అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామంలో నూతన దంపతులు కొండూరు శేషాద్రి,కొండూరు లావణ్య ఆశీర్వదించిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు, వైయస్ ఆర్ సీపీ నాయకులు బీద రమేష్ యాదవ్, సర్పంచ్ కొండూరు సీనయ్య గారు,ఎంపీపీ శశిరేఖ గారు, వైయస్ ఆర్ సీపీ నాయకులు మేడ కృష్ణారెడ్డి గారు, సురేష్ గారు.
విత్తన నిల్వ మరియు శుద్ధీకరణ గోదాముకు శంకుస్థాపన చేసిన పేర్నాటి దంపతులు
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజు నెల్లూరు పార్లమెంటు కావలి నియోజకవర్గ పరిధిలోని కావలి మండలం, రుద్రకోట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న విత్తన నిల్వ మరియు శుద్ధీకరణ గోదాము శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పేర్నాటి హేమ సుష్మిత గారు
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పేర్నాటి హేమ సుష్మిత గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 33 విత్తన నిల్వ కేంద్రాలు, మరియు శుద్దీకరణ గోదాములను ఏర్పాటు చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారని అందులో భాగంగా ఈరోజు మూడవ విత్తన నిల్వ మరియు శుద్ధీకరణ గోదామును కావలి నియోజకవర్గంలో శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ, నాణ్యమైన విత్తనాలను అందిస్తూ, రైతులు పండించిన పంటను విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా రైతులు వాళ్ళ పంటను నిల్వ చేసుకునేందుకు వీలుగా విత్తన నిల్వ గోదాములను నిర్మించడం జరుగుతుందని, ప్రస్తుతం వరి విత్తనాలకు కు కిలోకి 5 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో కిలోకి పది రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రానికి సంబంధించి మొక్కజొన్న, వేరుశనగ, పెసలు, మినుము అంతర పంటలకు సంబంధించిన విత్తనాలను భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి సబ్సిడీని మన ముఖ్యమంత్రి గారు రైతులకు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి మార్కెట్ యార్డ్ చైర్మన్ సుకుమార్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లా విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్, మరియు అధికారులు నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు - 36 గంటల పాటు చంద్రబాబు గారి నిరసన దీక్ష
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైకాపా మూక దాడికి వ్యతిరేకంగా పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గారు నిరసన దీక్ష చేపట్టనున్నారు. “ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు” పేరుతో 21-10-2021 గురువారం ఉదయం 8 గంటల నుంచి 22-10-2021 శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబునాయుడు గారు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యింది. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారు. ప్రజాస్వామ్యం నశించింది. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. అక్కడున్న టీడీపీ నేతలు, సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారు. కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారు. నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం దమనకాండను మొదటినుంచీ కొనసాగిస్తోంది. దీనిని నిలువరించాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అమరావతి : పోలీసులపై నారా లోకేష్ ఆగ్రహం..
నిన్న దాడిలో గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలింపు.
గాయపడిన కార్యకర్తలు ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో పార్టీ ఆఫీసుకు తరలిస్తుండగా అంబులెన్స్ ను అడ్డుకున్న పోలిసులు.
పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేష్ గారు..
పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి అంబులెన్స్ ను పార్టీ ఆఫీసుకు తీసుకుని వచ్చిన నారా లోకేష్ గారు.
పోలీసులు- కార్యకర్తల మధ్య తోపులాటలు..
ఉద్రిక్తంగా మారిన తెలుగు తమ్ముళ్ల నిరసనలు
తెలుగు తమ్ముళ్ల అరెస్ట్- పోలీసు స్టేషన్ కు తరలింపు
ముందస్తు అరెస్టులు..దారుణం: పాశం
వైసీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు: పాశం
రౌడీ సియం జగన్ అంటూ...పాశం నినాదాలు
డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
గూడూరు డివిజన్ లో టీడీపీ తమ్ముళ్లును కట్టడి చేసిన పోలీసులు
అధికారం ఉంటే రౌడీయిజం చేయడం హేయమైన చర్యలు: పాశం ధ్వజం
ఏపీలో రాజకీయాలుభగ్గుమన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపింది. ఆయన ఇంటిపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. వైసీపీ నేతల దాడికి నిరసనగా టీడీపీ బుధవారం బంద్‌కు పిలుపునిచ్చింది. రెండు పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. వైసీపీ నేతలు కేంద్ర, రాష్ట్ర, టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి.
