వెంకటాచలం మండలంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ గారి పర్యటన
వెంకటాచలం సమీపంలోని వడ్డిపాలెం అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎ. ఆనంద్
అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా పరిశీలించి రుచిచూసిన కలెక్టర్
విద్యార్థుల హాజరు, ఇతర రిజిష్టర్లు, మొబైల్ యాప్ లో వివరాలను తనిఖీ చేసిన కలెక్టర్
చిన్నారులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించిన కలెక్టర్
చిన్నారుల బరువు, ఎత్తును స్వయంగా పరిశీలించిన కలెక్టర్
అంగన్వాడి కేంద్రం పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ ఆనంద్
సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి నీ అకస్మాత్తుగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ .
కొద్ది సేపు డాక్టర్ గా
ఎమ్మెల్యే నెలవల వియజయశ్రీ.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
డాక్టర్ వృత్తి నుండి రాజకీయాలలోకి వచ్చి సూళ్లూరుపేట ఎమ్మెల్యే గా ఎన్నికైన డాక్టర్ నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట లోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు . ఆ సమయం లో ఎమ్మెల్యే స్వయంగా రోగులను పరీక్షించి కొద్ది సేపు డాక్టరుగా మారి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను పరిశీలించి అక్కడ అందుబాటులో ఉన్న పరికరాలను కూడా పరిశీలించడం జరిగింది,అలాగే చికిర్చ పొందుతున్న రోగులను పలకరించి వారి యోగ క్షేమాలను అడిగితెలుసుకున్నారు, రోగులకు ఎమ్మెల్యే చేతులు మీదుగా పండ్లు అందజేశారు, ఈ సందర్భముగా డాక్టర్ విజయశ్రీ మాట్లాడుతూ నిధులు లేక నిర్మాణం ఆగిపోయిన భవనాలను పూర్తి చేయించడం జరుగుతుందని, వైద్య సేవలు బాగా అందిస్తున్నారు త్వరలో డైయలసీస్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ లో మహానేత డా.వైయస్ఆర్ కు ఘననివాళులు
జిల్లా పార్టీ కార్యాలయం, రూరల్లోని అన్ని డివిజన్లు, గ్రామీణ ప్రాంతాలలో డాక్టర్ వైఎస్ఆర్ 75వ జన్మదిన వేడుకలు
అన్ని ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహణ
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని, చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిగారి 75వ జయంతి వేడుకలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రూరల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయా ప్రాంతాల్లో ఉండే దివంగత మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జోహార్ వైయస్ఆర్, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జయహో జగనన్న, ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పరిష్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టారు.
* ఇరు రాష్ట్రాల మంచి కోసం ఇద్ధరు ముఖ్యమంత్రి సమావేశం అయితే
వారి గురించి హేళనగా మాట్లాడుతున్న కాకని
గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
*వ్యవసాయ శాఖ ని మూసివేసిన వ్యక్తి కాకాని గోవర్దన్ రెడ్డి..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పై 30 కేసుల్లో ఉన్నాయి.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* నాకు 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయని
* తప్పుడు ప్రచారం చేసి వ్యక్తి వి నువ్వు..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారు.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* రామోజీరావు ను జైల్లో పెట్టాలని ఇబ్బంది పెట్టారు...సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* వైకాపా ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ విచ్చలవిడిగా రాజ్యమేలింది...సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఇద్దరు ముఖ్యంత్రులు సమావేశం అయ్యారు.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
* వైకాపా ప్రభుత్వ హయంలో నాసిరకం మధ్యం తాగి చాలామంది పేదలు చనిపోయారు.సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అతి త్వరలో వినియోగంలోకి జిల్లాలోని ఇసుక రీచ్ లు
అవసరమైన అనుమతుల కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు
ప్రత్యామ్నాయంగా సరిహద్దు జిల్లాల నుండి ఉచిత ఇసుక పొందే అవకాశం
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, ఇసుక కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి
సాధ్యమైనంత త్వరగా జిల్లాలోని ఇసుక రీచ్ లను వినియోగంలోకి తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నామని, అప్పటి వరకు జిల్లా వాసులు సమీపంలోని కోనసీమ. తూర్పు గోదావరి జిల్లాలలోని ఇసుక నిల్వ కేంద్రాల నుండి ఉచిత ఇసుక పొందవచ్చని పశ్చిమ గోదావరి కలెక్టర్, జిల్లా ఇసుక కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మూడు ఇసుక కేంద్రాలు భీమవరం, నర్సాపురం పట్టణాలకు 50- 60 కి.మీ.ల దూరంలో ఉన్నాయని, జిల్లాలోని 5 మండలాలకు అతి సమీపంలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. నిడదవోలు మండలం పందలపర్రు కేంద్రంలో 52,082, పెరవలి మండలం పెండ్యాల కేంద్రంలో 1,46,249, ఉసులుమర్రులో 33,065 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. కోనసీమ జిల్లాలో మూడు ఇసుక నిల్వ కేంద్రాలు 15-30 కి.మీ.ల దూరంలో, జిల్లాలోని 5 మండలాలకు అతి సమీపంలో ఉన్నాయన్నారు. రావులపాలెం మండలంలోని రావులపాడు-1 కేంద్రంలో 34,171, రావులపాడు-2లో 82,950, కొత్తపేట కేంద్రంలో 25,897 మెట్రిక్ టన్నులు సిద్దంగా ఉందన్నారు. జిల్లాలోని ఆచంట, పెనుగొండ మండలాలలోని ఆరు ఓపెన్ ఇసుక రీచ్‌లు పనిచేయడంలేదని కలెక్టర్ సి.నాగరాణి వివరించారు. విభిన్న అనుమతులు పొందవలసి ఉందన్నారు. యలమంచిలి, నర్సాపురం ప్రాంతాలలో ఐదు డీ-సిల్టేషన్ పాయింట్లు ఉండగా, జలవనరుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి నుండి అనుమతులు తీసుకోవలసి ఉందన్నారు. ఈ నేపద్యంలో జిల్లాలోని ఆరు ఇసుక కేంద్రాలలో ఎటువంటి నిల్వలు లేవని చదలవాడ నాగరాణి వివరించారు. రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు, ప్రభుత్వం వారికి చెల్లించవలసిన సీనరేజ్, జీఎస్టీ తదితర ఖర్చులు మాత్రమే ఉంటాయన్నారు. మైన్స్ అండ్ జియాలజీ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉన్నాయని, వినియోగదారులు తమ ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలను చూపి ఇసుక పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. వినియోగదారుడి నుంచి డిజిటల్ పేమెంట్ కు మాత్రమే అనుమతి ఉంటుందని నాగరాణి స్పష్టం చేసారు. ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నులు మాత్రమే తీసుకు వెళ్ళడానికి అనుమతి ఉంటుందన్నారు. స్టాక్ పాయింట్ల నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుకను పొందడానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద వాహనాలలోకి లోడింగ్ చార్జీలు, ప్రభుత్వానికి చెల్లించవలసిన సీనరేజ్, తదితర ఖర్చులు చెల్లిస్తే సరిపోతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.