తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ సమావేశం లో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్,నియోజకవర్గ పరిశీలకులు గూడపాటి శ్రీనివాస్,పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి , సుబ్బానాయుడు, 4 మండలాల నాయకులు కార్యకర్తలు....
పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ, పెండింగ్ లో ఉన్న గ్రామ, వార్డు, బూత్, క్లస్టర్ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేసి పార్టీ పటిష్టత కై కృషి చేయాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై, గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ది పనుల పెండింగ్ బిల్లులపై చర్చించడం జరిగింది. త్వరలో రానున్న కావలి, అల్లూరు మున్సిపల్ ఎన్నికలకు టిడిపి శ్రేణులు సిద్ధం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.
న్యూఇయర్ ట్రీట్.. ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్
కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులను డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్ షాపులను అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరుగా పెరుగుతున్న వేళ న్యూఇయర్ వేడుకలపై దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే డిసెంబర్ 31న అర్ధరాత్రి మద్యం అమ్మకాలతో అధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫిట్ నెస్ లేని కళాశాల పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలి
ఫిట్ నెస్ లేని ఆదిశంకర కళాశాలల బస్సుల పై చర్యలేవి
రవాణా శాఖ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు
చర్యలు వెంటనే తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి గూడూరు శాఖ ఆధ్వర్యంలో,రవాణా శాఖ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ గారికి వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్వీనర్ మనోజ్ కుమార్ మరియు జిల్లా కన్వీనర్ కార్తీక్ మాట్లాడుతూ గూడూరు డివిజన్ పరిధిలోని ఫిట్ నెస్ లేని కళాశాల బస్సులు మరియు పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలని, బస్సులు ఫిట్ నెస్ లేకపోవడం వల్ల ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారని, గతంలో కూడా ఆదిశంకర కళాశాల బస్సు యాక్సిడెంట్ గురువారం జరిగింది నిన్న కూడా వెంకటగిరి రూట్ లో వాస్తు చక్రం ఊడిపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది, వెంటనే ఫిట్ నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చిన్న, కాశీ రామ్, చరణ్ , ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే మేకపాటి ని పరామర్శించిన.. గోపన్నపాలెం సర్పంచ్ గండు వెంకారెడ్డి.
ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బెంగుళూరు లోని హాస్పిటల్ లో చికిత్స పొదుతున్నారన్న విషయం తెలిసిన వెంటనే గోపన్నపాలెం సర్పంచ్ గండు వెంకారెడ్డి హాస్పిటల్ కు వెళ్లి ఎమ్మెల్యే ని కలిసి అయన యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. ఎమ్మెల్యే పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని గండు వెంకారెడ్డి తెలిపారు. వ్యక్తిగత పనిపై బెంగళూరువెళ్ళిన శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు బెంగుళూరులోని ఆస్టా వైద్యశాలలో చేర్పించారన్నారు. వైద్యులు పరీక్షించిన అనంతరం మంగళవారం రాత్రి హుటాహుటిన చికిత్స అందించి స్టంట్ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎవరు ఆందోళన చెందవద్దని గండు వెంకారెడ్డి తెలిపారు.
ఐసీఐసీఐ ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖా ఆధ్వర్యంలో పశువులకి, జీవాలకి ఆరోగ్య పరీక్షలు
నెర్ణురు గ్రామంలో ఈరోజు ఐసీఐసీఐ ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖ వారు గేదెలకి, జీవాలకి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వాన కాలంలో పశువులు గాలికుంటు వ్యాధితో బాధపడుతూ ఉంటాయని, సకాలంలో మందులు వాడి, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ వారు ఇటువంటి వైద్య సేవలు నిర్వహించడం అభినందించ దగ్గ విషయం అన్నారు. ఫౌండేషన్ జిల్లా అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో నిమ్మ రైతులకి సాగులో మేళ్ళుకువలు, యాజమాన్య పద్ధతులు గురించి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ రోజు నిమ్మ రైతులకి ఆదనపు ఆధాయంగా పరిగణించబడే పశువుల కి వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు మస్థానమ్మా, రవి, మస్తానయ్య, గోపాల్, వెటర్నరీ అసిస్టెంట్ సంతోష్, RBK సిబ్బంది, నిమ్మ రైతులు పాల్గొన్నారు.
