మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ వైద్య సౌకర్యం కల్పించాలి. సిఐటియు అనుబంధ సంస్థ నాయకులు.
మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ వైద్య సౌకర్యం కల్పించాలి. సిఐటియు అనుబంధ సంస్థ నాయకులు.
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
సిఐటియు అనుబంధ సంస్థ సూళ్ళూరుపేట మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సూళ్ళూరుపేట నాయకులు, కార్మికులు సోమవారం ఆర్డీఓ గారికి వారి దీర్ఘకాలిక సమస్యలపై వినతి పత్రము సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు కా. సాంబశివయ్య మాట్లాడుతూ వైద్య సౌకర్యము (ఈయస్ఐ) కొరకు కార్మికులు గత కొన్ని నెలలుగా సభ్యత్వ రుసుము చెల్లిస్తున్నారని కాని ప్రభుత్వము వైధ్య సౌకర్యము, ప్రసూతి ఖర్చులు, లీవులు తదితర అందుబాటులో లేకుండా చేసి కార్మిక హక్కులను హరిస్తుందన్నారు. సర్వీసు అందుబాటులో లేని కారణంగా ఇంతవరకు వసూలు చేసిన రుసుము వాపస్ చేయాలని డిమాండు చేసారు. సంవత్సరాలు తరబడి పనిచేస్తున్న కార్మికులను పర్మనెంటు చేయాలని డిమాండు చేసారు. తిరుపతి జిల్లా మున్సిపల్ కార్మికుల కార్యదర్శి కా. గోపి మాట్లాడుతూ ప్రావిడెంట్ ఫండ్ లో వున్న వ్యత్యాసాలను ఆఫీసులోనే సరిచేయలన్నారు. అలాగే గుర్తింపు కార్డులు జారీచేయాలని, ముఖ హాజరును నిరాకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమములో సిపిఎం మండల కమిటి కార్యదర్శి కా. పద్మనాభయ్య మున్సిపల్ వర్కర్స్ నాయకులు రామయ్య పళని చంగయ్య రమణయ్య వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.