ఆంధ్ర బంద్ కు టీడీపీ పిలుపు
అప్రమత్తమైన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హౌస్ అరెస్టు
టీడీపీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే పాశం ఇంటికి టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలి అని టీడీపీ పిలుపు
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు పై దాడులు, టిడిపి నేత పట్టాభి ఇంటి పై వైసీపీ నేతలు దాడులు ఖండిస్తూ టీడీపీ అధిష్టానం, టీడీపీజాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలను గృహనిర్బంధంలోఉంచుతున్నారు. అందులో భాగంగా గూడూరు టీడీపీ నేతలను పోలీసులు వాళ్ళ వాళ్ళ ఇళ్ల వద్ద పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు.
ముందుగా గూడూరు టీడీపీ మాజీ శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బిల్లు చెంచు రామయ్య, నెలవల భాస్కర్ రెడ్డి, మట్టం శ్రావణి లతో పాటు పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధంలోఉంచారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గూండాగిరి పాలన చేస్తున్న ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులుదగ్గరపడ్డాయని ఆయనధ్వజమెత్తారు .
మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై,టీడీపీ నాయకులు జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిమీద జరిగిన దాడిని నిరసిస్తూఅధినేత ,జాతీయఅధ్యక్షులునారా.చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బంద్ కు పిలుపు ఇవ్వడంజరిగిందిఅన్నారు,అందులోభాగంగారాష్ట్రబంద్ లోపాల్గొనకుండా ముందస్తుగా పోలీస్ పహారా తో హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.
రాష్ట్రంలో అరాచక పాలన చరిస్తున్నారని,ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగాఉందనివిమర్శించారు.ప్రభుత్వవ్యతిరేకవిధానాలను ప్రశ్నిస్తే గూండాగిరి చేస్తున్నఅధికారప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు గూడూరు అశోక్ నగర్ లో ఉన్న తన ఇంటిదగ్గరకుతరలిరావాలి అని పిలుపునిచ్చారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన బంద్ ను విజయ వంతంచేద్దాం అని ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అల్లరి మూకల దాడిలో టిడిపి కార్యాలయాల ధ్వంసం, భౌతిక దాడులు జరిగిన నేపథ్యంలో టిడిపి అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పిలుపిచ్చిన రాష్ట్ర బంద్ ను నిలువరించే ప్రయత్నం లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారిని నెల్లూరు, మాగుంట లేఔట్ లోని ఆయన నివాసంలో దర్గామిట్ట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ వైసిపి నాయకులు, కార్యకర్తలు బరితెగించి టిడిపి నాయకులపై, టిడిపి కార్యాలయాలపై దాడులు చేస్తుంటే స్పందించని పోలీసులు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు. పోలీసులు అత్యుత్సాహం అక్రమ హౌస్ అరెస్ట్ లలో కాకుండా దోషుల్ని శిక్షించడం లో చూపితే బావుంటుంది. దాడులు జరిగే సమయంలో మౌనం పాటించడం, దాడి అనంతరం టిడిపి నేతలు కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ ఇవ్వకుండా అరెస్టులు చేయడం, అనంతరం బాధితులపై అక్రమ కేసులు బనాయించడం పోలీసులకు నిత్యకృత్యం గా మారింది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సజీవంగా ఉందని డీజీపీ భావిస్తే టిడిపి కార్యాలయాలపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమని సంకేతం ఇస్తోంది?
ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అభ్యంతరకర వ్యాఖ్యలుంటే నిలువరించడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉన్నాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాల పై దాడులు, ఆస్తుల విధ్వంసం, వ్యక్తిగత భౌతిక దాడులకు పాల్పడడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందో ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎంతకైనా తెగిస్తాం అంటూ ప్రజల్లో భయాందోళనలు రేకిత్తించడమే ఈ ప్రభుత్వం ఉద్దేశమా? గతంలో మంగళగిరిలోని మా జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ నిరసనకు సిద్ధమవుతోన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కార్యాలయంలోకి పోలీసు బలగాలతో చొరబడి ఈ ప్రభుత్వం నిలువరించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలోకి రౌడీమూకళ్ళా చొరబడి దాడులకు తెగబడడం పార్టీలకతీతంగా ఖండించాల్సిన విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోక పోతే రాష్ట్రం అరాచకంగా మారే అవకాశాలు ఉన్నాయి. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఈ అంశాల్లో కఠినంగా వ్యవహరించకపోతే రానున్న రోజులు మరింత దారుణంగా మారుతాయి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరులో వైసీపి కార్యకర్తలు టిడిపి కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. మంగళగిరి టిడిపి కార్యాలయంలో పట్టాభి విలేకరుల సమావేశం అనంతరం ఆ కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో టిడిపి కార్యాలయాల వద్ద వైసీపి నేతలు ఆందోళనలు చేపట్టారు. నెల్లూరులో ముందుగానే పసిగట్టిన టిడిపి నేతలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముందుగానే పోలీసులు టిడిపి కార్యాలయం వద్దకు చేరుకుని బారీకేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది వైసీపి కార్యకర్తలు అక్కడకు చేరుకుని బారీకేడ్లను తోసుకుని టిడిపి కార్యాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని దూరంగా నెట్టుకుంటూ తీసుకెళ్లారు. తర్వాత వైసీపి కార్యకర్తలు నినాదాలు చేయగా... అప్పుడే అక్కడికి చేరుకున్న టిడిపి కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన పోలీసులు వైసీపి కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.