మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ
జన్మదిన వారోత్సవాల్లోరక్త దాన శిభిరం.
రవికిరణాలు మార్చి 19:-
సూళ్లూరుపేట లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణం లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా అలవల సురేష్ పాల్గొని , శిబిరాన్ని ప్రారంభించారు. చిరంజీవి సేవా సంఘం అధ్యక్షుడు మాభాష అద్వర్యం లో
మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు, ఈ రక్తదాన శిబిరంలో సుమారు 66 మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారని రక్త దానం చేసిన మెగా అభిమానులకు జన సైనికులకు పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు, పట్టణంలో ఎవరికి రక్తం అవసరం అయినా మమ్మల్ని సంప్రధిస్తే మా వంతు బాధ్యతగా రక్తమందిస్తామని మాబాషా తెలిపారు.
సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ సంబరాల సభ.
పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సన్మానాలు, సత్కారాలు.
కేక్ కట్ చేసి దివంగత నేతలు ఎన్టీఆర్ , వీఎమ్ఆర్ కు నివాళి .
రవికిరణాలు మార్చి 19:-
సూళ్లూరుపేట తెలుగు దేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నిక విజయోత్సవ సంబరాల సభను జరుపుకున్నారు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి నేతృత్వం లో జరిగిన ఈ సమావేశం లో ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు వేనాటి ముని రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.అనంతరం తెలుగుదేశం పార్టీ కేకును నియోజకవర్గం ఇంచార్జి నెలవల
సుబ్రహ్మణ్యం చేతులు మీదుగా కట్ చేసి అందరికి పంచి పెట్టారు. అధికార ప్రతినిధి
తిరుమూరు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి
అభ్యర్థుల విజయానికి శ్రమించిన తడ,సూళ్లూరుపేట,దొరవారిసత్రం మండలాల పార్టీ అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్సులు, క్లస్టర్ ఇంచార్జిలను , యూనిట్ ఇంచార్జిలకు ఘనంగా
సన్మానం చేసి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. టిడిపి గెలుపుకు ఓట్లు వేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సమావేశం లో టిడిపి నేతలు ఆకుతోట రమేష్,బొమ్మను శ్రీధర్,శివాజీ,లోకు శంకరయ్య,సుదర్శన్,సెల్వం,ముప్పాళ్ల శ్రీధర్ రెడ్డి,
వేనాటి జనార్దన్ రెడ్డి,అలవల శ్రీనివాసులు, శ్రీనివాసులు నాయుడు ,బుద్ది విజయలక్ష్మి,
ఏజీ కిషోర్,వేనాటి శ్రీకాంత్ రెడ్డి,గురకల శంకరయ్య, గాడి నారాయణ రెడ్డి , కుదిరి పెంచలయ్య,
వాకిచర్ల రమేష్,నీలకంఠం,బండారు ఆంజనేయులు,చెంచు కృష్ణయ్య,ప్రమీలమ్మ మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న విద్యాదీవెన: తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్..
జగనన్న విద్యా దీవెన కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు..
గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2017 నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ప్రభుత్వం రూ.13,311 కోట్లు సాయం అందించింది. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ ఈ పథకాలను వర్తింప చేస్తూ పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది.
సీఎం జగన్ ప్రసంగం:
♦సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్‌లు నచ్చరు..
♦ఎన్నికుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే
♦చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు
♦ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయి
♦పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు
♦అర్హతలేని వారు మన ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారు
♦విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం
♦కుటుంబం, రాజకీయ, మనవతా విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం
♦మన ప్రభుత్వంలో డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్
♦గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో, తినుకో..
