తూ భాంచత్--నీకు దమ్ముంటే నా సవాల్ స్వీకరించు
మూడవ రైల్వే లైన్ కి గ్రావెల్ తోలింది ఎవరు............
పసుపులేటి సుధాకర్ కి ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
కావలి రవికిరణాలు :::::
*కావలిలో మరో రాజకీయ దత్తపుత్రుడుపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
చేతనైతే సాయం చేస్తా
అవసరమైతే సహాయపడతా
అంతే తప్ప నీలాగా దొంగ సొమ్ముకి నేను ఆరాటపడను ఇది రాసిపెట్టుకోవాలి ఎమ్మెల్యే రామిరెడ్డి అన్నారు. విజయవాడ నుంచి చెన్నైకు వేస్తున్న మూడవ రైల్వే లైన్ కు గ్రావెల్ తోలిందెవరో కనుక్కొని మాట్లాడాలని, బిట్రగుంటలో వేసిన లేఔట్ కు గ్రావెల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు ప్రజల ముందు చెప్పాలని దొంగలను బయట పెడితే పరిగెడుతూ మాపై ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. గ్రావెల్ దొంగతనాలు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులని అది తెలుసుకొని మాట్లాడాలని చోటానేతలకు సూచించారు. నేను మగాడినోకాదో గత ఎన్నికల్లో నువ్వు చూశావు కదా పసుపులేటి సుధాకర్
అంతలోపే మర్చిపోతే ఎలా అని గుర్తు చేసుకోవాలని పసుపులేటి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను మగాడిని కాబట్టే కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాను,మూడోసారి గెలవడానికి రెడీగా ఉన్నానని దమ్ముంటే బరిలో దిగాలని తాడోపేడో తేల్చుకుందాం రా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నువ్వు మగాడివైతే చంద్రబాబు నాయుడు చేసిన 118 కోట్ల అవినీతిపై మాట్లాడు టికెట్ కాదు ముందు కావాల్సింది ప్రశ్నించు తేల్చుకొని ప్రజల కోసం ముందుకు రా అన్నారు.ఎన్నికల సమయాల్లోనే నీకు కావలి నియోజకవర్గం,పేద ప్రజలు గుర్తుకొస్తున్నారా పసుపులేటి అంటూ ఊసరవెల్లి వేషాలు మానుకొని ప్రజల పక్షాన నిలబడాలి అన్నారు.
అవినీతి చేయడం నా ఇంటా వంటా చరిత్రలో లేదన్నారు.
నీ అబద్ధపు,తప్పుడు ప్రచారాలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని ఇప్పటికైనా కళ్ళు తెరిచి కావలి ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలని హితావు పలికారు.ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగలు, పబ్బాలు వచ్చినట్టు వచ్చి ఇక్కడ ఏదోదో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పసుపులేటి పై నిప్పులు చెరిగారు.గత ప్రభుత్వ హయాంలో భారీగా గ్రావెల్ మాఫియా జరిగి,ఊహకి అందని విధంగా గుంతలు ఏర్పడితే,నీ పనికిమాలిన
డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి ఇప్పటి ప్రభుత్వ హయాంలో జరిగిందని తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు.అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అంటే గ్రావెల్ ఎంత అవసరమో నిన్నటిదాకా నాదే కావలి టీడీపీ టికెట్ అని మాట్లాడిన ఆ కాంట్రాక్టర్ ని అడిగి తెలుసుకొని మాట్లాడాలని సుధాకర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి, కనమర్లపూడి వెంకట్ నారాయణ, రాజశేఖర్, వడ్లమూడి వెంకటేశ్వర్లు,సుధీర్ నాయుడు, ప్రభాకర్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.