వార్డు హద్దుల పునర్విభజన ప్రక్రియ పూర్తి
December 24, 2019
Andhrapradesh
,
Commissioner PVVS Murthy
,
Muncipal office
,
Nellore
,
ward Reorganization
- కమిషనర్ పివివిస్ మూర్తి
నెల్లూరు, డిసెంబర్ 24, (రవికిరణాలు) : నగర పాలక సంస్థ పరిధిలోని 54 వార్డులకు సంభందించిన హద్దుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి వివరాలను ప్రజల సందర్శనార్థం సంబంధిత కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నామని కమిషనర్ పివివిస్ మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసారు. నగర పాలక సంస్థలో ఎన్నికలు నిర్వహించేందుకు అనుగుణంగా కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వుల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారంగా ముసాయిదాను రూపొందించామని తెలిపారు. ముసాయిదా వివరాలను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నెల్లూరు రూరల్, అర్బన్ తహశీల్దార్ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. వార్డు హద్దుల పునర్విభజనకు సంబంధించి ప్రజలకు ఏవన్నా అభ్యంతరాలు ఉన్నా, సలహాలు సూచనలు చేయాలన్నా తే30-12-19ది సాయంత్రం 5 గంటల లోపు నగర పాలక సంస్థ కార్యాలయంలో లేఖ ద్వారా తెలియజేయాలని సూచించారు. వార్డు హద్దుల పునర్విభజన వివరాలను నగర పాలక సంస్థ website: nellore.cdma.ap.gov.in లింక్ ద్వారా వీక్షించేందుకు అందుబాటులో ఉంచామని కమిషనర్ ప్రకటించారు.