జే.ఎల్.ఎం. గ్రేడు 2 రాష్ట్ర సమావేశాలను జయప్రదం చేయండి .కామనురు శ్రీనువాసులురెడ్డి.. సిఐటియు
28-12-2021 కడప జిల్లాలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న సీఐటీయూ కార్యాలయంలో జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ 2 రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి అని గోడ పత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులు రెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షుడు నాయకులు రవిప్రకాష్. దిలీప్. సుబ్బారెడ్డి. షాహీద్. శ్రీను పాల్గొన్నారు కామనురు.శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జనవరి నెల రెండో తారీఖున ఉదయం పది గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం బ్రాడీపేట గుంటూరు నందు రాష్ట్ర సమావేశం జరుగుతున్నది ఈ సమావేశానికి విద్యుత్ సంస్థలో క్షేత్రస్థాయిలో వినియోగదారులకు సేవలందిస్తూ ప్రజలకు నిరంతరంగా విద్యుత్ అందించడంలో కృషి చేస్తున్నా గ్రామసచివాలయంలోని ఎనర్జీ అసిస్టెంట్ ల సమస్యలు లో పరిష్కరించాలనే . యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న జూనియర్ లైన్మెన్ లో ఎనర్జీ అసిస్టెంట్ గ్రేడ్2 పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాము ప్రస్తుతం రెండు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నా జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి ఏదైతే రెగ్యులర్ జేఎల్ఎం కు వర్తించే సౌకర్యాలు వీరికి కూడా అమలు చేయాలి టైం స్కేల్ .సెలవులు. పెయిడ్ హాలిడేస్, టి ఏ బిల్లు కల్పించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ ఈ సమావేశానికి జిల్లాలోని జె. ఎల్. ఎం గ్రేడ్ 2 పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం. రవి ప్రకాష్ దిలీప్ కుమార్ సుబ్బారెడ్డి శ్రీనివాసులు షాహిద్ తదితరులు పాల్గొన్నారు సమస్యలు . నమస్కారాలతో...కామనురు.శ్రీనువాసులురెడ్డి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు
137వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు ఇందిర భవన్ లో జండవందనం చేయటం జరిగింది,పై కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చేవూరు దెవకుమార్ రెడ్డి గారు, రూరల్ ఇంచార్జి ఉడత వెంకట్రావు గారు, సీనియర్ నాయకుడు సీవీ శేషారెడ్డి గారు, సిటీ ఇంచార్జి ఫయాజ్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అల్లావుద్దీన్,జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి హుస్సేన్ బాషా, పీసీసీ కార్యదర్శి యన్ మోహన్ రెడ్డి, సేవదల్ అనిల్ కుమార్,జిల్లా యూత్ కాంగ్రెస్ గణేష్,మైనార్టీ ప్రధాన కార్యదర్శి సాజిద్, సిటీ మహిళా మంజుల, కిషోర్, మోహన్, అలిమ,కోవూరు మండల అధ్యక్షుడు జీ మహేష్ రెడ్డి,జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ చంద్రమౌళి నగర్ లోని 4, 6వ వీధులకు, సావిత్రి నగర్ లోని 3వ వీధిలోని సిమెంటు రోడ్డులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
27వ డివిజన్ లో జరిగిన జగనన్న మాట- కార్యకర్తలు ఇంటికి కోటంరెడ్డి బాట కార్యక్రమంలో స్థానిక ప్రజలు ఈ రోడ్డు సమస్య నా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు పనులకు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన రోడ్డు పనులు పూర్తిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించిన. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరదలవల్ల దెబ్బతిన్న రోడ్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, వీలైనంత త్వరగా రోడ్ల పనులను పూర్తి చేయించడమే నా ప్రధమలక్ష్యం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
పై కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ భీమినేని మురహరి, మాజీ కౌన్సిలర్ వెనుంబాక సుధాకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు సన్నపరెడ్డి సుబ్బా రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు సతీష్, మస్తాన్ రెడ్డి, కుమార్, రంగారెడ్డి, చిన్న, సురేంద్ర రెడ్డి, మోహన్, చలపతి, మణి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూ యువ కేంద్ర గూడూరు ఆధ్వర్యంలో స్థానిక నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు యువకులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోటా సునీల్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి యువత వెన్నెముక అని ప్రతి యువకుడు దేశం గురించి ఆలోచించి దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలని ఆయన కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలు వ్యాయామం అనేది చాలా అవసరమని ఆయన అన్నారు ఆటల పోటీలు విద్యార్థులు యువత పాల్గొనడం చాలా సంతోషమని, ప్రతి ఒక్కరు గెలుపు ఓటములతో కాకుండా ప్రయత్నించడం చాలా మంచి విషయమని ఆయన అన్నారు ఆటల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియ జేసి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అతిధులుగా నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి గారు, నారాయణ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ గారు, ఏబీవీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మనోజ్ కుమార్ గారు, ఆర్ ఎస్ ఎస్ జిల్లా ప్రముఖ మల్లికార్జున గారు నారాయణ కళాశాల ఏవో కొండారెడ్డి గారు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ చిన్న గారు తదితరులు పాల్గొన్నారు
సర్వమానవ సమానత్వం చాటే ‘పోలేరమ్మ జాతర’
అందుకే కావలిలో అమ్మవారి జాతర వైభవపేతంగా నిర్వహించడానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి భక్తి శ్రద్ధలతో చొరవ ఎంత ఎదిగినా మూలాలను మరవని వారే జన్మకు సార్ధకులౌతారని విజ్ఞులైనవారు గట్టిగా చెప్పే మాట. మూలాలతో ముడిపడి ఉన్న గొప్ప భక్తి కార్యాన్ని ఘనంగా నిర్వహించడానికి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న కృషి కావలి పట్టణంలోని పాత ఊరులో తీవ్ర చర్చనీయాంశమైంది.