గిరిజన గురుకులాల్లో టీచర్ల కోసం జనవరి 6 తేదీ నుంచి బిక్షాటన
ఈ రోజు నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు BL శేఖర్ వెల్లడి మైదాన ప్రాంతంలోని 8 జిల్లాలోని 81గిరిజన గురుకులాల్లో 8,9,10 తరగతులకు టీచర్లు లేరు.486మంది టీచర్లు ఉండాల్సి ఉండగా ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. మరో మూడు నెలల్లో పదో తరగతి పరీక్షలు. ఒక్కంటే ఒక్క గురుకుల పాఠశాలలో కూడా సిలబస్ పూర్తి కాలేదన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గురుకులాల్లో టీచర్ల ను నియమించి గిరిజన పిల్లల భవిష్యత్తును కాపాడాలని పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ప్రాధేయపడినా ఫలితం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిక్షాటన చేసి తద్వారా వచ్చే నగదుతో గిరిజన గురుకులాల్లో టీచర్లను నియమించుకుని పిల్లల భవిష్యత్తు ను కాపాడుకుందామని నిర్ణయించాము. ఇందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. గుంటూరు జిల్లా తెనాలిలోని బాలికల గురుకుల పాఠశాల 260 మంది పిల్లలు ఉంటే నలుగురే టీచర్లు ఉన్నారు. నెల్లూరు జిల్లా కోట బాలికల పాఠశాలలో 247 మంది పిల్లలు ఉంటే నలుగురే టీచర్లు. ప్రకాశం జిల్లా కరేడులో 200 మంది పిల్లలు ఉంటే నలుగురే టీచర్లు, కడప జిల్లా మైదుకూరు గురుకుల పాఠశాలలో 231 పిల్లలు ఉంటే ఐదుమంది మాత్రమే టీచర్లు ఉన్నారు. 81 గురుకులాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక చదువులు ఎలా? అని ప్రశ్నించారు. గతంలో 81 హాస్టల్స్ ను రద్దు చేసి అదే పాత భవనాల్లో గురుకులాలను ఏర్పాటు చేశారు. 80 నుంచి 100 మంది స్థామర్థ్యం గల అక్కడ ప్రస్తుతం ఒక్కో గురుకుల పాఠశాలలో 250 నుంచి 300 మంది అక్కడే మగ్గుతున్నారని వాపోయారు. వసతుల్లేవు, చదువుల్లేవు. చదువు,భోజనం, పెట్టే,పడక ఒకే రూమ్ లోనే. వసతుల్లేకపోయినా మా పిల్లలంతా భరించారు. గురుకులాలు కదా మంచి చదువు అయినా వస్తుంది భావించారు. అదీ లేకపోవడంతో 17,128 మంది విద్యార్దినీ విద్యార్దుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో గిరిజన పిల్లల చదువుల కోసం సాగే బిక్షాటనలో అందరూ పాల్గొని జయప్రదం చేయడంతోపాటు BED, MED చేసిన గిరిజన నిరుద్యోగులు మన పిల్లలకు చదువులు చెప్పేందుకు ముందుకు రావాలని యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం తరపున కోరుతున్నాము. విలేకర్ల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, ఏకోల్లు సుబ్రమణ్యం, చెంబేటి ఉష, ఏకోల్లు లక్ష్మి, యువజన నాయకులు యల్లంపల్లి రమేష్, కల్లూరు లక్ష్మణ్, తిరివీధి సతీష్, మానికల నాగమణి, పాముల కోటేశ్వరమ్మ, బండి యశోద, బాపనపల్లి పద్మ, రంగయ్య, మేఘన పాల్గొన్నారు.