♦కొత్తగా 14 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చాం
♦17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి
♦45 నెలల్లో డీబీటీ ద్వారా నేరుగా 1.9లక్షల కోట్లు అందించాం
♦ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజులు చెల్లిస్తున్నాం
♦ఫీజులు మాత్రమే కాదు వసతి ఖర్చులు కూడా ఇస్తున్నాం
♦ఏప్రిల్ 11న రెండో విడత వసతి దీవెన నిధులు
♦ఈ పథకాలతో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది
♦జీఈఆర్ రేషియో 32 నుంచి 72 శాతానికి తీసుకెళ్లే దిశగా అడుగులు
♦ప్రభుత్వ బడులు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేస్తున్నాం
♦మీ పిల్లల చదువులకు నాది బాధ్యత
♦ఉన్నత విద్యకు మరింత ఊతమిచ్చే చర్యలు తీసుకున్నాం
♦8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం
♦రెండేళ్లలో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం
♦ప్రభుత్వ పాఠశాలలతో కార్పొరేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితి తెస్తాం
♦పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టాం: సీఎం జగన్
♦పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే
♦ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువుతోనే సాధ్యం
♦ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది.
♦ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువే
♦కలెక్టర్ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నంచి వచ్చిన వ్యక్తి
♦చదువుకు పేదరికం అడ్డుకాకూడదు
♦దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు
♦కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత మీ జగనన్నదే
♦గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు
♦ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదు
♦లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నాం
♦గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అరకొరగా ఇచ్చేవాళ్లు
♦ఫీజులు కట్టలేక విద్యార్థులు అవస్థలు పడేవారు
♦తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయి
♦అందుకే విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నాం
♦జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చాం
♦27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చాం
♦చంద్రబాబు హయాంలోని బకాయిలను సైతం చెల్లించాం
♦విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నాం
♦తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుంది
♦కాలేజీలో సమస్యలుంటే 1092కి ఫిర్యాదు చేస్తే మేమే మాట్లాడతాం..
SPS నెల్లూరు జిల్లా
జిల్లా పోలీసు కార్యాలయం, తేది.19.03.2023.
HC:2370- శ్రీ చంద్రశేఖర్ రాజు గారికి ఘన నివాళులు అర్పించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
రోడ్డు ప్రమాదంలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీ S. చంద్ర శేఖర్ రాజు గారి ఇంటికి వెళ్లి అకాల మరణానికి చింతిస్తూ ఘన నివాళులు అర్పించిన జిల్లా యస్.పి. గారు మరియు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది. చంద్ర శేఖర్ రాజు గారి కుటుంబానికి పోలీసుశాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా.. ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా యస్.పి.గారు. 1998 వ బ్యాచ్ కి చెందిన చంద్ర శేఖర్ రాజు గారు ప్రస్తుతం సోమశిల పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్నారు. స్వస్థలం నెల్లూరు టౌన్.. భార్య శ్రీమతి జయ లక్ష్మీ, ఇద్దరు కుమారులు. అంత్యక్రియలకు Rs.50,000/- తక్షణమే అందజేసిన జిల్లా యస్.పి. గారు.. పోలీసు అధికారులు అక్కడే ఉండి తోడ్పాటు అందించాలని ఆదేశాలు.. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణ.
మేరిగను ఘనం గా సత్కరించిన పొణకా దేవసేనమ్మ అభిమానులు
MLC మేరిగ మురళి స్వాగత కార్యక్రమానికి భారీగా హాజరైన గూడూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పొణకా దేవసేనమ్మ అభిమానులు, ఈ సందర్భంగా పొణకా దేవసేనమ్మ అభిమానులు మేరీగ మురళి గతం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన చిత్రపటాన్ని ప్రత్యేకించి తయారుచేసి MLC మేరిగ మురళికి బహుకరించారు,మరియు పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పోలిపోయిన రమేష్, కోదండయ్య, కోడిపర్తి శ్రీధర్, ముని, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు..
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నేను అత్యంత కష్టకాలంలో ఉన్న మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చా. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత 9 సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలమధ్యలో ఉంటూ ఎమ్మెల్యే అంటే మా శ్రీధర్ రెడ్డిలాగా ఉండాలి అనే విధంగా చేసి చూపించా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీ శానసభ్యుడిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చెప్పులు అరిగేలా తిరిగా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అధికారపక్షం నుండి దూరంగా జరిగిన తరువాత ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఋణం తీర్చుకుంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.