*రైతు భరోసా కేంద్రాలకు అనుబంద గోడౌన్ ల నిర్మాణాలు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్*
తిరుపతి, సెప్టెంబర్ 20: జిల్లాలో రైతు భరోసా కేంద్రాలకు అనుబంద గోడౌన్ ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అద్యక్షతన, జే.సి డి.కె బాలాజీ వైస్ చైర్మన్ హోదాలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల పంట చేతికందే లోపు నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరగాలని అన్నారు. ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు డి.సి.సి.బి, నాబార్డ్ సహకారంతో మొదటి దశలో ప్రభుత్వం మంజూరు చేసిన 30 గోదాములు యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. డి ఈ మార్కెటింగ్ శ్రీ హరి వివరిస్తూ మొదటి దశలో మంజూరు అయిన 30 లో 29 గోదాముల నిర్మాణ పనులు ప్రారంభించబడి వివిధ దశలలో ఉన్నాయని నిర్ణీత సమయంలోపు వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. దాదాపు 500 మెట్రిక్ టన్నులు నిల్వ ఉండే గోదాముల నిర్మాణాలు కనుక రైతులకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లాకు మొత్తం 59 కి గాను మొదటి దశలో 30 గోదాములు మంజూరు జరిగిందని ఇవి సకాలంలో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ కమిటీ సమావేశంలో మొదటి దశలో మంజూరైన పనులలో 10 ఎం పి ఎఫ్ సి గోడౌన్ లకు సంబంధించిన బిల్లుల చెల్లింపు రూ. 61.10 లక్షలను, పెండింగ్లో ఉన్న కల్లూరు సైట్ నకు ప్రత్యామ్నాయంగా సైట్ మార్పుకు, చిట్టి చెర్ల చిన్నగొట్టిగల్లు మండలం సంబంధించిన గోడౌన్ బిల్ రూ.3,07,919 చెల్లింపులకు ఆమోదించడం జరిగింది.
ఈ సమీక్షలో జిల్లా కో-ఆపరేటివ్ అధికారిని రమాదేవి, జిల్లా వ్యవసాయ శాఖాధికారిని దొరసాని, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు, నెల్లూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ శంకర్ బాబు, డి పి డి ఎం ప్రదీప్, మార్కెటింగ్ శాఖ ఉద్యాన శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.