గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో శ్రీసిటీ స్టాల్‌ను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
- ఇండస్ట్రియల్ & లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ప్యానెల్ సెషన్‌లో ప్రసంగించిన శ్రీసిటీ ఎండీ
రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ,మార్చి 3, 2023 :
విశాఖపట్నంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జిఐఎస్)-2023కి కేంద్ర రోడ్డు రవాణా & హైవే శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో పాటు ఏపీకి చెందిన పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శ్రీసిటీ స్టాల్‌ను ఏపీ సీఎం, శ్రీసిటీ ఎండీ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఇతర ప్రముఖుల సమక్షంలో నితిన్ గడ్కరీ ప్రారంభించారు. స్టాల్ ను తిలకించి వారు శ్రీసిటీ విశిష్టతను ప్రశంసించారు. ఇందులో డిజిటల్ డిస్‌ప్లే బోర్డ్‌లు, స్కేల్-డౌన్ 3D మోడల్‌ల ద్వారా శ్రీసిటీ వ్యాపార నగరం ప్రత్యేకతలు, స్థాన ప్రయోజనాలు, ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, ఇతర అంశాలను హైలైట్ చేశారు. శ్రీసిటీలోని కొన్ని పరిశ్రమలచే ప్రదర్శించబడిన FMCG, వివిధ బ్రాండ్‌ల ఎయిర్ కండిషనర్లు, ఆటోమొబైల్ కాంపోనెంట్‌లు, వీల్ చైర్లు, ఇసుజు కార్లు తదితర "మేడ్ @ శ్రీ సిటీ ఉత్పత్తులు", సమ్మిట్‌కు విచ్చేసిన ప్రతినిధులను విశేషంగా ఆకర్షించాయి.
సదస్సు ప్రారంభం తరువాత, ఇండస్ట్రియల్ & లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై జరిగిన ప్యానెల్ చర్చలో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడారు. తన లోతైన విశ్లేషణలు, అభిప్రాయాలను పంచుకుంటూ, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి మంచి మౌళిక సదుపాయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలు అందించే అనువైన వ్యాపార వాతావరణాన్ని పెట్టుబడిదారులు పరిశీలిస్తారని ఆయన అన్నారు. ఈ కోవలో జగన్ మోహన్ రెడ్డి డైనమిక్ నాయకత్వం పెట్టుబడిదారులపై పెద్దఎత్తున ప్రభావం చూపిందన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన కార్యక్రమాలు, చురుకైన విధానాలు, ప్రధాన నౌకాశ్రయాలతో కూడిన సుదీర్ఘ తీరప్రాంతం, అద్భుతమైన రోడ్డు & రైలు నెట్‌వర్క్‌లు, నాణ్యమైన శక్తి, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవశక్తి, గొప్ప ఖనిజ వనరులు మరియు ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ & బిజినెస్ పార్కులతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు.
మల్టీ మోడల్ కనెక్టివిటీని అందజేస్తూ లాజిస్టిక్స్ ధరను తగ్గించాలనే లక్ష్యంతో చేపట్టిన కేంద్ర పిఎం-గతిశక్తి చొరవకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం AP లాజిస్టిక్స్ పాలసీ 2022-27 ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా, ఆగ్నేయాసియాకు గేట్‌వేగా మారుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
శ్రీసిటీని ఉదాహరణగా పేర్కొంటూ, ‘వర్క్-లైవ్-లెర్న్-ప్లే’ అనే సూత్రాలపై అభివృద్ధి చేసిన దాని ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌళిక సదుపాయాలు ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తుందో ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వివరించారు.
ఇతర ప్యానెలిస్ట్‌లలో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) శ్రీమతి సుమితా దావ్రా, GMR గ్రూప్ - ఎయిర్‌పోర్ట్స్ ఛైర్మన్ జిబిఎస్ రాజు, లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సీఈఓ రవికాంత్ యమర్తి, CEO, TVS సప్లై చైన్ సొల్యూషన్స్ సీఓఓ సుకుమార్ కామేశ్వరన్, వెల్స్పన్ వన్ లాజిస్టిక్స్ సీసీఓ అనయ్ శుక్లా వున్నారు.