ముందస్తు అరెస్టులు..
దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. అందులో భాగంగా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు, అదేవిధంగా పలువురు టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు,దింతో పాశం సునిల్ కుమార్ కి ఆగ్రహంకట్టలు తెంచుకొవడంతో ఆయన టిడిపి నాయకులు, కార్యకర్తలు తన ఇంటి వద్దకు రావాలి అని పిలుపునిచ్చారు, దింతో భారీగా తెలుగు తముళ్లు తరలి వచ్చి రోడ్లపై నిరసనకు దిగుతున్న వారిని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో పట్టణ సీఐ నాగేశ్వరమ్మ,ఎస్సై లు, పోలీసులు సిబ్బంది అదుపులోకి తీసుకుని స్టేషన్‌లకు తరలించారు, దీంతో టీడీపీ కార్యకర్తల నిరసనలతోహోరెత్తుతోంది.
టీడీపీ నాయకులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు, గూడూరులో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ప్రోత్సాహంతోనే విధ్వంసం జరుగుతుందనిఆరోపించారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేపడుతున్నారని ధ్వజమెత్తారు.ఈవ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయనకోరారు.ప్రభుత్వందారుణానికిపాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు
వైసీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయడం లేదు: పాశం
టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలను ఇంతవరకు అరెస్టు చేయలేదని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగిన తమను పోలీసులు బలవంతంగా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
అరెస్ట్ అయిన తెలుగు తమ్ముళ్లు వీరే..
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ వాళ్ళు దాడికి నిరసనగా బుధవారం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ కు బయలు దేరుతున్న గూడూరుమాజీశాసనసభ్యుల పాశిం సునీల్ కుమార్ ని మరియు తెలుగు దేశం పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేసి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు,సునీల్ కుమార్ తో పాటు గూడూరు పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, గూడూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, పట్టణ కార్యదర్శి నిమ్మకాయలు నర్సింహులు, మాజీ కౌన్సిలర్స్ వాటంబేటి శివకుమార్ పుచ్చలపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా బిసి సెల్ కార్యదర్శి పిల్లెళ్ళ శ్రీనివాసులు, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి బత్తిన ప్రణీత్ యాదవ్, నియోజకవర్గ, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, పట్టణ బిసి సెల్ అధ్యక్షులు రావుల శివ ప్రసాద్ గౌడ్, నాయకులు చంద్రమౌళి, అల్లీహుస్సేన్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు అనంతరం పూచీకత్తు పై విడుదల చేశారు.
కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బంద్ ను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రోడ్డుమీదకు రానివ్వని పోలీసులు బంద్ ని అడ్డుకునేందుకు రోడ్డు పైకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను యదేచ్ఛగా స్వేచ్ఛగా గుమికూడెందుకు అవకాశం కల్పించారు. పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో తెలుగుదేశం శ్రేణులు తలపెట్టిన బంద్ ను పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారు. తప్పించుకొని పార్టీ కార్యాలయానికి చేరుకున్న తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను విచక్షణారహితంగా ఆటోలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. బంద్ ని అడ్డుకునేందుకు రోడ్డు పైకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు స్వేచ్ఛగా వదిలేసారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అబాసుపాలు అవుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీదకు వీధి రౌడీల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దూసుకు రావడాన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నాయి. ప్రతిపక్షాల మనుగడను ప్రశ్నార్థకం చేసే విధంగా అధికారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న చర్యలు ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్తారని తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.