలి మార్పిడి ఆపరేషన్లు చేయించుకునే వారికి దానికి అవసరమైన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హాస్పిటల్ లో ఇవాళ జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరాం సతీష్, ఆర్ధోపెడిక్ సీనియర్ సర్జన్లు డాక్టర్ వివేకానంద రెడ్డి , డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా చేయడంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ అగ్రగామిగా ముందుకు వెళుతుందని చెప్పారు. ఈ నేపద్యంలోనే నెల్లూరు అపోలో హాస్పిటల్ లో రోబోటిక్ సాయంతో మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రోబోటిక్ సాయంతో చేసే శస్త్ర చికిత్సలు 100 శాతం ఖచ్చితత్వంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతే కాకుండా అతి తక్కువ రక్త స్రావంతో పాటూ శస్త్ర చికిత్సకు సంభందించిన మచ్చలు కూడా ఉండవన్నారు. శస్త్ర చికిత్స తర్వాత నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుందని, వేగంగా కోలుకోవచ్చునని చెప్పారు. శస్త్ర చికిత్స తర్వాత హాస్పిటల్ లో ఎక్కువ రోజులు కూడా ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స 100 శాతం సురక్షితమని, నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులో ఉన్న ఈ శస్త్ర చికిత్సలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరాం సతీష్, డాక్టర్ వివేకానంద రెడ్డి , డాక్టర్ శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
కొరీడ్ సంస్థ ఉపాధ్యాయులకు మరియు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి అవగాహన కార్యక్రమం.
కావలి మేజర్ న్యూస్: కావలి బాపూజీ నగర్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్. జైపాల్ ఆధ్వర్యంలో కొరీడ్ సంస్థ పేద ప్రజలకు అండగా ఉంటూ వారికి వృత్తి నైపుణ్యాలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారు నిలబడేందుకు ఈ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని గతంలో ఎంతోమంది విశ్లేషకులు తెలియపరిచినారు. అదే విధంగా పేద గిరిజన ప్రాంతాలలో ఉచితంగా విద్యా బోధన సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యను విద్యార్థులకు ఏ విధంగా బోధించాలో ఏ విధంగా బోధిస్తే విద్యార్థులకు జ్ఞాపకం ఉంటుందో తెలియజేశారు. అలాగే గ్రామాల్లోని పెద్దలు ఈ కార్యక్రమానికి పాల్గొనలో విశేషం. ఈ కార్యక్రమంలో కొరీడ్ సంస్థ సూపర్వైజర్ దంతం సునీల్ మరియు సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెల్లరాయి ట్రాక్టర్ల పై ఎస్సై కి సవతి ప్రేమ
అయిన వారికి రెడ్ కార్పెట్..కానీ వారికి కేసులు బహుమానం
సైదాపురం 24 మేజర్ న్యూస్
సైదాపురం ఎస్సై కాంతి కుమార్ తెల్లరాయి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపుతున్నారని అందరూ అనుకున్నా అది పొరపాటే..గత మూడు రోజుల క్రితం తిప్ప వద్ద నుంచి రెండు ట్రాక్టర్లల్లో తెల్లరాయి అక్రమంగా తరలిస్తున్నారంటూ ఎస్సై కి వచ్చిన సమాచారం మేరకు రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్టేషన్ కి తరలించి మైనింగ్ వారికి రాయకుండా డైరెక్ట్ గా కోర్ట్ కి పెట్టారు..అయితే రెండు రోజుల క్రితం మరో ట్రాక్టర్ లో తెల్లరాయి తరులుతుంది అన్న సమాచారంతో ఆ ట్రాక్టర్ ను పట్టుకున్న ఎస్సై ట్రాక్టర్ యజమాని తో సన్నిహితమో..లేకుంటే మమ్ముల్లో తెలియదు కాని ఆ ట్రాక్టర్ ను నేరుగా సంబంధిత తెల్లరాయి యార్డు కి పోలీస్ సిబ్బందిని పంపి రాయి ని ఆన్ లోడ్ చేపించి ట్రాక్టర్ ని మాత్రమే స్టేషన్ ముందు చూపూడికి పెట్టాడు..దాని పై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయిన వారు చేస్తే తప్పు కాదు..ఇంకా ఎవరైనా చేస్తే కేసులు మోపడం ఎంత వరకు సబబు తెల్ల రాయి ట్రాక్టర్ను పట్టుకొని నామ్ కా వాస్తుగా రాత్రిపూట వదిలేసిన ఎస్సై విలేకరులు ఫోన్ చేసి అడగగా మైనింగ్ రిలీజింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు నేను వదిలేసా అంటున్న ఎస్ఐ క్రాంతి కుమార్ అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఉన్నతాధికారులు సైదాపురం పై ప్రత్యేక దృష్టి సారిస్తే ఇటువంటి ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని మండల ప్రజలు కోరుతున్నారు..
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత పరీక్షలు.....
సెంట్రల్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి....
మెడికవర్ హాస్పిటల్ లో ప్రతి మంగళవారం రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత పరీక్షలు....
