SPS నెల్లూరు జిల్లా
JSAAP క్రికెట్ టోర్నమెంట్ 2022 నిర్వహణ సందర్భంగా టీ షర్టులను ప్రారంభించిన యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
జనవరి నుండి 19 వరకు జరగనున్న జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్. స్నేహపూర్వక వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని సూచన. మంచి ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ప్రాముఖ్యం. ఒత్తిడులను అధిగమించేందుకు క్రీడలు చాలా దోహదం చేస్తాయి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వ్యాయామం తప్పనిసరి...తద్వారా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు
మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో విర్రవీగే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు .
అందుకు నిదర్శనమే పొదలకూరు పూర్వ తహసీల్దార్ స్వాతి సస్పెన్షన్ కాకాణి ఆదేశాలు, అండదండలతో స్వాతి అనేక అక్రమాలు, భూదందాలకు పాల్పడింది స్వాతిని సస్పెన్షన్ తో కాకుండా డిస్మిస్ చేయాలి... ఆ భూ దందా లో ప్రధాన సూత్రధారి అయిన ఎమ్మెల్యే కాకాణి అనుచరుడు ప్రవీణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి,పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి
జిల్లాలో దారుణంగా భూ కుంభకోణాలకు పాల్పడుతుంటే మేము ఫిర్యాదు చేసే వరకు చర్యలకు దిక్కులేదు. జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్, ఆర్ డి వో లు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ తక్షణం ఎంక్వయిరీ కమిటీ వేయాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన భూ కుంభకోణాలకు సంబంధించిన వివరాలను బయట పెడతాం. గడిచిన రెండున్నర సంవత్సరంలో జరిగిన భూ కుంభకోణాలపై 70 ఎం ఎం సినిమా చూపిస్తాం అధికారుల ఉద్యోగాలు పీకే దమ్ము ఎవరికీ లేదు... వారు ఇప్పటికైనా నిజాయితీ నిబద్ధతతో పని చేయాలి. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని అధికారులు గుర్తించుకోండి. లక్షల రూపాయల జీవితాలతో పాటు అధికారులకు హోదాను కల్పించింది..ప్రజల ఆస్తులను కాజేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి కాదు.అధికారులు అంటే మాకెంతో గౌరవం ఉంది... ఇక్కడుండే అవినీతి ఎమ్మెల్యేలను చూసి ఎందుకంత భయపడిపోతున్నారు... దిగజారి పోతున్నారు. నెల్లూరు జిల్లాలో పనిచేసిన గత కలెక్టర్లు ఒక చరిత్ర... తరతరాలకు వారి పేర్లు గుర్తుండేలా పనిచేశారు. తహసిల్దార్ గా పనిచేసి సస్పెండ్ అయిన స్వాతి అంటే మాకు కక్ష లేదు... సానుభూతి ఉంది... ఎమ్మెల్యే కాకాని చేసిన పనులకు ఆమె బలయింది. అధికారి స్వాతిని సస్పెండ్ కాదు సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలి దాంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పొదలకూరులో జరిగిన భూ కుంభకోణంలో స్వాతి తో పాటు ఆమె వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలి తహసిల్దార్ గా స్వాతి కుంభకోణాలకు పాల్పడుతోందని మేము చెప్పేంతవరకు చర్యలకు దిక్కులేదు. సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినా ఆమెపై జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఏం చెబితే అది చేయండి అనేలా దరిద్రమైన పరిస్థితిలో జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఉన్న డికేటి, అసైన్డ్, ప్రభుత్వ ల్యాండ్స్ అన్ని మారిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా భూ కుంభకోణాలు జరిగిపోతున్నాయ్. పొదలకూరు, వెంకటాచలం,చిల్లకరు మండలాల్లో కాకాణి టీమ్ భూ కుంభకోణాలకు పాల్పడుతోంది. ప్రతీది సాక్షాలతో సహా బయటపెడుతున్నాం. ఒక్క పొదలకూరు మండలం లోనే వంద కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు... తహసిల్దారుగా స్వాతి పదిహేను కోట్ల రూపాయల వరకు అక్రమ సంపాదన చేసినట్లు తెలుస్తోంది. చిల్లకూరు లో జరిగిన భూ కుంభకోణం సంబందించి అక్కడి అధికారిపై కేసు నమోదు చేశారు... భూ కుంభకోణాలు జరిగినట్లు రుజువైనా వెంకటాచలం, పొదలకూరు మండలాల తాసిల్దారు లపై ఇక్కడ ఆర్డీవో, కలెక్టర్ ఎందుకు కేసులు నమోదు చేయలేదు. వెంకటాచలం మండలం కాకుటూరు భూకుంభకోణం కేసులో వైసీపీ నేత పెంచలభాస్కర్, పొదలకూరు కంప్యూటర్ ఆపరేటర్ గీతాను చిల్లకూరు మండలం సీలింగ్ భూముల కుంభకోణంలో వై సీ పీ నేత దర్శి విజయబాబు ను అరెస్ట్ చేశారు..చిల్లకూరు కేసులో అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.. కానీ పొదలకూరు భూ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన కాకాణి అనుచరుడు ప్రవీణ్ ను ఇంత వరకు అరెస్టు చేయలేదు. ఇప్పటికీ ఎమ్మెల్యే కాకాణి ల్యాండ్ బ్యాంకు పెంచేందుకు ప్రవీణ్ కీరోల్ ప్లే చేస్తున్నాడు. వెంకటాచలం, పొదలకూరు తహసీల్దారులపై ఎవరి ఒత్తిళ్లతో కేసులు నమోదు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది
బీదా రవిచంద్ర
సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోతోంది. పొదలకూరు,వెంకటాచలం మండలాల్లో జరుగుతున్న భూ అక్రమాలు, గ్రావెల్ అక్రమ తరలింపు పై సంవత్సరం పాటు గా పలుమార్లు ఫిర్యాదు చేసిన జిల్లా అధికారులు స్పందించలేదు. జిల్లాలోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మొత్తం కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ లో అక్రమాల పై ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేక పోవడం దౌర్భాగ్యం. చివరికి లోకాయుక్తకు ఫిర్యాదు చేసి, అక్కడి నుంచి ఆదేశాలు వస్తే కానీ జిల్లా అధికార యంత్రాంగం స్పందించని పరిస్థితి. సమస్యలను తెలియజేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే చర్యలు చేపట్టక పోగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు... సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలపై చర్యలు తీసుకోక పోగా టిడిపి నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో జరుగుతున్న భూ అక్రమాల కలెక్టర్ దృష్టికి తీసుకురావడమే కాక విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో పరిశ్రమ మంత్రి ఉంటే పరిశ్రమలు తరలిపోతున్నాయ్... ఇరిగేషన్ మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు. టీడీపీ హయాంలో సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే ఇంత వరకు అది ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది... స్థానిక ప్రజలు మీడియా ప్రతినిధులు అక్రమ దందా పై గగ్గోలు పెట్టినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
వి ఎస్ యూ లో జాతీయ యువజనోత్సవం దినం సంబరాలు
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ యువజనోత్సవం ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
అనంతరం పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వివేకానంద స్వామి 159వ జన్మదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వామి వివేకానంద ఒక గొప్ప ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, తత్వవేత్త అని ఆయన ప్రభోదనలు అనేక విశ్వవిద్యాలయాలులో తత్వశాస్త్రంలో పాఠ్యఅంశాలు గా బోధిస్తున్నారు అని అన్నారు. బాల్య వివాహాలు అరికట్టడం లో మరియు నిరక్షరాస్యత నిర్మూలించడంలో ఆయన విశేషమైన కృషి చేశారన్నారు. ప్రతిరోజూ కొంత సమయమైనా ప్రతి వ్యక్తి తనకు తానే మాట్లాడుకుంటే తనలో దాగి వున్న ఒక అద్భుత మనిషిని కనుగొంటాడన్న ఆయన మాటలు ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు.
