ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యంచేయవద్దు-(ఎస్ఎఫ్ ఐ )
ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యంచేయవద్దు-(ఎస్ఎఫ్ ఐ )
కావలి జవహర్ భారతి కళాశాలల గేట్ వద్ద ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చెయవద్దని కోరుతూ శనివారం ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేసారు.ఈసందర్భంగా ఎస్ ఎఫ్ ఐజిల్లాఅధ్యక్షుడు సనత్ మాట్లాడుతూ "ఎయిడెడ్,విద్యాసంస్థలను నిర్యిర్యం" చేసేందుకు రాష్ట్రప్రభుత్వంగతనెల10వ తేదీన జి.వో.నెం42ను తీసుకుని వచ్చి, టీచింగ్ నాన్ టీచింగ్ లెక్చరర్స్ ను పూర్తిగాసుమారు10200మందిని ఇతర ప్రభుత్వ సంస్థలకుమార్చివేసారని తెలిపారు.దీనివలన ఆ సంస్థలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులను, బోధ నేతరసిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. కావలిలో చరిత్ర లొ ప్రసిద్ధి చెందిన జవహర్,భారతి,విశ్వోదయ కాలేజీఉందన్నారు దిన్ని ప్రభుత్వం వెంటనే ఎయిడెడ్ విద్యాసంస్థలా గా కొనసాగించాలని డిమాండ్,చేశారు.ఈకార్యక్రమంలోపూర్వవిద్యార్దులు కల్లయ్య మాట్లాడుతు, జవహర్ భారతి ఎయిడెడ్ కళాశాలలో అనేక మంది పేదవిద్యార్థులుచదువుకోని ఉన్నత స్థాయికి వెళ్లారన్నారు. జవహర్ భారతికళాశాలలనుమరియు విశ్వదయ పాఠశాలలనుఎయిడెడ్, గా కొనసాగించాలనిడిమాండ్ చేశారు. ఆకాలేజీ లోపేదవిద్యార్థులకుచదువుకొనేఅవకాశంకల్పించాలిఅనికోరారు.ఈకార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులుప్రణయ్ ,ఆర్ .మల్లికార్జున్,శివ,ఎస్.ఎఫ్. ఐ. జవహర్ భారతికాలేజీ పూర్వవిద్యార్థులువేంకటరమణయ్య,,టి.మాల్యాద్రి,కె.మాల్యాద్రి,జి.మధుసూదన రావు,గోపసానిఅశోక్,తదితరులు పాల్గొన్నారు.