నెల్లూరు, డిసెంబర్ 27:--
జిల్లా ప్రణాళిక అధికారిగా పనిచేస్తున్న శ్రీ సురేష్ కుమార్ అనారోగ్యంతో ఆదివారం ఆకస్మికంగా మృతి చెందడం పట్ల సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం లో జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో జిల్లా అధికారులు అందరూ సంతాపసూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లు శ్రీ హరెందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విదెహ్ ఖరే, శ్రీమతి రోస్ మాండ్, డి ఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
'స్పందన' కార్యక్రమంను నిర్వహించిన నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
ఫిర్యాదులను అత్యధిక ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి- యస్.పి. గారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. మహిళలు, కుటుంబ సమస్యలలో ఓర్పుగా వ్యవహరిస్తూ, పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించి చక్కదిద్దేలా వ్యవహరించాలని సూచన. మహిళలు మోసపూరిత వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలని సూచన. దొంగతనాల కేసుల రికవరీలో బృందాలను ఏర్పాటు చేసి, వేగంగా చేధించాలని ఆదేశాలు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వరమే పరిష్కారం చూపాలని ఆదేశించిన యస్.పి. గారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకుంటూ, వారి సమస్యలను సత్వరం పరిష్కారించి వారికి భరోసా కల్పించాలని ఆదేశాలు. 65 ఫిర్యాదులు స్వీకరణ, 150 మందికి భోజనాలు అందించిన యస్.పి. గారు
దొంగతనానికి పాల్పడ్డ దొంగ అరెస్ట్...
మూడున్నర లక్షల విలువ చేసే బంగారు నగలు రికవరీ...
కావలి పట్టణం లోని బాలకృష్ణ రెడ్డి నగర్ లో దొంగతనం చేసి తప్పించుకొని తిరుగుతున్న పాలకీర్తీ రాజేష్ ను కావలి రూరల్ పోలీసులు పట్టుకుని అతని వద్ద నుంచి మూడు లక్షల 50 వేలు విలువ చేసే తొమ్మిదన్నర సవర బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు కావలి డియస్పీ దేవరకొండ ప్రసాద్ వెల్లడించారు. సోమవారం కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం డి.ఎస్.పి ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన కావలి పట్టణంలోని బాలకృష్ణ రెడ్డి నగర్ లోని మొగిలి కోటేశ్వరరావు ఇంటిలో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు తన ఇంటి తాళం దాచి ఉన్న చోట నుంచి తీసుకుని ఇంటి తలుపులు తెరిచే బీరువాలోని లాకర్ ఇనుప రాడ్డు తో బలవంతంగా తెరచి అందులోని ఉన్న బంగారు వస్తువులను దొంగిలించుకుని పోయినట్లు ఫిర్యాదు అందిందన్నారు. పిర్యాదు మేరకు కావలి రూరల్ పోలీస్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సోమవారం ఉదయం 7:30 గంటలకు రాబడిన సమాచారం మేరకు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయ రావు ఆదేశాల మేరకు కావలి డిఎస్పి దేవరకొండ ప్రసాద్ రూరల్ సీఐ ఎస్.కె ఖాజావలి పర్యవేక్షణలో కావలి రూరల్ ఎస్. ఐ వీరేంద్రబాబు వారి సిబ్బందితో కలిసి ముసునూరు పమిడి కాలేజీ వద్ద ముద్దాయి పాల కీర్తి రాజేష్ ను అరెస్ట్ చేయబోగా పోలీస్ సిబ్బంది చూసి పారిపోవుట కు ప్రయత్నించి ఉండగా అతని అరెస్టు చేసి అతని విచారించగా తాను చేసిన దొంగతనం ఒప్పు కోవటంతో దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిని అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులను డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ అభినందించి. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు దృష్టికి తీసుకెళ్లి వారి చేతుల మీదుగా రివార్డును అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీ.ఐ ఖాజావలి ఎస్సైలు వీరేంద్ర బాబు, వెంకట్రావు సిబ్బంది పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం.. బ్రిటన్‌లో లాక్డౌన్!
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలని కలవరపెడుతోంది. ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో కొత్త ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చింది. మరోవైపు.. బ్రిటన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్డౌన్ వంటి కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. సింగపూర్‌లో వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం.