నెల్లూరు నగరంలోని మెడికవర్ హాస్పిటల్ నందు మెడికవర్ క్యాన్సర్ వైద్య నిపుణులు, సెంట్రల్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ లో ప్రతి మంగళవారం రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచిత పరీక్షలు చేయడం జరుగుతుంది అంటూ ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మీడియా సమావేశం నిర్వహించారు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈరోజు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఇంటర్నేషనల్ బెస్ట్ క్యాన్సర్ అవేనేస్ ను గుర్తిస్తూ క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలని ఈ మెసేజ్ అందరికీ చేరాలనే ఉద్దేశంతో అత్యంత అనుభవం కలిగిన అన్ని రకాల క్యాన్సర్ వైద్యనిపుణులు మీడియా ముందుకు రావడం జరిగిందని తెలిపారు..WHO సెన్ సెక్స్ తీసుకుంటే సంఖ్యలు మనకి ఏమి చెబుతుందంటే ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రావడం జరుగుతుందని తెలిపారు...
ఇదే కాకుండా కొన్ని అనామిక్స్ స్టాటటిక్స్ మనకు ఏమి చెబుతున్నాయంటే 1838 బ్రిలియన్ జనాభాలో క్యాన్సర్ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది.. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ లో సీనియర్ డాక్టర్లు అవగాహన ఇస్తున్నారని తెలిపారు...
క్యాన్సర్ గురించి వివరంగా తెలుసుకుని ఆ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు... మెడికవర్ క్యాన్సర్ హాస్పటల్లో విప్లవాత్మక క్యాన్సర్ వైద్య సేవ లభిస్తున్నాయని అన్నారు..
భారతదేశపు మొదటి యుఎమ్ఐ 550 డిజిటల్ ఫెటోసిటీ, 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ ఫోటోసిటీ స్కానింగ్ కొరకు పెద్ద నగరాలకు వెళ్ళవలసిన అవసరం లేదని తెలిపారు... దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియో థెరపీ, మిషన్ తక్కువ సమయంలో వేగవంతమైన మరియు మెరుగైన చికిత్స ఆధునిక పద్ధతులలో రేడియో ధైరఫీ,బ్రాకీ దైరఫీ,మయోగ్రఫీ,సిస్టోస్కోప్, ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీలతో వైద్యం దొరుకుతుందని తెలిపారు...
అదేవిధంగా మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ, హేమటో అంకాలజీ, బోన్ మ్యారో ట్రాన్ ప్లాంట్ పెయిన్ & పాలియేటివ్ కేర్, ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్,న్యూక్లియర్ మెడిసిన్ ప్లాస్టిక్ అండ్ రికన్ స్ట్రక్టీవ్ సర్జరీ,MRI, సదుపాయాలు కలవు..
అదేవిధంగా ఎన్ని రకాల క్యాన్సర్ లు ఉన్నాయో వాటి గురించి వివరించారు.. రొమ్ము క్యాన్సర్,తల & మెడ క్యాన్సర్, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ మారో క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, బి యమ్ టి ,అన్ని రకాల క్యాన్సర్లకు సాధారణ లాపరోస్కోపిక్ శాస్త్ర చికిత్సలు పునర్నిర్మాణ శాస్త్ర జీకేలు కలవని తెలిపారు.... కావున ప్రతి మంగళవారం జరిగే రొమ్ము క్యాన్సర్ ఉచిత పరీక్షలను నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అన్ని రకాల క్యాన్సర్ వైద్యుని పులులు కోరారు.. అదేవిధంగా మన శరీరంలో ఏమైనా గడ్డలు కనిపిస్తే హాస్పిటల్ కి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు...పై కార్యక్రమంలో సెంట్రల్ హెడ్ డాక్టర్ బిందు రెడ్డి, కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జి.రంగరామన్, కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ శ్రీవిద్య, కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఎన్ అవినాష్, కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ పి జి ఎస్ ఆర్ ప్రియ, డాక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు...
దీపం పథకానికి అర్హతలు ఇవే
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
ఏపీలో దీపం పథకం కింద ఉచితంగా మూడు సిలిండర్లు అందజేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకానికి అర్హతలు ప్రకటించారు.
1 విధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి
2 గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
3 ఆర్థికంగా వెనకబడిన వారైతే అర్హులు
4 బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేయాలి
5 వైట్ రేషన్ కార్డు ఉన్న వారిని ప్రామాణికంగా తీసుకుంటారు
కాలువలోకి దూసుకెళ్లిన కారు.
- అతివేగమే ప్రమాదానికి కారణం.
విడవలూరు మేజర్ న్యూస్.
అతివేగంగా వస్తున్న కారు ముందు టైరు పంచర్ కావడంతో కాలువలోకి దూసుకెళ్లిన ఘటన గురువారం మండలంలోని పటేల్ నగర్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు విడవలూరు నుంచి వావిళ్ళ గ్రామానికి వెళుతున్న కారు అతివేగంగా వస్తున్న సమయంలో ముందు టైరు పంచర్ అయింది. దీంతో అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న కారులోకి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ట్రాక్టర్ సహాయంతో కాలువలకు దూసుకెళ్లిన కారును బయటకు తీసి అందులోని డ్రైవర్ను సురక్షితంగా రక్షించారు.