క్రిష్ణపాడు గ్రామంలో భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం
గ్రామస్తులకు, భక్తులకు అన్నదానం కార్యక్రమం
జలదంకి, మేజర్ న్యూస్ :-
జలదంకి మండలం క్రిష్ణపాడు గ్రామంలోని శ్రీకృష్ణ మందిర్ ఆశ్రయం నందు వెలసి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి శనివారం రోజు గ్రామస్తులు అందరూ కలిసి ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా గ్రామస్తుల సహాయ సహకారాలతో ఐక్యంగా సమిష్టిగా ఈ ఆరాధన మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా ఆరాధన మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి హోమగుండం ఏర్పాటు చేశారు. సాయంత్రం భక్తులందరూ భజన కార్యక్రమం, కోలాటం లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులకు ఎలాంటి ఆస్వాకర్యం కలగకుండా ఆరాధన మహోత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారు. భక్తులందరికి మధ్యాహ్నం, సాయంత్రం అన్నదానంతో పాటు ప్రసాదాలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన కృష్ణాపాడు యువజన సంఘానికి, అలాగే అన్నదాన కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉన్న గ్రామస్తులకు ఆరాధన మహోత్సవం కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జనవాణి తో సమస్యల సత్వర పరిష్కారం
- ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
జనసేన పార్టీ నేత శ్రీ నూనె మల్లికార్జున్ యాదవ్
నెల్లూరు, మేజర్ న్యూస్
క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జనసేన పార్టీ సీనియర్ నేత, కోర్ కమిటీ సభ్యులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు శనివారం స్థానిక గోమతి నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మంచి మనసుకు ఈ కార్యక్రమం నిదర్శనం అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజల వద్దకే పాలన సాగించటం అభినందనీయమన్నారు. పేదల సంక్షేమమే కూటమి లక్ష్యం అని నూనె మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్ శ్రీరామ్, కృష్ణారెడ్డి ,రాజేష్, చంద్రశేఖర్, కొట్టే వెంకటేశ్వర్లు ,నందిని, భవాని సురేష్, హరి రెడ్డి, జమీర్, రాము,పవన్, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
లెప్రసీ మహిళకు డేమియన్ ఫౌండేషన్ అర్బన్ ఆర్థిక సహాయం
తోటపల్లి గూడూరు మేజర్ న్యూస్ మండలంలోని, మల్లికార్జునపురం మజర గ్రామమైన మాచర్ల వారి పాలెం లో ఉన్న, గణపతి నగర్ లో శనివారం డేమియన్ ఫౌండేషన్ లెప్రసీ వారు,గోడ విజయమ్మకు ఉచితంగా చిల్లర దుకాణాకు 45 వేల రూపాయలను సహాయంగా ఆమెకు అందజేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య,సహా అధికారి యస్ కే ఖాజావలి, ప్రాజెక్టు మేనేజర్ సతీష్ పాల్గొని,చిల్లర దుకాణకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, ఈ సందర్భంగా వరిగొండ వైద్యాధికారిణి డాక్టర్ రాధిక మాట్లాడుతూ, లెప్రసీ కారణంగా బాధపడుతున్న,గోడా విజయమ్మకు ఫౌండేషన్ వారు చిల్లర దుకాణకు సహాయం చేయడం చాలా సంతోషకరంగా ఉందని, దీనితో ఆమెకు పోషణ నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందు లేకుండా ఉంటుందని ఆమె తెలియజేశారు,ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఆచారి, ఓ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించిన కావలి ఎడవల్లి హై స్కూల్ విద్యార్థిని
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ ఏఎస్ పేట మండలం కావలి ఎడవల్లి జడ్పీ హైస్కూల్లో గత ఏడాది పదవ తరగతి చదివిన బందా హరిణి కి మూడవ విడతలో శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీ సీటు సాధించినట్లు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఓ వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు ఓ.వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది ట్రిపుల్ఐటీ లో సీటు వచ్చిన బందా హరిణిని అభినందించారు
మసీదు నిర్మాణానికి మేకపాటి విక్రమ్ రెడ్డి 10 లక్షల ఆర్థిక సహాయం
కంటాభత్తిన రఘునాథరెడ్డి
సంగం మేజర్ న్యూస్ :సంగం మండలం జెండదిబ్బ గ్రామం లోని మసీద్ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికల ముందు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి మసీద్ నిర్మాణానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు . ఈరోజు ఆ మసీదు నిర్మాణం స్లాబ్ నిర్మాణం చేపట్టడంతో జెండా దెబ్బ వైసీపీ నాయకుల ఆహ్వానం సంఘం మండల ఎంపీపీ కంటాభత్తిన రఘునాథ రెడ్డి గ్రామానికి విచ్చేసి మసీదు నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం జండా దెబ్బ వైసీపీ నాయకులు మరియు ముస్లిం సోదరులు కంఠాభత్తిన రఘునాధ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మసీదు నిర్మాణానికి సహాయం చేసిన మాజీ ప్రియతమ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి కి జండా దిబ్బ ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జండా దిబ్బ ఉప సర్పంచ్ నరేష్ గుప్తా మరియు కో ఆప్షన్ సభ్యులు మన్సూర్, ఖాదర్ బాషా, సర్దార్ తదితరులు పాల్గొన్నారు
వెంకటాచలం మేజర్ న్యూస్.
వెంకటాచలం మండలం గొలగమూడి క్షేత్రంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 42వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా పట్టువస్త్రాలు సమర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు
సోమిరెడ్డి దంపతులకు సంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ ఈఓ బాలసుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు
శ్రీ వెంకయ్య స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,
ఆలయ మర్యాదల ప్రకారం సోమిరెడ్డి దంపతులను సత్కరించిన నిర్వాహకులు,
శ్రీ ఆంజనేయస్వామి దర్శనం అనంతరం పూజలు జరిపి రథోత్సవాన్ని ప్రారంభించిన సోమిరెడ్డి,
సోమిరెడ్డి కామెంట్స్:
శ్రీ వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించే మహాద్భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉంది.
భగవాన్ వెంకయ్య స్వామి, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పాటు సకల దేవతల దీవెనలు, ప్రజల అండదండలతో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించాను.
నామినేషన్ దాఖలు సమయంలో వెంకయ్య స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నాను.
శ్రీ స్వామి వారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను.