నాయుడుపేట కె ఎమ్ ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించిన గౌరవ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట లో గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ కిలివేటి సంజీవయ్య ఈరోజు నాయుడు పేట లోని కె ఎమ్ ఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశం భారీ ఎత్తున నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు మరియు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంపీ గురుమూర్తి గారు మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ రాధా కిషోర్, కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, కలికి మాధవ రెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి, 786 రఫీ, గోనుపల్లి గురుమూర్తి ,కాకు, జగదీశ్ రెడ్డి, పోట్లపూడి రాజేష్,లాయర్ కుమార్, మరియు నాయుడుపేట సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నాయుడుపేటలో ఘనంగా నిర్వహించారు,
అమరావతి: పోలీసుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వచ్చిన చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత కాళ్ల పైనుంచి పోలీసు జీపు వెళ్లడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.ఎవరి అండ చూసుకుని పోలీసులు ఇలా రాక్షసంగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్న పోలీసులను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు.తాము అధికారంలోకి వచ్చాక గాడి తప్పిన ప్రతి అధికారిపైనా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. సీఎం జగన్ దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి అక్రమ కేసులు పెట్టడంలో అర్థమేంటని ప్రశ్నించారు. నేరస్థులను కాపాడుతున్నారా? అని చంద్రబాబు నిలదీశారు.