జగన్ రెడ్డి పరిపాలనకు చెక్ పెట్టడం మీ చేతుల్లోనే ఉంది
జగన్ రెడ్డి పరిపాలనకు చెక్ పెట్టడం మీ చేతుల్లోనే ఉంది
రవికిరణాలు ప్రతినిధి -దొరవారి సత్రం న్యూస్
మండుతున్న ధరలను చూస్తున్నారా, ఎప్పుడు లేనంత ధరలు పెరుగుదల విన్నారా, పేదవాడు సరుకులు కొనలేక, తినలేక పరిస్థితిని చూస్తూనే ఉన్నాం, ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడడంలో మీ చేతుల్లోనే ఉందంటూ ప్రజలనే ప్రశ్నించారు. సోమవారం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు చైతన్య యాత్ర మండల పరిధిలోని తనియాలి గ్రామంలో సాగింది. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ రాష్ట్ర మంత్రి పరసా వెంకటరత్నం, తిరుపతి పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, సారధ్యంలో చైతన్య యాత్రసాగింది. పనబాక లక్ష్మి మాట్లాడుతూ గత తెలుగుదేశం పాలను చూశారు కదా! నేటి పాలకుల అరాచకాలు చూస్తూనే ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని మార్చకపోతే పతనమైపోక తప్పదు, ఈసారి గట్టి గుణపాఠం చెప్పక తప్పదు అంటూ తనియాలి గ్రామ ప్రజలకు సూచించారు. ఆ గ్రామములోని ప్రజలను సమావేశపరచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలంటే చంద్రబాబు ప్రభుత్వమే రావాలని పనబాక సూచించారు. మట్టి మాఫియా అరాచకాలు అధికమయ్యాయి, ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది, వాటిని నియంత్రించే అధికారి కనిపించడం లేదు, న్యాయం అడిగితే దోషిగా చూస్తున్నారు, ఇలాంటి ప్రభుత్వానికి చెక్ పెట్టడంలో ఓటర్లే ప్రధాన పాత్ర పోషించాలని ఆమె కోరారు. పరస వెంకటరత్నం వైసీపీ ప్రభుత్వ పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గర పడుతున్నాయని అన్నారు. నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అందరం యుద్ధం చేసే రోజులు దగ్గరపడ్డాయి. ప్రజలకు సుభిక్ష పరిపాలన కావాలనుకుంటే అందరం కలిసికట్టుగా పనిచేసే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనిప్రజలను కోరారు. ఈ బస్సు యాత్రకు ముఖ్యఅతిథిగా తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు నరసింహ యాదవ్ హాజరయ్యారు, అదేవిధంగా నాయుడుపేట, పెళ్లకూరు, దొరవారిసత్రం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు ఎస్సీ సెల్ అధ్యక్షులు జకరయ్య మైనార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం అధ్యక్షులు షబ్బీర్ మాజీ ఎంపీటీసీ ఉదయ్ కుమార్ సూళ్లూరుపేట తడ మండలాల పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు రవీంద్ర నాయుడు నాగేంద్ర నాయుడు కృష్ణమూర్తి ప్రసాద్ నాయుడు రవి నాయుడు గ్రామస్థాయి నాయకులు హాజరయ్యారు. కాళహస్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేఎస్ సి వి నాయుడు, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులు సుగుణ, చక్రాల ఉష తదితరులు హాజరయ్యారు