సిపిసి రద్దు చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి,చింతామణి నాటకాన్ని రద్దు చేస్తున్నారు
సిపిసి రద్దు చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి,చింతామణి నాటకాన్ని రద్దు చేస్తున్నారు.
- అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి...
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది... దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్డు మీదకు వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నాయి...ఈనేపథ్యంలో నెల్లూరు పార్లమెంటరీ ఇంచార్జి అబ్దుల్ అజీజ్ నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కలసి ఉద్యోగస్తుల కు మద్దతు తెలుపుతూ వారితో కలెక్టరేట్ ను ముట్టడించి నిరసనలు తెలిపారు...
అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
ఎన్నికల ముందు సిపిసి రద్దు చేస్తానని హామీ ఇచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి దానిని గాలికి వదిలేశారని అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు .ఇచ్చిన హామీ ను పట్టించుకోకుండా చింతామణి నాటకాన్ని రద్దు చేయడం హాస్యాస్పదంగా ఉందని నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు..సీఎం పదవి అంటే చిన్నపిల్లలు ఇష్టం వచ్చినట్లు ఆడుకునే ఆట కాదనీ, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగస్తులను మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదనీ అన్నారు..సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే రద్దు చేయాలనీ అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు మాట తప్పం మడమ తిప్పం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమయ్యాడు అని అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు ఉద్యోగస్తుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలనీ ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం ఉద్యోగులకు.ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలని డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా నిరసనలు తెలిపేందుకు వస్తున్నా ఉద్యోగస్తులను పోలీసులు అడ్డుకుని నిర్బంధించడం బాధాకరమని అబ్దుల్ అజీజ్ ఆవేదన వ్యక్తం తెలుగుదేశం పార్టీ హయాంలో విభజన హామీలను నెరవేర్చి ఉద్యోగస్తులకు అన్నివిధాలా ఆదుకున్నారని ఆయన గుర్తు చేశారు.
కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ నుండి విడిపోయిన తరువాత చంద్రబాబు నాయుడు హయాంలో ఉద్యోగస్తులు అన్నివిధాలా అడ్డుకున్నారని గుర్తు చేశారు ప్రపంచంలో ఎంత గొప్ప వారైనా టీచర్లను గౌరవించాల్సిందే అని అలాంటి ఉపాధ్యాయులను రోడ్డెక్కిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు ఒకపక్క కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మధ్యతరగతి కుటుంబీకులు ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉంటే.. అద్దెలు పెంచుతూ వైకాపా ప్రభుత్వం మాత్రం 4శాతం నుండి 14శాతం వరకు అధిక భారాన్ని మోపిందని మండిపడ్డారు అశోక్ మిత్ర రిపోర్ట్ దమ్ముంటే బయటపెట్టాలని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు.. ఇదంతా సజ్జల రామకృష్ణ రాసిన చెత్త రిపోర్టుగా ఆయన అభివర్ణించారు ఉద్యోగస్తులు తో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాగు పడక సర్వనాశనం అయిందని ఆరోపించారు ఉద్యోగస్తులు తమ మెడకు ఉరితాళ్లు వేశారని గగ్గోలు పెడుతుంటే...జగన్ రెడ్డికి ఏదీ పట్టనట్టు చింతామణి డ్రామాను రద్దు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు అసలు చింతామణి నాటకం ఎవరు రద్దు చేయమని అడిగారని ముందు ఉద్యోగస్తుల బాధను అర్థం చేసుకుని వారికి సరైన న్యాయం చేయాలని కోరారు ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బును వారికి ఇవ్వడం కూడా కష్టంగా ఉంది... ప్రభుత్వం వద్ద డబ్బుల్లేక దివాలా తీసిందని ఈ పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుందని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు