గ్రామ పంచాయితీ ల తనిఖీలలో భాగంగా 28-04-2022 బోగోలు మండలం విశ్వనాథరావుపేట సందర్శించి గ్రామ పంచాయతి రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించి జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టాలని సూచించడం జరిగినది. గ్రామ సచివాలయం రికార్డులను పరిశీలించి ప్రజలకు సకాలంలో పారదర్శకతతో సేవలు అందించాలని సూచించడం జరిగింది.
బోగోలు మండలంలోని SGV కండ్రిగ పంచాయితీ లోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్నితనిఖీ చేయడం జరిగింది. కేంద్రం నందు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించి, పంచాయితీ కార్యదర్శి కి తగు సూచనలు జారీ చేయడం జరిగింది.
ప్రతి ఇంటి నుంచి చెత్తను నేరుగా సేకరించి తప్పనిసరిగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నకు తరలించి , వర్మీ కంపోస్టు తయారు చేయాలని, తద్వారా గ్రామ పంచాయతీ లకు ఆదాయం తీసుకురావాలని ఆదేశించడం జరిగింది.
శ్రీమతి ఎం. ధనలక్ష్మి, జిల్లా పంచాయతి అధికారి, నెల్లూరు వారు, తన ఛాంబరు నందు కలిగిరి మండలము విస్తరణాధికారి (పం.రాజ్ మరియు గ్రా.అ.) మరియు మండలములోని అందరు పంచాయతీ కార్యదర్శులతో సమావేశము నిర్వహించినారు. సదరు సమావేశములో గ్రామ పంచాయతీలలో 100 % ఇంటి పన్నులు వసూలు, పారిశుధ్య నిర్వహణ, ఎండాకాలంలో గ్రామములోని ప్రజలు నీటి ఎద్దడికి గురికాకుండునట్లు ముందస్తు చర్యలు చేపట్టవలసినదిగాను మరియు ప్రభుత్వము ప్రవేశ పెట్టిన వివిధ పథకములు 100 % ప్రజలకు అందునట్లు తగు చర్యలు చేపట్టవలసినదిగా తగు సూచనలు, సలహాలు యిచ్చినారు. అటులనే ప్రతి గ్రామ పంచాయతీలో తప్పని సరిగా SWPC షెడ్డు నిర్మాణములు చేపట్టి గ్రామాలను 100% చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుటకు సహకరించవలసినదిగా కోరినారు. ఈ సమావేశములో జిల్లా కో-ఆర్డినేటర్, DPRC శ్రీ కె. శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ యం. సురేష్ బాబు, విస్తరణాధికారి (పం.రాజ్ మరియు గ్రా.అ.) మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వాకాడులో తల్లీ కూతురు ఉరి వేసుకుని మృతి
తిరుపతి జిల్లా...వాకాడు మం వాకాడు గ్రామంలో అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద తల్లి కూతురు ఉరి వేసుకుని మృతి చెందారు... తల్లి షాకిరా వయస్సు 55,,కూతురు మబ్బుల్ వయస్సు 35... సంఘటన స్థలం లో మా చావుకు ఎవరూ కారణం కాదు,మా ఇష్ట పూర్వకంగా చనిపోతున్నాము,మాకు బతకడం ఇష్టము లేదు అని ఒక లేఖ రాసి ఉంది...
కావలి పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో జిల్లా జేసీ హరేంద్ర ప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అధికంగా పని దినాలు కల్పించాలనీ ఆదేశించారు. వింజమూరు మండలంలో పని దినాలు తక్కువుగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు కావలి ఆర్డీవో శీనా నాయక్ ఉన్నారు
యువతిపై సామూహిక అత్యాచారం హత్య
విజయవాడలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులను పోలీసులు గుర్తించారు. తిరుపతమ్మకు తెలిసినవారే హత్యకు పాల్పడి ఉంటారని గుర్తించారు. సంఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి సిపిఎం అత్యాచారానికి పాల్పడి యువతిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం దుగ్గిరాల మండల కమిటీ కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వి.సాంబశివరావు డిమాండు చేశారు. హత్యకు ముందు తిరుపతమ్మపట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి అర్థమవుతోందని, ఇటువంటి వారిని క్షమించకూడదని వారు డిమాండు చేశారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చేయడం ద్వారా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు...!!
ఢిల్లీ: భారత్ లో కొత్తగా3,303 కరోనా కేసులు 39 మరణాలు..
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ క్రమంగా తగ్గుతోంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు 3303 నమోదయ్యాయి.
దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,68,799 కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2563 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.ఇక దేశంలో తాజాగా 39 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,23,693 కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,28,126 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,88,40,75,453 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 19,53,437 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 16,980 కు చేరింది.