నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం , చెల్లాయపాలెం క్యాంప్ సైట్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నేతలు మాజీ మంత్రి వర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ,జవహర్ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దినేష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు..
#AnamRamanarayanaReddy
Peoples Leader Peoples Leader
జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి
... సేవాదళ్ రాష్ట్ర పదవికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు
... మాళెం సుధీర్ కుమార్ రెడ్డి
ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న జగన్ మోహన్ రెడ్డిని మరోసారి 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు నిరంతరం కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ లో మార్కెట్ లో సామాన్య కార్యకర్తగా ఉన్న తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ పరిశీలకులుగా నియమించారన్నారు.
అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులుగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనపై ఎంత నమ్మకం ఉంచి నియమించినందుకు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ లను మరింత బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ్ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు
వై.యస్.ఆర్.సి.పి.జిల్లా పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నెల్లూరు నగర నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు మాజీ ఏఎంసి ఛైర్మన్ ఏసు నాయుడు గారు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు .
నాగార్జున విశ్వవిద్యాలయం : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ - హైదరాబాద్ (గవర్నమెంట్ బిజినెస్ స్కూల్) అందించే ప్రతిష్టాత్మక పరిశోధక ఫేలోషిప్ కు నాగార్జునా విశ్వవిద్యాలయం, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం పరిశోధక విధ్యార్ధి బయ్యా రాజేష్ కుమార్ ఎంపిక అయ్యారు. అచార్య రామినేని శివ రామ ప్రసాద్ మార్గదర్శకత్వంలో "భారతదేశంలో వ్యాపార ఇంక్యుబేషన్ సెంటర్ల పనితీరు, స్టార్టప్‌లపై దాని ప్రభావం, ఒక అధ్యయనం" అనే అంశంపై రాజేష్ పరిశోధన చేస్తున్నారు. ఈ ఫెలోషిప్ 3 దశల్లో జాతీయ స్థాయి ఎంపిక ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు. అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్ , పరీక్ష ,ఇంటర్వ్యూ ద్వారా తుది జాబితాను సిద్దం చేయగా, వివిధ రాష్ట్రాల నుండి 150 మంది పోటీ పడ్దారు. 50 మంది ఇంటర్వ్యూ దశకు చేరుకోగా, నలుగురు అభ్యర్థులను మాత్రమే ఫెలోషిప్ కు ఎంపిక చేశారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి రాజేష్ ఒక్కరే ఎంపిక కాగా, ఉత్తర ప్రదేశ్, కాశ్మీర్, తమిళనాడు నుండి మిగిలిన ముగ్గురు అభ్యర్థులు ఎంపిక అయ్యారు. దీని ద్వారా పరిశోధక విధ్యార్ధి ప్రతి నెల 33వేల రూపాయల వంతున మూడు సంవత్సరాల పాటు పరిశోధక సహాయం పొందగలుగుతారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఉపకులపతి అచార్య రాజశేఖర్ నేతృత్వంలో విశ్వవిద్యాలయం నుండి సమకూరిన విద్యా వనరులు, పరిశోధక సెల్ తోడ్పాటు తనకు ఫెలోషిప్ సాధనలో ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మరోవైపు కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధిపతి అచార్య శివరామ ప్రసాద్ జాతీయ స్థాయి సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడం ద్వారా పరిశోధనలకు నిరంతర మద్దతు అందించారన్నారు. రైతు కుటుంబానికి చెందిన రాజేష్, భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి సాధ్యమైనంత ఉత్తమ విధానాలను అందించడం కోసం ఈ ఫెలోషిప్‌ని సద్వినియోగం చేసుకుంటానన్నారు.
అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ సిలబస్
రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్
పాలిటెక్నిక్ అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా శిక్షణా పాలసీ
వర్చువల్ క్లాస్ రూమ్స్ పూర్తి స్దాయిలో సద్వినియోగం అయ్యేలా చర్యలు
నూతన పాలిటెక్నిక్ లలో భవన నిర్మాణం. సౌకర్యాల కల్పన వేగవంతం
ప్రతి విద్యార్ధి ఉపాధి పొందేలా చర్యలు తీసుకున్నాం : నాగరాణి
విజయవాడ: జాతీయ, అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యార్ధుల సిలబస్ ను ప్రతి సంవత్సరం అప్ గ్రేడ్ చేయవలసి ఉందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఉన్నత స్దాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. సాంకేతిక విద్యా శాఖ కేంద్ర కార్యాలయంలో బుధ, గురు వారం పాలిటెక్నిక్ విద్యా వ్యవస్ధపై సురేష్ కుమార్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆ శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో విభిన్న అంశాలపై లోతుగా చర్చించారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ సిలబస్ విషయంలో ఏర్పాటు చేసే కమిటీ ప్రతి సంవత్సరం కాలానుగుణంగా ప్రభుత్వానికి తగిన సూచనలు చేయగలిగేలా ఉండాలని, జాతియ స్దాయి విషయ సంబంధ నిపుణులకు స్ధానం కల్పించాలన్నారు. మైదుకూరు, బేతంచర్ల, గుంతకల్లులలో నూతనంగా మంజూరు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో వసతుల కల్పన, భవన నిర్మాణానికి అవసరమైన మైన కార్యాచరణపై ప్రభుత్వ ఆమౌదం కోసం క్యాబినెట్ నోట్ ను సిద్దం చేయాలన్నారు.
పాలిటెక్నిక్ అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా శిక్షణా విధానం సిద్దం చేయాలని సురేష్ కుమార్ అధికారులకు సూచించారు. పరిశ్రమలు వినియోగిస్తున్న ఆధునిక విధానాలపై తొలుత అధ్యాపకులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే అది విద్యార్ధులకు చేరుతుందన్నారు. ట్రైనింగ్ పాలసీలో ప్రతి సంవత్సరం ఎంత మందికి శిక్షణ ఇవ్వాలి, ఎక్కడ శిక్షణ అందించాలి అనే అంశాలను పొందుపరిచి సమగ్రంగా రూపుదిద్దవలసి ఉందన్నారు. పాలిటెక్నిక్ లలోని వర్చువల్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ను పూర్తి స్ధాయిలో సద్వినియోగం చేసుకోవాలని, వీటి పర్యవేక్షణ కోసం కమీషనరేట్ స్దాయిలో ఒక అధికారిని నియమించి వారంతపు నివేదికలు తీసుకోవాలన్నారు. ఇకపై ప్రతినెల సమీక్షలు నిర్వహిస్తామని, అధికారులు అందుకు సిద్దంగా ఉండాలని స్పష్టం చేసారు.
కమీషనర్ చదలవాడ నాగరాణి విభిన్న అంశాలను వివరిస్తూ పాలిటెక్నిక్ విద్యార్దులకు ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షా సమావేశం దృష్టికి తీసుకువచ్చారు, ఏ ఒక్క విద్యార్ధికి ఉపాధి లేకుండా ఉండకూడదన్న లక్ష్యం మేరకు పనిచేసామన్నారు. సిలబస్ మార్పులకు సంబంధించి విభిన్న చర్యలను తీసుకున్నామని, పోటీకి అనుగుణంగా విద్యార్ధులను తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు వెలగా పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి కార్యదర్శి రమణబాబు, సాంకతిక విద్యా శాఖ ఉపసంచాలకులు డాక్టర్ బి.కళ్యాణ్, డాక్టర్ ఎంఎ రామకృష్ణ, డాక్టర్ విజయ భాస్కర్ , సాంకేతిక విద్యా శిక్షణా మండలి సంయిక్త కార్యదర్శులు జానకి రామయ్య, సత్యన్నారాయణ తదితరులు పాల్గొ
సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే జగనన్న సురక్ష పథకం- ఎమ్మెల్యే కిలివేటి
లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
రవికిరణాలు ప్రతినిధి- దొరవారిసత్రం న్యూస్:- ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అర్హులందరికి అందించడమే జగనన్న సురక్ష పథకం అని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు ఆయన గురువారం ఏ కోళ్లు పంచాయతీ సచివాలయంలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తుదారులకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను వారి ఇంటి వద్దకే అందజేసే విధంగా ప్రభుత్వం తగుచర్యలు చేపట్టింది అన్నారు
గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలుపెట్టి ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి పథకాలను అందించకుండా డబ్బులు తీసుకొని పథకాలను అమ్మేశారని ఎమ్మెల్యే దుయ్యబట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ,వాలంటీర్లు వ్యవస్థ బాగా పనిచేస్తుంది.వాలంటీర్లు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకూ వెంటనే అందుతున్నాయి,జగనన్న సురక్ష ద్వారా ప్రతి గ్రామాల్లో, పట్టణలో ప్రజలకు మరింత లబ్ది చేకూరుతుంది అని ఎమ్మెల్యే అన్నారు అనంతరం లబ్ధిదారులకు 431 సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గోపిరెడ్డి ఎంపీడీవో సింగయ్య మండల ఉపాధ్యక్షులు వైసిపి సీనియర్ నాయకులు దువ్వూరు గోపాల్ రెడ్డి మండల ఏ కోళ్లు సర్పంచ్ ఆవుల బ్లెస్సి మండల నాయకులు మునస్వామి నాయుడు గోపిరెడ్డి మధుసూదన్ రెడ్డి భాస్కర్ రెడ్డి సురేష్ రెడ్డి పంచాయతీ సెక్రెటరీ రామయ్య సచివాలయం సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
రైలు నుండి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
రవికిరణాలు ప్రతినిధి -దొరవారిసత్రం న్యూస్:- మండల పరిధిలోని టపాఇండ్లు గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ ఫై రైల్లోనుంచి జారుపడి మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ సందర్భంగా సూళ్లూరుపేట రైల్వే ఎస్సై జి మాల కొండయ్య తెలుపుతూ మంగళవారం 9 గంటల సమయంలో పోలిరెడ్డి పాలెం నుండి సూళ్లూరుపేటకు రైల్వే స్టేషన్ మధ్యలో టపాయిడ్లు గ్రామ సమీపాన దిగువ రైలు మార్గంలో ఈ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు ఇతని వయసు 35 సంవత్సరాలు ఉండవచ్చు ఇతను వద్ద ఎలాంటి ఆధారాలు లేవు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగిందని తెలిపారు ఈ కేస్ రైల్వే ఎస్సై మాలకొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు