దొరవారిసత్రం మండలం ఎంపీడీవో కార్యాలయము నందు వైయస్సార్ ఆసరా 2 విడత సంబరాల్లో భాగంగా గా ఆసరా 598 పొదుపు సంఘాలకు రూ 4.46 కోట్లు బ్యాంకు రుణాలు134 సంఘాలకు కోట్లుచెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో DRDA.పిడి సాంబశివారెడ్డి మండల ఉపాధ్యక్షుడు దువ్వూరు గోపాల్ రెడ్డి ,ఎంపిడిఓ సింగయ్య, AC వసుంధరాదేవి, APM రాజారెడ్డి, CC లు ,VOA లు లు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు
ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యంచేయవద్దు-(ఎస్ఎఫ్ ఐ )
కావలి జవహర్ భారతి కళాశాలల గేట్ వద్ద ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చెయవద్దని కోరుతూ శనివారం ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేసారు.ఈసందర్భంగా ఎస్ ఎఫ్ ఐజిల్లాఅధ్యక్షుడు సనత్ మాట్లాడుతూ "ఎయిడెడ్,విద్యాసంస్థలను నిర్యిర్యం" చేసేందుకు రాష్ట్రప్రభుత్వంగతనెల10వ తేదీన జి.వో.నెం42ను తీసుకుని వచ్చి, టీచింగ్ నాన్ టీచింగ్ లెక్చరర్స్ ను పూర్తిగాసుమారు10200మందిని ఇతర ప్రభుత్వ సంస్థలకుమార్చివేసారని తెలిపారు.దీనివలన ఆ సంస్థలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులను, బోధ నేతరసిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. కావలిలో చరిత్ర లొ ప్రసిద్ధి చెందిన జవహర్,భారతి,విశ్వోదయ కాలేజీఉందన్నారు దిన్ని ప్రభుత్వం వెంటనే ఎయిడెడ్ విద్యాసంస్థలా గా కొనసాగించాలని డిమాండ్,చేశారు.ఈకార్యక్రమంలోపూర్వవిద్యార్దులు కల్లయ్య మాట్లాడుతు, జవహర్ భారతి ఎయిడెడ్ కళాశాలలో అనేక మంది పేదవిద్యార్థులుచదువుకోని ఉన్నత స్థాయికి వెళ్లారన్నారు. జవహర్ భారతికళాశాలలనుమరియు విశ్వదయ పాఠశాలలనుఎయిడెడ్, గా కొనసాగించాలనిడిమాండ్ చేశారు. ఆకాలేజీ లోపేదవిద్యార్థులకుచదువుకొనేఅవకాశంకల్పించాలిఅనికోరారు.ఈకార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులుప్రణయ్ ,ఆర్ .మల్లికార్జున్,శివ,ఎస్.ఎఫ్. ఐ. జవహర్ భారతికాలేజీ పూర్వవిద్యార్థులువేంకటరమణయ్య,,టి.మాల్యాద్రి,కె.మాల్యాద్రి,జి.మధుసూదన రావు,గోపసానిఅశోక్,తదితరులు పాల్గొన్నారు.
"బద్వేల్ లో భారీ మెజారిటీ సాధిద్దాం" - కాకాణి.
వై.యస్.ఆర్.కడప జిల్లా, బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
అధ్యక్షుడిపై అంతులేని అభిమానం, ఆప్యాయత చూపిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు...
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధ్యక్షుడి చేత 60 కేజీల భారీ కేక్ కట్ చేయించి అధ్యక్షుడిపై అంతులేని అభిమానాన్ని, ఆప్యాయతను చూపారు...
కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి,కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ, మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ కీలారి వెంకటస్వామి నాయుడు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు...
