దళారులు, వైసీపీ నేతల చేతిలో అన్నదాతల నిలువు దోపిడీ
పుట్టికి మద్దతు ధర రూ.16660 అయితే రైతుకు దక్కుతున్నది రూ.12 వేల నుంచి రూ.14 వేల లోపే
ఒక్కో పంటలో రైతులకు వెయ్యి కోట్లకు పైగా నష్టం
అన్నం పెట్టే రైతన్నకు ఇంత అన్యాయం జరుగుతుంటే జిల్లాలోని అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకున్న సోమిరెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, వేనాటి సతీష్ రెడ్డి, ముప్పాళ్ల విజేత తదితరులు
ఆర్బీకేల చుట్టూ తిరిగితిరిగి విసిగివేసారి వచ్చిన కాడికి అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 6 లక్షలకు పైగా ఎకరాల్లో పంట దిగుబడి వస్తోంది. సగటున నాలుగు పుట్లు వేసుకుంటే 25 లక్షల పుట్ల వరకు దిగుబడి రానుంది
దళారులు, వైసీపీ నేతలు కలిసి చేస్తున్న దోపిడీ కారణంగా ఈ సీజన్ లోనూ రైతులు వెయ్యి కోట్లకు పైగా నష్టపోతున్నారు
మద్దతు ధర పుట్టికి రూ.16660గా ఉంటే రైతులకు దక్కుతున్నది రూ.12 వేలు, రూ.13 వేలు, రూ.14 వేలే
రైతు భరోసా కేంద్రాల చుట్టూ రైతులు తిరిగితిరిగి వేసారిపోయి నిస్సహాయస్థితిలో దళారులు అడిగిన ధరకు అమ్ముకుంటున్నారు
ఆర్బీకేల్లోనూ తేమ పేరుతో 75 కిలోల బస్తాకు 15 నుంచి 20 కిలోలు అదనంగా దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఒక్కో పంటకు వెయ్యి కోట్లకు పైగా రైతులు నష్టపోతుంటే జిల్లాలోని అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు..ఇంత కంటే మీరు వెలగబెట్టేదేముంటుంది
మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు వస్తే మీలా మేము చూస్తూ ఊరుకోలేదు
బీపీటీలో వచ్చిన విరుగళ్ల కారణంగా రైతులు నష్టపోకుండా ప్రత్యేకంగా జిల్లా రైతుల కోసం బోనస్ అందించాం
నెల్లూరు జిలకర ధాన్యం ధరల విషయంలో వచ్చిన గ్రేడ్ సమస్యను పరిష్కరించి రైతులకు నష్టం లేకుండా చేశాం
2016లో ధాన్యం దిగుబడులు వెల్లువెత్తి ధరలు తగ్గడంతో దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాం
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రైతులను, వారి ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసింది.
కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలయ్యే పథకాలను కూడా పక్కన పెట్టేశారు
అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డూప్
తెలంగాణలో మద్దతు ధరకు ప్రతి గింజా కొనుగోలు చేసి మూడు రోజుల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నారు
ఏపీలో మాత్రం ఐదారు నెలలకు కూడా చెల్లింపులు జరగడం లేదు
ఆర్బీకేల్లో అతికించిన పోస్టర్లలోని అంశాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే కుదరడం లేదు
రైతులకు అందుబాటులో ఉండాల్సిన ఆర్బీకేలు అనేక చోట్ల మూతపడి కనిపిస్తున్నాయి
అన్నదాతల వద్ద దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మాత్రం వైసీపీ నేతల అండతో ఆర్బీకేల ద్వారా మద్దతు ధరకు అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు.
రైతులు తిరగబడే పరిస్థితి వచ్చే వరకు మౌనంగా ఉండకుండా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయీస్ అధికారులు స్పందించాలి
మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులకు సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకోవాలి.