మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం!
మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధం!
నేడు అర్థరాత్రి 02.18 నిమిషాల కు కౌంట్ డౌన్ ప్రారంభం.
నేడు రోదసీలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు.
రవి కిరణాలు తిరుపతి జిల్లా (సూళ్లూరుపేట) శ్రీహరికోట:-
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నేడు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ను ప్రయోగించేందుకు ఇస్రో సైంటిస్టులు నిమగ్నం అయ్యారు.
నేడు ఉదయం 9.18 గంటలకు ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ మూడు ఉపగ్రహాలను మోసుకొని రోదసీలోకి దూసుకెళ్లనుంది. ఈ సిరీస్‌లో ఇది రెండో ప్రయోగం. గతేడాది ఆగస్టు 7న మొదటిసారిగా పంపిన ఎస్ఎస్ఎల్వీ-డీ1 ప్రయోగం విఫలమవడంతో.. ఈసారి ఆ పొరపాట్లు జరగకుండా సైంటిస్టులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి ప్రయోగం గం "13.02 నిమిషాల్లో పూర్తి కానుంది. ప్రయోగవేదికపై సిద్ధంగా ఉన్న రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేస్తున్నారు..
నింగిలోకి దూసుకెళ్లనున్న మూడు ఉపగ్రహాలు:
సుమారు 34 టన్నుల బరువున్న 120 మీటర్ల పొడవైన ఈ రాకెట్ రేపు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. దీనికి సంబంధించి రిహార్స్‌ల్స్‌ను, మధ్యాహ్నం 1 గంటలకు మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ఈఓఎస్-07, జానస్-1, అజాదీశాట్-2 అనే మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమే ఈ సారి టార్గెట్.
ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఈ రాకెట్‌ను ఫైనల్‌గా టెస్ట్ చేస్తారు. తుది విడత తనిఖీలు తర్వాత ప్రయోగానికి 7 గంటల ముందు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. అంటే నేడూ వేకువజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 13 నిమిషాల్లోనే రాకెట్ తొలి ఉపగ్రహం ఈఓఎస్-07ను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఆ తర్వాత మరో రెండింటిని నిమిషం వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెడతారు. వీటన్నింటినీ 450 కిలోమీటర్ల ఎత్తులో 15నిమిషాల ప్రయాణంలో భూమి చుట్టూ సర్క్యూలర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఇక ఎస్ఎస్ఎల్వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో కొనసాగనుంది.