తిరుపతి జిల్లా నాయుడుపేట
నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ మాతమ్మ దేవత కొలుపు కార్యక్రమం
సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ మాతమ్మ అమ్మవారి కొలుపు కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని గ్రామ పురవీధుల్లో బాణాసంచా వేడుకలతో మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది
తిరుపతి జిల్లా...గూడూరు
గూడూరు లో నిబంధనలు పాటించని వాహనాలు పై ఉక్కుపాదం మోపుతాం...ఎస్సై గోపాల్ యాదవ్
ప్రయాణ సమయాల్లో వాహన దారులు సరైన ధ్రువ పత్రాలు కలిగి ఉండాలి
అధిక శబ్దాలు వచ్చేలా సైలెన్సెర్ లు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవు
ఈ రోజు గూడూరు పట్టణం హాస్పెటల్ రోడ్ లో నెంబర్ ప్లేట్ లేని,సరైన పత్రాలు లేని,అధిక సౌండ్ వచ్చేలా సైలెన్సెర్ బిగించిన వాహనాలు,నిబంధనలు ఉల్లంఘించి తిప్పే వాహనాలు పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన గూడూరు ట్రాఫిక్ ఎస్సై గోపాల్ యాదవ్ నిబంధనలు ఉల్లగించి తిరిగే వాహనాలకు జరిమానాలు విధించారు, వాహనాల్లో తిరిగే వారు కచ్చితంగా సరైన పత్రాలు కలిగి ఉండాలని లేనిచో ట్రాఫిక్ ఉల్లంఘన చట్టాలు కింద కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ఎస్సై గోపాల్ యాదవ్ తెలియచేసారు,ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్సై గోపాల్ యాదవ్ తో పాటు కానిస్టేబుల్ , పాల్గొన్నారు....
✍️రవికిరణలు టీవీ
రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా 64శాతం SSC ఉత్తీర్ణత తగ్గడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు
రాష్ట్రంలో ఎస్ ఎస్ సి ఉత్తీర్ణత 64శాతానికి పడిపోవడంతో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారు ఎంతో మంది ప్రజలను విద్యావంతులను చేసిన భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు రాలు సావిత్రి బాయి పూలే మరియు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహలకు మాలలు వేసి నివాళులు అర్పించి మీడియాతో సమావేశమయ్యారు...సమావేశంలోని ముఖ్యాంశాలు
📎వైసీపీ అవగాహన లేని పాలన వలన అని వర్గాలు నష్టపోయారు ఇపుడు పిల్లల భవిష్యత్తు పాడుఅవుతుంది
📎 నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపిన జగన్ ప్రభుత్వం రంగులు వేయడానికి తప్పిస్తే మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమైంది.
📎మార్కుల విషయంలో కూడా అనేక అవకతవకలు స్పష్టంగా కనబడుతుంది.
📎నిర్వహణ లోపం కారణంగా రాష్ట్రాన్ని అజ్ఞానంలో ముంచెత్తుతున్నారు జగన్ గారు ....
📎జగన్ ఉచితంగా ఇచ్చే స్కూలు బ్యాగులు నాణ్యతా లోపం తో పది రోజులకే చిరిగి పోతున్నాయు..
📎విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులను బ్రాందీ షాప్ అమ్మకందారు,క్యూల కంట్రోలుకు కూడా వాడిన మన ప్రభుత్వం వారి మనోభావాలను దెబ్బ తీసింది ఈ వై సి పి ప్రభుత్వం..
📎స్కూల్ బ్యాగులు బెల్టుల మీద ఫోటోలు వేసుకోవడానికి చూపిన శ్రద్ధ పిల్లలకు చదువు చెప్పే నిర్వహణ విషయం లేకపోయింది...
📎 అమ్మ ఒడి పథకం లో మరుగుదొడ్ల నిర్వహణ పేరు తో ₹1000 రూపాయలు వసూలు భాద్యత టీచర్ల పై వేసి వారి సమయాన్ని వృధా చేసింది.
📎రెండు లక్షల మంది ఫెయిల్ అయితే వారందరికీ విద్యాదీవెన సంవత్సరం పాటు మిగులుద్ది అనే ఆలోచన తో ఉత్తీర్ణత తగ్గించినట్లున్నారు...
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారి తో పాటు ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్,జనసేన రాష్ట్ర సెక్రటరీ కొట్టే వెంకటేశ్వర్లు,ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నళిసెట్టి శ్రీధర్,జిల్లా సెక్రెటరీ ప్రశాంత్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి సుధీర్ కలువాయి తో పాటు పలువురు జనసైనికులు పాల్గొన్నారు...
ఒక్క అవకాశం అంటూ వచ్చిన వైసీపీ నాయకులు 3డి (దోపిడీ,దౌర్జన్యం,దగా) చూపిస్తున్నారు .....
చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు....
నెల్లూరు రూరల్ కల్లూరు పల్లి....25 వ డివిజన్...
జనసేన కార్యకర్త రమణ పిలుపుమేరకు డివిజన్ కు విచ్చేసిన జనసేన జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ గారికి స్థానికులు సమస్యలను వివరించారు
📎సమస్యలను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామని స్థానిక నాయకుడు రమణ గారి ఆధ్వర్యంలో మీరు అందరూ ముందుకు వస్తే కమిషనర్ గారిని కలిసి స్థానిక సమస్యల గురించి వివరించి వాటి పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలియజేశారు
📎 కార్పొరేషన్ లిమిటెడ్లో ఉన్నప్పటికీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని పడితే రోడ్లు పోతున్నాయని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక రోడ్లపై డ్రైనేజ్ వాటర్ వదిలేయడం వల్ల పరిసరాలను అని తమను పట్టించుకునే నాధుడే లేదని ఓట్లు మాత్రం వచ్చి తిరిగి ఓట్లు వేయించుకున్న నాయకులు సమస్యల కార్పొరేషన్ పరిధిలో ఉన్నా తమ సమస్యలను గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు
కొండాపురం లో దారుణ హత్య
తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామంలోని వడ్డి పాలెంలో విషాదం చోటుచేసుకుంది.
మంగళవారం తెల్లవారుజామున
భార్య దనమ్మ(55)ను కిరాతకంగా హత్య చేసి భర్త రమణయ్య పరారీలో ఉన్నట్లు వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు.
15 సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్న ధనమ్మ,రమణయ్య లు 2 నెలల క్రితం మళ్ళీ కలిసి ఒకటిగా ఉంటూ నెల క్రితం మళ్ళీ గొడవలు పడి విడిగా జీవిస్తున్నారు.దనమ్మ,రమణయ్య కు ముగ్గురు పిల్లలు,అదే గ్రామం లో ఒక కొడుకు తో కలిసి జీవిస్తున్న దనమ్మ ను రమణయ్య ఈ రోజు తెల్లవారు జామున ఇనుప రాడ్డు తో తల పగలగొట్టి అతి కిరతంగా చంపినట్టు సమాచారం..పరారీలో నిందితుడు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వాకాడు మండలం లోని ని బాలిరెడ్డి పాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మద్యం కుటుంబాలను కుదిపేస్తోంది
పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన మహిళలు
మద్యనిషేధం చేస్తామని నమ్మించి మోసగించిన జగన్ కి ఈ సారి ఓటేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకుంటామని స్పష్టం చేసిన మహిళలు
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిర్విరామంగా సాగిస్తున్న పవనన్న ప్రజాబాట ప్రతి ఇంటికీ తిరిగే కార్యక్రమం 21వ రోజున 3వ డివిజన్ పూర్తి చేసుకుని 4వ డివిజన్ లోకి ప్రవేశమైంది. స్థానిక మారుతి నగర్, కుందేళ్ళ ఫారం రోడ్డు ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు మహిళలు మద్యం కారణంగా తమ కుటుంబాల్లో ఏర్పడుతున్న సమస్యల గురించి వివరించి ఆవేదన చెందారు. గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ తమ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చారని, అధికారం చేపట్టి సీఎం అయ్యాక మద్యపాన నిషేధం కాస్తా మద్యపాన నియంత్రణ అంటూ మార్చారని అన్నారు. పోనీ నియంత్రణ ఏమైనా చేస్తున్నారా అంటే లేదని, ప్రభుత్వ దుకాణాలను ఎక్కడపడితే అక్కడ ప్రారంభించారని, వాటికి తోడు ఎలైట్ షాపుల పేరుతో మరిన్ని దుకాణాలు తెచ్చి మద్యపానాన్ని పెంచి పోషిస్తున్నారని కేతంరెడ్డి ఎదుట మహిళలు వాపోయారు. గతంలో 80 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ క్వాటర్ రేటు ఇప్పుడు 200 రూపాయలకు పైగా పెంచారని, పైపెచ్చు అది పిచ్చి మద్యం కావడంతో తమ భర్తలకు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయని మహిళలు ఆవేదన చెందారు. ఇళ్లల్లో మగాళ్ళు మద్యం మానట్లేదని, దాంతో అధిక రేటుకి మద్యం కొని ఆర్ధిక సమస్యలు, పిచ్చి మద్యం తాగి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతూ తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మద్యనిషేధం చేస్తామని నమ్మించి మోసగించిన జగన్ కి ఈ సారి ఓటేసే ప్రసక్తే లేదని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి జనసేన పార్టీకి ఓట్లు వేసి పవనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి మహిళలు స్పష్టం చేసారు.
పదిలో పొదలకూరుకు రాష్ట్ర ప్రధమ స్థానం...
594/600 మార్కులు సాధించి సత్తా చాటిన తోట జయలక్ష్మి పలువురి అభినందనలు
పొదలకూరు: పొదలకూరు పట్టణానికి చెందిన తోట మల్లికార్జున్ రావు కుమార్తె జయలక్ష్మి ఈరోజు విడుదలైన పదవతరగతి పరీక్షా ఫలితాల్లో 600 మార్కులు గాను 594 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. నెల్లూరులోని vowell-14 ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చదివిన జయలక్ష్మి అక్కడి ఉపాధ్యాయుల ఉత్తమ విద్యాబోధనతోనే ఇంతటి ఫలితాలు సాదించగలిగిందని విద్యార్థి మల్లికార్జున్ రావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్తానం సాధించిన చిన్నారి జయలక్ష్మిని vowell-14 పాఠశాల కరస్పాండెంట్ వేణు గారు, ఆ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. పడవ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించి పొదలకూరుకు గుర్తింపు తెచ్చిన జయలక్ష్మికి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రోత్సహించిన విద్యార్థి తండ్రి తోట మల్లికార్జున్ రావుకు పలువురు మిత్రులు, పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.