మున్సిపల్ ఆఫీస్ కూడలిలోని నడివీధి గంగమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దానిలో భాగంలోనే హరికథ భాగవతార్ చంద్రయ్య ఆధ్వర్యంలో దక్షయజ్ఞం హరికథ శ్రోతలను ఆకట్టుకుంది ఈ సందర్భంగా భాగవతార్ చంద్రయ్య గారిని వయోలిన్ చక్రవర్తి తబలా కోదండ రాముడి ని రాయలసీమ రంగస్థలి ఛైర్మెన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రంగస్థలి ప్రతినిధులు సింగంశెట్టి సుబ్బరామయ్య రాజు వాసు స్వామి తొండమనాడు సుబ్రమణ్యం రెడ్డి విజయ్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసులు కేశవులు ఉన్నారు
SPS నెల్లూరు జిల్లా
“రోడ్డు భద్రతా – ప్రమాదాల నియంత్రణ” పై ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్వహించిన VC లో పాల్గొన్న జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
చిలకలూరు పేట నుండి నెల్లూరు వరకు హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణపై నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు, యస్.పి.లు, హైవే అధారిటీ, పలు విభాగాలు, సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారితో కలిసి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ. రోడ్డు ప్రమాదాల నివారణకు సంయుక్తంగా వ్యూహరచనలు.. మరణాల రేటు తగ్గించుటే ప్రధాన ధ్యేయం.-CS గారు మూడు జిల్లాల అధికారుల నుండి సలహాలు స్వీకరణ.. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారు ముందస్తు జాగ్రత్తలపై PPT ద్వారా విశదీకరణ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, పెట్రోలింగ్ వ్యవస్థ, LHMS, స్పీడ్ లెన్స్ గన్స్, బ్రీత్ ఎనలైజర్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రాముఖ్యత, ఇతర ప్రణాళికలను వివరించిన జిల్లా యస్.పి. గారు.. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఎక్కువగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుట, రాంగ్ పార్కింగ్, గేదెలు అడ్డు రావడమే ప్రమాదాలకు ముఖ్య కారణాలు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా హైవే పై 12 స్టేషన్ ల పరిధిలో 18 బ్లాక్ స్పాట్ లను గుర్తించడం జరిగింది. తదనుగుణంగా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. 38 వల్నరబుల్ లోకేషన్స్ గుర్తించామని, రేడియం జాకెట్స్, డ్రమ్స్ ఏర్పాటు చేసామని, ప్రతి నెల అన్ని విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, చైతన్య కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ పరికరాల సేకరణ వాటి ఉపయోగం, తదితర అంశాలను వివరించారు. అన్ని సౌకర్యాలతో కనీసం 15 నిముషాలలో అంబులెన్స్ సేవలు మరింత చేరువయ్యేలా చూడాలని తెలిపారు.
రేపటి నుంచి వైఎస్కార్ కళ్యాణమస్తు షాదీకి తోఫా- వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆడపిల్లలకు పెళ్లి కానుకగా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది.వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను అక్టోబర్ 1న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకాల అమలుకు సంబంధించిన వైబ్ సైట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాకుండా, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను తగ్గించడమే లక్ష్యంగా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.
నంద్యాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి...
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు నంద్యాల మండలం జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నంద్యాల ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ పోటీలను నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఇషాక్ భాష, ప్రారంభించారు...
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నందు జెడ్పిటిసి గూగుల్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరమని యువత క్రీడలలో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా చూడాలని యువతకు క్రీడా పోటీలను నిర్వహించి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించవచ్చని క్రికెట్ పోటీలను ఎటువంటి అవాంతరాలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గోకుల కృష్ణారెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు దేశం సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు పోలూరు మహేశ్వర్ రెడ్డి, ప్రద్దున్న రెడ్డి, మరియు వైసీపీ నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు
తిరుపతి జిల్లా...
శ్రద్ధ,సహనంతో విధులు నిర్వర్తించాలి.
మనం సేవ చేయడానికి మాత్రమె వచ్చాము.
అనంతపూర్ రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ఐపీఎస్., జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,
రేపు శ్రీవారి గరుడ సేవ నేపద్యంలో వివిధ జిల్లా ల నుండి వచ్చిన పోలీస్ అధికారులతో అనంతపూర్ రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ ఐపీఎస్., జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వారు బద్రత పై పోలీస్ కంట్రోల్ రూమ్ నందు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో చిత్తూర్, అన్నమయ్య, బాపట్ల, పార్వతి పూరం ఎస్పి ల తో పాటు అడిషనల్ ఎస్పీ లు,డిఎస్పీ లు, సిఐలు పాల్గొన్నారు.
డీఐజీ గారు మాట్లాడుతూ కరోనా కారణంగా రెండు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో శ్రీవారి బ్రహ్మోత్సవం జరుగుతున్నది రేపు శ్రీవారి గరుడ సేవ రోజున రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా, భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి బందోబస్తు ఏర్పాటు చేశాము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,ఇతరత్ర సంఘ విద్రోహ శక్తులును కూడా ఎదుర్కోవడానికి అన్ని చర్యలు చేపట్టాం మాన్నరు
గరుడ సేవ అనునది శ్రీవారికి మిక్కిలి ఇష్టమైన ముఖ్యమైన సేవ కనుక దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తారని అంచనా కాబట్టి ఐదంచెల భద్రత ను ఏర్పాట్లు చేశాము తిరుపతి అవుట్ కట్స్ లో తిరుమలకు వేళ్ళు వాహనాలకు పాసులు ఇవ్వడం ఇవ్వడంతో పాటు తొమ్మిది రూట్లలో హైవేల దగ్గర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తరువాతే తిరుపతి లోకి అనుమతిస్తామని అన్నారు
తిరుపతి లోని కొన్ని పార్కింగ్ ప్రాంతాల్లో కూడా వాహనాలను తనిఖీ చేసి పాసులు జారీ చేసి కొండమీదికి అనుమతిస్తారు నాలుగు చక్రాల వాహనాలను మాత్రమే కొండకి అనుమతిస్తారు. ఇలా కొండ కి వచ్చిన వాహనంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశములలో వాహనములను పార్కు చేసి భక్తులు మాడవీధుల్లో కు చేరుకుంటారు మాడవీధుల్లో గ్యాలరీలో సుమారు రెండు లక్ష మంది కిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటది. మిగిలిన ఇన్నర్ లైన్ లోని భక్తులలందరికీ మంచి దర్శన భాగ్యం కలిగించడానికి పోలీస్ వారు అన్నివిధాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించేందుకు అన్ని చర్యలు తీతీసుకున్నాము అని అన్నారు.
ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,గారు మాట్లాడుతు భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని వారి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని తిరుమల ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రవర్తించాలి గరుడ సేవ కు అశేష భక్తజనం వస్తారు ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ, టీటీడీ వారు సమన్వయంతో భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
భక్తులు చిన్నపిల్లలతో వచ్చు భక్తులు జాగ్రత్తగా ఉండాలని అలాగే విలువైన వస్తువులను వెంట తీసుకురావద్దని వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిదన్నారు.
వృద్ధులు పిల్లలు తప్పిపోకుండా 14 జియో టాక్ సెంటర్లను ఏర్పాటు చేసి అక్కడ సిబ్బందిని ఉంచడం జరిగిందని తిరుమల వచ్చు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
నేరనియంత్రణ కొరకు ప్రత్యేక నిపుణులైన క్రైమ్ పోలీసుల బృందాలను ఏర్పాటు చేశామని ఈ బృందంలో ఇతర రాష్ట్ర సిబ్బంది కూడా ఉంటారని ఎలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు.
యావన్మంది అశేష భక్త జనం స్వామివారి సేవను చూసి తరించడానికి భక్తులందరూ పోలీసు వారు టీటీడీ వారు సూచించిన సూచనలను తప్పకుండా పాటించాలని అన్యస్తులు మాటలు నమ్మరాదని ఏ అవసరమైన ఏ సహాయమైనా పోలీసు మరియు టీటీడీ వారి సహాయం తీసుకోవాలని అలాగే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.
కేతంరెడ్డి వినోద్ రెడ్డిని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా చేసుకుంటాం -పవనన్న ప్రజాబాటలో మంగళహారతులు పట్టి ఆశీర్వదించిన ప్రజలు
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 137వ రోజున 49వ డివిజన్ సంతపేటలోని గోపీ టీ సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రజలు కేతంరెడ్డికి దిష్టి తీసి మంగళహారతులు పట్టి, శాలువా కప్పి పూలమాలలు వేసి అపూర్వ స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వ పాలనతో విసిగి వేసారి పోతున్నామని, రానున్న ఎన్నికల్లో కేతంరెడ్డి వినోద్ రెడ్డిని నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తనను నమ్మి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని, ఆనాటి ఎన్నికల్లో తక్కువ రోజుల వ్యవధిలో వైసీపీ, టీడీపీల తీవ్ర ధనప్రవాహాన్ని ఎదుర్కొని నిలబడడం జరిగిందని, నాడు ఓటమి పాలైనా ఏనాడు ధైర్యాన్ని కోల్పోకుండా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేస్తూ, ప్రజాసమస్యల మీద పోరాడుతూ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. నియోజకవర్గం సమస్యలను ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నామని, వారి స్ఫూర్తితో పవనన్న ప్రజాబాట కార్యక్రమం సాగుతోందని, ఈ కార్యక్రమాన్ని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే యజ్ఞంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పార్టీ గెలుపు ప్రధాన పాత్ర పోషించబోతుందని, ఎన్ని అవరోధాలు ఎదురైనా తట్టుకుని పార్టీని గెలిపించే స్థితిలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారని, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.