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ....పెద్దలందరీ సూచనలను, సలహాలను తూచా తప్పకుండా పాటిస్తూ, పార్టీనీ సమర్థవంతంగా ముందుకు నడిపించారు అన్నారు..పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ అధ్యక్ష పదవి స్వీకరించి, అందరినీ సమన్వయ పరుచుకుంటూ, జిల్లా లో ఏ నియోజకవర్గంలో సమస్య వచ్చినా ముందుండి అందరికీ భరోసా కల్పించారు...
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు...అధికార పక్షాన్ని ఎప్పటికప్పుడు నిలదీయడం లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన పోరాటం మరువలేనిదన్నారు.....24*7 ప్రతీ కార్యకర్తకు అందుబాటులో ఉంటాను, మీ సమస్య - నా సమస్య, మీ బాధ - నా బాధ, మీ ఆనందం - నా ఆనందం ప్రతి కార్యకర్త నా కుటుంబ సభ్యులతో సమానం.పార్టీకి అండగా కార్యకర్తలు పడుతున్న కష్టం మరువలేనిది..
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ...రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు..నీతి నిజాయితీలతో పాలన చేసి మచ్చ లేని నాయకుడిగా పేరు గాంచారు...రాబోయే రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో జిల్లా లో పది కి పది నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయబోతున్నాం...
పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, బోమ్మీ సురేంద్ర, గున్నయ్య, జాఫర్ షరీఫ్, జలదాంకి సుధాకర్, సాబీర్ ఖాన్, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయి లో పాల్గొన్నారు
నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జి పెనేటి మల్లికార్జున, ఆయన మిత్రబృందం దాదాపు 150 మంది నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారి సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. పార్టీలో చేరిన వారిలో పి. నాని, ఎస్.కె. షాను, ఎస్.కె.షఫీ, డి.ప్రవీణ్, కె.చిరంజీవి, కె.బాలు, బి.మణి, ఐ.రూపేష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, బిజివేముల భాస్కర్ రెడ్డి, మెట్టు శశిధర్ రెడ్డి, నవీన్, పద్మనాభరెడ్డి, మణి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చెరుకు రైతులు మరియు నేతాజీ చెరకు రైతు సంఘం సభ్యులు ఎమ్మెల్యే శ్రీమతి ఆర్కే రోజా గారిని కలిసి విన్నవించడం జరిగింది.
ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఇక్కడ చక్కెర ఉత్పత్తిలో ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేదని , ఒకప్పుడు 6 చక్కెర కర్మాగారాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుందని కావున వీరి చెరకును ఆ ఫ్యాక్టరీ తీసుకోవడం లేదని, కాబట్టి రైతులు, రైతు కూలీలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఈ కారణంగా గాజులమండ్యం SV కోపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా నగరి నియోజకవర్గం నిండ్ర మండలంలోని నేటంస్ షుగర్ ఫ్యాక్టరీ నుంచి 4500 రైతు కుటుంబాలకు రావలసిన బకాయిలు 37.00 కోట్ల రూపాయలు చెల్లించడానికి తగు చర్యలు తీసుకోవాలని మరియు ఇది వరకే ఉత్పత్తి ఉన్నటువంటి మూడు లక్షల టన్నుల చెరకును ప్రస్తుతం నడుస్తున్న SNJ షుగర్ ఫ్యాక్టరీ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరియు ఈ జిల్లా చెరుకు రైతుల పండించే చే చెరకు ద్వారా తయారయ్యే చక్కెరను తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి అవసరాలకు తీసుకోవాలని తద్వారా జిల్లాలను చెరుకు రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానానికి బెనిఫిట్ జరుగుతుందని తెలిపారు
ఈ సమస్యలను వారందరి తరఫున 11వ తేదీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనలో లో వారి దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు
రవి కిరణాలు న్యూస్ తడ:శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులు సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో చండీయాగం నిర్వహించుట జరిగినది. ఉభయకర్తలుగా శ్రీ అనంతరాజు ఉమామహేశ్వరరావు శ్రీమతి లక్ష్మి సుభద్ర, చెన్నై వారు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు పాల్గోన్నారు.