నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్, నక్కలగుంటకు చెందిన రాబర్ట్ మరియు వారి మిత్రబృందంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికీ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
వందలాదిమంది యువకులు నాకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరిని పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తున్నా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులే. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరికి అన్నిరకాలుగా నా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్, టీడీపీ నాయకులు పోతురాజు రవి, నాటకారాణి నవీన్, ఉన్నం మహేష్, పంబాడి డేవిడ్ రాజు, బాలసిద్దయ్య, సుబ్రహ్మణ్యం, రంజిత్, శీను, సాయి, యుగంధర్, శంకర్, వినయ్, గిరీష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నేడు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము హుండీలు లెక్కింపు.
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
తెలుగు, తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాళ్ళమ్మ దేవస్థానం నందు నేడు తేది.16-09-2023 ఉదయం10:00 గం’’లకు దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమము జరుగును.కావున ఆసక్తి గల భక్తులు హుండీ లెక్కింపు కార్యక్రమములో డ్రెస్స్ కోడ్ (పంచే, బన్నియన్) పాటించుచూ పాల్గొనవలసినదిగా ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మరియు ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి కోరారు.
వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి అధికారుల సమీక్ష సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. నెల్లూరు నగరం రూరల్ నియోజకవర్గం వినాయక చవితి ఉత్సవాలు, గణేష్ నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి ఉన్నత అధికారుల సమీక్ష సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇంచార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణ్ గారు,జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి గారు నెల్లూరు నగర కమిషనర్ వికాస్ మర్మత్, ఏ ఎస్ పి, నెల్లూరు ఆర్డీవో తదితరులతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సమక్షించారు. సమావేశానికి హాజరైన వివిద గణేష్ ఉత్సవాల కమిటీల సభ్యులతో వారివారి అభిప్రాయాలను, సూచనలను సమావేశంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. గణేష్ నిమజ్జనం ఉత్సవాలను స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద, పెన్నా నది తీరమున నిర్వహించేందుకు అవసరమైన చర్యలతోపాటు, కట్టుదిట్టమైన ఏర్పాట్లను తీసుకోవాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా వచ్చే వినాయకుని ప్రతిమలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందుగానే ప్రజలలో అవగాహన చర్యలు చేపట్టి వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డిగారు, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిగారు వివిధ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జగనన్నకు చెబుతాం. మాధవసేవ కన్నా మానవసేవే మిన్న:ఎమ్మెల్యే వెలగపల్లి.
రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ.
జగనన్నకు చెబుదాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక:ఆర్డిఓ కిరణ్ కుమార్.
చిట్టమూరు రవి కిరణాలు న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవో ద్వారా తీసుకువచ్చిన జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా చిట్టమూరులో నిర్వహించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఎంపీడీవో షాలేట్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు,జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ,గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్,జిల్లా,డివిజన్,మండల స్థాయి అధికారులు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి మాట్లాడుతూ మాధవ సేవ కంటే మానవసేవ మిన్నగా అధికారం కట్టబెట్టిన ప్రజలకు నాయకులు,అధికారులు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం,అభివృద్ధితో పేదలకు అందుబాటులో ప్రజా రంజక పాలన కొనసాగిస్తూ, సేవలందిస్తున్నారు.ఇప్పటికీ సంక్షేమంతో పాటు మెరుగైన వసతుల రూపకల్పనకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టామన్న ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామన్నారు.త్వరలో పేదలకు అందుబాటులో ప్రతిష్టాత్మక సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు.తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ అనాదిగా భూసమస్యలు ఎదుర్కొంటున్న వారు రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పించిందన్న ఆయన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సవివరంగా వివరించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుతాం చక్కటి పరిష్కార వేదికని గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ తెలిపారు. భూ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన వినతులను నిశితంగా పరిశీలించి,వివరాలు అడిగి తెలుసుకుని,సమస్యల పరిష్కారానికి సావధానంగా గూడూరు ఆర్డిఓ కిరణ్ కుమార్ జవాబిచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పని చేస్తున్న ఆర్డీవో ప్రతి అర్జీదారుడు వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సమస్యలపై అర్జీలు స్వీకరించి,రసీదులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయలక్ష్మి, వైకాపా నాయకులు,అన్ని శాఖల అధికారులు,అర్జీదారులు పలువురు పాల్గొన్నారు.