విశ్వవిద్యాలయంలోని యువత అందరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ప్రస్తుత సమాజ పరిస్థితులులలో యువతకు ఆయన నడిచిన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా . ఎల్ విజయ కృష్ణారెడ్డి గారు, డిప్యూటీ రిజిస్ట్రార్ డా. సి వి ఎస్ సాయి ప్రసాద్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి సుజయ్ సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డా. ఆర్ ప్రభాకర్ మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థులు వివేకానంద స్వామి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
వి ఐ పి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్
వి ఐ పి క్రికెట్ టోర్నమెంట్ వాకాడు ఎస్సై రఘునాథ్ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్రికెట్ టోర్నమెంట్ ఉల్లాసం తో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందని ఆయన అన్నారు, యవ్వన వయస్సులో బిడ్డలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఇలాంటి క్రీడల మీద ధ్యాస బెడితే వారిది జీవితాలు ఎంతో బాగుంది అని ఆయన అన్నారు, ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ
ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి గా సూరి శెట్టి విజయ్ కుమార్ వాకాడుమైనార్టీ సభ్యులు షేక్ రియాజ్ 20 వేల రూపాయలను ప్రైజ్ మనీ విన్నర్ కు రన్నర్ కు ఇవ్వడం జరుగుతుందన్నారు విఐపి లెవెన్ టీం వెంక రెడ్డి పాలెం యూత్ తెలిపారు ఈ క్రికెట్ టోర్నమెంట్ను వాకాడు మండలం మైనార్టీ సభ్యులు షేక్ రియాజ్ టాస్ వేయగా వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ బ్యాటింగ్ చేస్తూ ఉత్సాహంగా మొదలుపెట్టారు ఇరు జుట్టును కరచాలనం చేస్తూ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ యం పి పి వెంకటేశ్వర్లు మాజీ ఎంపిటిసి బి. వెంకటయ్య వెంకట్ రెడ్డి పాలెం యూత్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, నేలటూరు గ్రామంలో శ్రీ వరదరాజ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకరోత్సవంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యస్.సి.,యస్.టి., బి.సి.లకు 50 శాతం ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులుగా మహిళలు కనీసం 50 శాతం ఉండేవిధంగా ఉత్తర్వులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, భగవంతుని సేవలో అవకాశం కల్పించడం రాష్ట్ర చరిత్రలో ప్రధమం. భగవంతుని సేవకు ఎంపికాబడిన ధర్మకర్తల మండలి సభ్యులు సంప్రదాయాలను పాటిస్తూ, స్థానిక ప్రజల, భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో దేవుని భూములను తమ గుప్పెట్లో పెట్టుకొని, కౌలు డబ్బులు కట్టకుండా, దేవుని సొమ్ము స్వాహా చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ శాసన సభ్యునిగా బడాబాబుల కబంధహస్తాలలోని భూములను బయటకు తీసి, వేలం పాటలు సక్రమంగా నిర్వహించి, దేవుని సేవకు వినియోగిస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వరదరాజస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, నూతన ధర్మకర్తల మండలి సభ్యులకు, చైర్మన్ కు నా హృదయపూర్వక అభినందనలు.
జాతీయస్థాయి స్కేటింగ్ క్రీడ పతక విజేతకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సత్కారం
ఇటీవల చండీగఢ్ లో జరిగిన జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో జిల్లా స్కేటింగ్ క్రీడాకారుడు యస్ శ్రీహర్షకుమార్ రెడ్డి అండర్ 14 వయస్సు డౌన్ హిల్ ఈవెంట్ నందు రజిత పతకం సాధించడం జరిగింది. ఈ రోజు జిల్లా మంత్రివర్యులు పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పతక విజేత శ్రీహర్షకుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. జిల్లాకు మొట్టమొదటి సారిగా ఈ ఈవెంట్ నందు పతకం రావడం చాలా సంతోషదాయకమని, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి నిమ్మల వీర వెంకటేశ్వర్లు, స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుర్రం ఈశ్వర్, సభ్యులు కందుకూరు రమేష్, కోచ్ లు జితేంద్ర, జావేద్, భరత్, విశ్వనాథ్, షోకాత్ తదితరులు పాల్గొన్నారు.
12-01-2022 కోట మండల బీజేపీ అద్వర్యం లో కోట చిన్మయమిషన్ లో వివేకానంద స్వామి గారి 159వ జయంతిని ఘనంగా ఆయన చిత్ర పటానికి పూలమాలను వెసి స్వీట్ లు పంచడం జరిగినది ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నాము
ఈ కార్యక్రమములో సారంగం రామేష్ బాబు , జిల్లా కార్యదర్శి అంబరీష , జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి పోసిన వెంకయ్య గౌడ్ , మండల గిరిజన మోర్చా ప్రసిడెంట్ వెంకటేశ్వర్లు యువమోర్చ ప్రసిడెంట్ దామోదర్ యూత్ ప్రసిడెంట్ నీకేష్ పరుశురాం సాయి కోట మండల మైనారిటీ మోర్చా ప్రసిడెంట్ కరీముల్లా , మండల కిసాన్ మోర్చా కార్యదర్శి శరత్ చంద్ర రెడ్డి గార్లు పాల్గొన్నారు