జగనన్నకు చెబుతాం. మాధవసేవ కన్నా మానవసేవే మిన్న:ఎమ్మెల్యే వెలగపల్లి.
జగనన్నకు చెబుతాం. మాధవసేవ కన్నా మానవసేవే మిన్న:ఎమ్మెల్యే వెలగపల్లి.
రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ.
జగనన్నకు చెబుదాం ప్రజా సమస్యల పరిష్కార వేదిక:ఆర్డిఓ కిరణ్ కుమార్.
చిట్టమూరు రవి కిరణాలు న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం నూతన జీవో ద్వారా తీసుకువచ్చిన జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా చిట్టమూరులో నిర్వహించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఎంపీడీవో షాలేట్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు,జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ,గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్,జిల్లా,డివిజన్,మండల స్థాయి అధికారులు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి మాట్లాడుతూ మాధవ సేవ కంటే మానవసేవ మిన్నగా అధికారం కట్టబెట్టిన ప్రజలకు నాయకులు,అధికారులు అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం,అభివృద్ధితో పేదలకు అందుబాటులో ప్రజా రంజక పాలన కొనసాగిస్తూ, సేవలందిస్తున్నారు.ఇప్పటికీ సంక్షేమంతో పాటు మెరుగైన వసతుల రూపకల్పనకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టామన్న ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామన్నారు.త్వరలో పేదలకు అందుబాటులో ప్రతిష్టాత్మక సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు.తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ అనాదిగా భూసమస్యలు ఎదుర్కొంటున్న వారు రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పించిందన్న ఆయన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సవివరంగా వివరించారు.ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుతాం చక్కటి పరిష్కార వేదికని గూడూరు ఆర్డీవో కిరణ్ కుమార్ తెలిపారు. భూ సమస్యలపై ప్రజల నుండి వచ్చిన వినతులను నిశితంగా పరిశీలించి,వివరాలు అడిగి తెలుసుకుని,సమస్యల పరిష్కారానికి సావధానంగా గూడూరు ఆర్డిఓ కిరణ్ కుమార్ జవాబిచ్చారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పని చేస్తున్న ఆర్డీవో ప్రతి అర్జీదారుడు వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సమస్యలపై అర్జీలు స్వీకరించి,రసీదులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ విజయలక్ష్మి, వైకాపా నాయకులు,అన్ని శాఖల అధికారులు,అర్జీదారులు పలువురు పాల్గొన్నారు.