Omicron death in Australia: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. పలుచోట్ల కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గతవారం ప్రపంచంలో మొత్తం 51.45 లక్షల కేసులు నమోదు కాగా.. అంతకు ముందు వారంతో పోలిస్తే అది 13 శాతం అధికం. ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. న్యూ సౌత్ వేల్స్లో ఆదివారం 6వేల కొత్త కేసులు నమోదు కాగా.. ఒమిక్రాన్ వేరియంట్ మరణం నమోదైనట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
పశ్చిమ సిడ్నీలోని వృద్ధాప్య సంరక్షణ కేంద్రంలోని 80 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఆయన పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. అనారోగ్య కారణాలతో మరణించినట్టు పేర్కొంది. 'అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఆదివారం 6,324 కొత్త కేసులు వచ్చాయి. ప్రస్తుతం 524 మంది ఆసుపత్రిలో ఉండగా.. 55 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు,' అని వెల్లడించింది.ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూ సౌత్ వేల్స్లో కొత్త ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. బార్లు, రెస్టారెంట్లల్లో 2 చదరపు మీటర్లకు ఒక వ్యక్తి మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది అక్కడి ప్రభుత్వం. ఆతిథ్య రంగంలో క్యూఆర్ కోడ్ ద్వారా తనిఖీలు చేయాలని తెలిపింది.యూకే లాక్డౌన్..!UK lockdown restrictions: బ్రిటన్వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇంగ్లాండ్‌లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి ఇంటి నుంచే పని, మాస్క్, కొవిడ్ టీకా ధ్రువపత్రం తప్పనిసరి వంటి ప్లాన్ బీ చర్యలు అమలులో ఉన్నాయి. మరోవైపు.. వేల్స్లో రాత్రి క్లబ్‌లు ఆదివారం నుంచి మూసివేయాలని ఆదేశించారు. పబ్బులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లల్లో ఆరుగురుకి మించి గుమికూడదు. ఇండోర్ ఈవెంట్స్‌కు 30 మంది, బహిరంగ ప్రదేశాల్లో 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు.
సింగపూర్‌లో వ్యాక్సిన్ తప్పనిసరి.. Singapore restrictions for travelers: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది సింగపూర్. వర్క్ పాసులు, దీర్ఘకాల పాసులు, శాశ్వత నివాసాల దరఖాస్తులు ఆమోదించాలంటే.. కొవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. అలాగే.. వర్క్ పాసులు పునరుద్ధరణ చేసుకునేవారు సైతం తప్పనిసరిగా టీకా తీసుకోవాల్సిందేనని తెలిపింది. అయితే, 12 ఏళ్లలోపు పిల్లలు, వైద్య పరంగా వ్యాక్సిన్‌కు అర్హత లేనివారికి ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది.ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో 10 ఆఫ్రికా దేశాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది సింగపూర్. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య రెండింతలు పెరుగుతుందని నిపుణులు హెచ్చరించటం ప్రాధాన్యం సంతరించుకుంది. బోట్స్వానా, ఈస్వతిని, ఘనా, లెసోతో, మాలావి, మోజాంబిక్, నమీబియా, నైజీరియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేల నుంచి గత 14 రోజుల నుంచి సింగపూర్ వచ్చిన వారిపై కేటగిరి 4 ఆంక్షలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి తీసుకొచ్చింది.
సిద్దు ఆద్వర్యంలో భారీ ఎత్తున చైన్నైకు తరలిన రామ్ చరణ్ అభిమానులు.
చైన్నైలో నిర్వహిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షనకు పవన్ కల్యాణ్ అభిమాన సంఘాల నాయకులు సిద్దు ఆద్వర్యంలో మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సోమవారం కావలి నుంచి సిద్దు ఏర్పాటు చేసిన ట్రావెల్ బస్సు ,టెంపోలలో 1౦౦ మంది అభిమానులు చెన్నై కు బయలుదేరి వెళ్లినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా ట్రైలర్ ఉండటం అందులో రాజమౌళి డైరక్షన్ లో తెరక్కక్కటంతో అభిమానుల ఆశలకు హద్దు లేకుండా పోయిందన్నారు. అలానే రాష్ట్రంలో సినీ ధియేటర్ల పై ప్రభుత్వం చర్యలను ,నియంత పోకడలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ,డీజల్ ,మద్యంపై ధరలను తగ్గించని ప్రభుత్వం సినీ ధియేటర్ల పై రేట్లు తగ్గించి ప్రజలకు ఏదో చేసినట్లు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
చర్ల మండలంలో భారీ ఎన్ కౌంటర్.
పోలీసులు , మావోయిస్టులు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు..
ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.. అందులో ఇప్పటివరకు చెర్ల ఏరియా మిలటరీ కమాండర్ మధు చనిపోయినట్టు గుర్తించిన పోలీసులు. మిగతా మావోయిస్ట్ లను గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొనసాగుతున్న కూబింగ్ ఆపరేషన్....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:చర్ల మండలం లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు , ఈరోజు తెల్లవారుజాము నుంచి చర్ల సమీపంలో ఉన్న చెన్నాపూర్ అడవులలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు , ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు అలాగే చత్తీస్ ఘడ్ పోలీసులు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. గత పది రోజుల క్రితం తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి చర్ల మండలంలోని అడవుల్లో రహస్యంగా పర్యటించి పోలీసులకు నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ ప్రారంభం కాగా పది రోజుల వ్యవధిలోనే భారీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. చర్ల మండలం లోని మావోయిస్టులు తిరుగుతున్నట్లుగా, మకాం వేసినట్లుగా సమాచారం అందుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ మావోయిస్టుల ఏరివేతకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే డీజీపీ రహస్య పర్యటన చేసినట్లు సమాచారం. పది రోజుల వ్యవధిలో భారీ ఎన్కౌంటర్ జరగడం, ఆరుగురు మావోయిస్టులు మృతి చెందడం పోలీస్ వర్గాలు ఒక చర్చ జరుగుతుంది. కచ్చితంగా డీజీపీ ఫ్లాన్ సక్సెస్ అయినట్లు సమాచారం.