నేటి సువిశాలమైన కావలి పట్టణం, వందల ఏళ్ల క్రితం ...కేవలం పాత ఊరు గా పిలవబడే పరిసరాలు మాత్రమే. నేటి పాత ఊరు...అంటే అప్పట్లో చిన్న గ్రామం. ‘అంతా దైవం పైనే భారం వేసాం’.... అనుకుంటూ మనం అనుకున్న వాటిని సాధించడానికి, కోరికలు తీరడానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటాం... అలాగే ‘పాత ఊరు’ నాటి రోజుల్లో వర్షాలు కురవక సేద్యం కష్టంగా మారినా, వర్షాలు కురిసి పంటలు బాగా పండినా, అంటురోగాలు సోకకుండా ప్రజలు ఆరోగ్యంతో ఉన్నా, అంటురోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా ‘పోలేరమ్మ తల్లి’ ఆగ్రహం/ సంతోషం అనే భావనలు అందరిలో కలిగేది. అదే నిజమనే బలమైన నమ్మకం కూడా. అందుకే పోలేరమ్మ తల్లి జాతర ను మొక్కుబడులు పెట్టుకోవడానికి, తీర్చుకోవడానికి నిర్వహించేవారు. గ్రామ శక్తి గా పోలేర్మ తల్లి జాతరను నిర్వహించడంలో నిర్లక్ష్యం, పొరపాట్లు వంటివి చోటు చేసుకుంటే గ్రామానికి కీడు గా భయాందోళనలు చెందేవారు.
కావలి పాత ఊరు లోని పోలేరమ్మతల్లి అమ్మవారి విశిష్టత కూడా అలాంటి శక్తి స్వరూపిణి. కావలి పట్టణం విస్తరించడంతో పాటు, ప్రజల ఆలోచన విధానం, నమ్మకాలు మారిపోవడంతో పోలేరమ్మ తల్లి అమ్మవారు కూడా నిర్లక్ష్యానికి గురైయ్యారు.
ఈ నేపధ్యంలో కావలి పట్టణంలోని పాత ఊరు ప్రాంతంలోనే పుట్టి పెరిగిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ‘పోలేరమ్మ తల్లి అమ్మవారు’ శక్తి పట్ల అపారమైన నమ్మకం. అందుకే తన బాల్యం నాటి పోలేరమ్మ తల్లి అమ్మవారి విశిష్టతలు మదిలో పదిలంగా ఉండటంతో పాటు, కులాలతో నిమిత్తం లేకుండా అందరూ ఐక్యమత్యంతో నిర్వహించే ‘పోలేరమ్మ జాతర’ నిర్వహించాలని బలంగా నిశ్చయించారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.
పేద– ధనిక, చిన్న–పెద్ద, ఎక్కువ–తక్కువ అనే సారుప్యాలు లేకుండా, అందరి మధ్య సాంస్కృతిక ఆచార వ్యవహార వారధిగా నిలిచే అమ్మవారి జాతర ఈ ఏడాది నుంచి క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.
ఇప్పటికే అమ్మవారి జాతరలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భాగస్వామ్యులు అయ్యే పాత ఊరు ప్రాంతంలోని వారితో సన్నాహాక సమావేశం జరిగేలా చేశారు. పాత ఊరులో పాత కాలం నాటి ‘పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర’ నిర్వహించే సంప్రదాయాన్ని, భవిష్యత్తు తరాలు కూడా వారసత్వంగా కొనసాగించేలా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిర్ధిష్టమైన శాశ్విత కార్యాచరణ ప్రణాళికకు రంగం సిద్ధం చేయడం పట్ల పాత ఊరు ప్రాంతంలోని అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.
పండగ, ఉత్సవం, జాతర, తిరునాళ్లు ...ఏదైనా అందర్నీ ఒక తాటిపై తెచ్చే భక్తిపూర్వకమైన వేడుక. అలాంటి పోలేరమ్మ తల్లి అమ్మవారి వేడుక కే ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేస్తున్న భక్తిపూర్వకమైన ప్రయత్నం ఊరు మంచి కోసం....ఊర్లో జనాల మంచి కోసం.
మెడలో నగలు ఉంటే పెన్షన్ రాదంటూ మోసం!
కేటుగాళ్లు రోజు రోజుకు రాటుదేలుతున్నారు. కొత్త పంథాలో చోరీలకు పాల్పడుతూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంలోలని పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన చోరీ ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది.
ఇంతకీ ఏం జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా గులుమూరుకు చెందిన ఓ వృద్ధురాలు బస్సు కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి తాను గులుమూరు వీఆర్వోగా పరిచయం చేసుకున్నాడు. పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల కోసం ఫోటోలు తీసుకోవాలని నమ్మబలికాడు. మెడలో బంగారం ఉంటే సంక్షేమ పథకాలు వర్తించవని వాటిని తీయాలని ఆమెతో చెప్పాడు.
దీంతో ఆమె తన మెడలో ఉన్న ఆభరణాలు, చెవి కమ్మలు తీసి చీర కొంగుకు కట్టుకోసాగింది. ఈ క్రమంలో తాను సహాయం చేస్తున్నట్లు నటించిన అగంతకుడు అసలు నగలను తీసుకుని తన చేతిలో ఉన్న నకిలీ బంగారాన్ని ఆమె చీరకొంగులో కట్టాడు. తీరా ఇంటికి వెళ్లి చూసుకున్న ఆ వృద్ధురాలు షాక్ కు గురైంది. తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించి లబోదిబోమంది. జరిగిన మోసం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా పరిచయం లేని కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.