మర్రిపాడు మండలం లో ఆత్మకూరు వైసీపీ ఇన్ చార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి రెండవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగరాజుపాడు గ్రామంలో పర్యటించి. ప్రభుత్వ సంక్షేమ పథకల అమలవుతున్న తీరు ప్రజల నుండి తెలుసుకుని ఈ మూడు సంవత్సరాలలో ప్రభుత్వం తరఫున వచ్చిన పథకాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక వైసీపీ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పురస్కారాలతో వాలంటీర్లకు మరింత ప్రోత్సాహం - మేయర్ స్రవంతి జయవర్ధన్
సంక్షేమ పాలన కోసం ముఖ్యమంత్రి ఆలోచనలతో రూపొందించిన సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ సంక్షేమ పతకాలను అందించడంలో వారధులుగా నిలుస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ అందిస్తున్న పురస్కారాలతో వారికి మరింత ప్రోత్సాహం అందుతోందని నగర మేయర్ స్రవంతిజయవర్ధన్ పేర్కొన్నారు. స్థానిక 2వ డివిజన్ లోని గుడిపల్లిపాడు పరిధిలో విధులు నిర్వహిస్తున వాలంటీర్లకు ఉగాది ప్రోత్సాహక పురస్కారాలను స్థానిక సచివాలయంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని ప్రజలందరితో మమేకమై అనునిత్యం వారి సమస్యలను ప్రభుత్య దృష్టికి తీసుకోచ్చెలా వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. ఉగాది పురస్కారాలకు ఎంపికైన గ్రామ, వార్డు వాలంటీర్లు అందరికీ మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో కాని, ప్రపంచంలో కాని ఎక్కడా లేని విధంగా పరిపాలనలో స్వర్ణయుగం తెచ్చేలా 2019 ఆగస్టు 15న వాలంటీర్లను సచివాలయ వ్యవస్థలో భాగంగా చేసారని తెలిపారు. మృత్యువుతో ప్రపంచ వ్యాప్తంగా భీభత్సానికి గురిచేసిన కరోనా సమయంలో సైతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావలసిన సేవలు, అందాల్సిన సంక్షేమ పథకాలను ధైర్యంగా ప్రజలకు వాలంటీర్లు అందజేశారని కొనియాడారు. వాలంటీర్ల విశిష్ట సేవలను మెచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సేవా మిత్రా, సేవ రత్న, సేవా వజ్ర పేర్లతో ఉగాది పుర్కారాలను ప్రత్యేకంగా నిర్వహించడం శుభ పరిణామం అని వారు ప్రశంసించారు. అవార్డులు అందుకున్న వాళ్లకి, అందుకోని వాళ్ళకి కొద్దిపాటి తేడా మాత్రమే ఉన్నదని, అవార్డులు రానివాళ్లు మరింత కృషి చేసి రాబోయే సంవత్సరంలో పురస్కారపు గౌరవాన్ని అందుకోవాలని మేయర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగినేటి రామ్మోహన్, 1వ డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు, వై.సీ.పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పొదలకూరు లో నిర్మాణం చేపట్టిన ఏడేళ్లకు.... ప్రారంభానికి సిద్ధమైన ఏడుకొండలవాడి ఆలయం.... ఈ నెల 26న ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట.... రేపటి నుంచి 26 వరకు విగ్రహాల ప్రతిష్టా మహోత్సవ వేడుకలు....
వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి....
నిర్మాణ పనులు చేపట్టిన ఏడేళ్లకు ఏడుకొండలవాడి ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది. భక్తుల విరాళాలతో చేపట్టిన ఏడుకొండల వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం ఏడేళ్ళ కాలంలో పూర్తి కావడం, ఏడేళ్లు దాటకముందే ప్రారంభానికి నోచుకోవడాన్ని భక్తులు విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటు అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ట త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా జరగనున్న సంగతి విదితమే. విగ్రహాల ప్రతిష్టలో భాగంగా రేపటి నుంచి 26వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఉత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి,రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల దంపతులు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస నగర్ లేఔట్ లో 2015 సంవత్సరం జూన్ 11వ తేదీన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీ రామచంద్ర జీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, గోదాదేవి అమ్మవార్ల తో పాటు శ్రీ గరుడ ఆళ్వార్ స్వామి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయాల నిర్మాణం మొత్తం రాతితో చేపట్టారు. ఈ ఆలయాల నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 26న స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కు ముహూర్తం నిర్ణయించారు. ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు నుంచే ఆ స్థలంలో బాలాలయాన్ని నిర్మించి స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతివారం స్వామివారి పల్లకి సేవలు, ప్రతినెల శ్రవణా నక్షత్రం రోజున శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం స్వామివారికి పల్లకిసేవతోపాటు శుక్రవారం అమ్మవార్లకు అభిషేకాలు జరుపుతున్నారు. ఆలయ నిర్మాణ ప్రాంగణంలో ఇప్పటికి నాలుగు పర్యాయాలు సుదర్శన హోమం, మూడు సార్లు శ్రీ మహాలక్ష్మి యాగాలను నిర్వహించారు. ప్రతిఏటా ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భంలో బాలాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేని పేదలకు అన్నదానం చేశారు. ప్రతిరోజు సుమారు 500 నుంచి 600 మంది వరకు అన్నదానం జరిపారు. ఈ ఆలయ ప్రాంగణంలో 22 ఆవులతో గోశాల నిర్మించారు. ఏడేళ్లలో స్వామి, అమ్మవార్లు ఎందరో భక్తుల కోరికలను తీర్చారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో తలనీలాలు సమర్పించుకుంటున్నారు. పాంచరాత్ర ఆగమంతో పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టూ ఉన్న 8 మండలాలకు అష్టాదళ పద్మ కేంద్రంగా వున్న పొదలకూరు లో నిర్మాణం పూర్తి చేసుకుని, ఈ నెల 26 న ప్రారంభానికి సిద్ధమైన ఈ ఆలయం తలమానికమై, ప్రముఖ దివ్య క్షేత్రంగా వెలుగొందనుంది.
కోవూరు నియోజకవర్గం,రాజుపాలెం లోని పీఎస్ఆర్ కళ్యాణ మండపంలో కోవూరు
నియోజకవర్గ ఇంఛార్జి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మినీ
మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్
నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు…తొలుత
తెలుగుదేశం పార్టీ జెండాను ఎగుర వేశారు.
అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించారు.