నెల్లూరు నగరంలోని మూలపేట నందు గల శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ నూతన రాతి మండప నిర్మాణానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ గారు శంఖుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్, నాయకులు గోగుల నాగరాజు, శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ లోకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్గామిట్ట లోని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, బారాషాహీద్ దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, నెల్లూరు రూరల్ లో షాదీ మంజిల్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, రూరల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మంచినీటి పధకం కోసం ద్వంసమైన రోడ్లు పునర్నిర్మించాలని, ఇది కాకుండా రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
రెండు నెలలో ద్వంసమైన రోడ్లను పునర్నిర్మిస్తామని, మిగిలిన పనులకు కూడా నా వంతు సహకారం అందిస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి హామీ ఇచ్చిన మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ గారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం, ప్రజల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు.
శ్రీసిటీలో మరో ఏసీ పరిశ్రమకు భూమిపూజ
రవి కిరణాలు న్యూస్ తడ:
రూమ్ ఎయిర్ కండీషనర్లు, విడిభాగాల తయారీలో పేరుగాంచిన యాంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సంస్థ శుక్రవారం శ్రీసిటీలో తన నూతన పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ చేసింది.
ఈ సంస్థకు ఇది దేశంలో 15 వ ప్లాంట్ కాగా, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది. ఈ పరిశ్రమలో ప్రధానంగా ఏసీలు, ఏసీ విడిభాగాలు ఉత్పత్తి చేసి, దేశంలోని 20కు పైగా ప్రముఖ ఏసీ కంపెనీలకు సరఫరా చేయనున్నారు. డైకిన్, బ్లూస్టార్, యాంబర్ వంటి వరుస ఏసీ కంపెనీలతో ఏసీల తయారీ రంగంలో శ్రీసిటీలో సరికొత్త వ్యాపారానుకూల వ్యవస్థ రూపుదిద్దుకుంటూ మరిన్ని కంపెనీలను ఆకర్షిస్తోంది. నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.
కాగా, శ్రీసిటీకి గత నెల రోజులు ఎంతో విశిష్టత సంతరించుకున్న కాలంగా పేర్కొనవచ్చు. మూడు వారాల క్రితం EPCES నుండి 2020-2021 కొరకు 'డెవలపర్స్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు' శ్రీసిటీకి దక్కగా, మూడు రోజుల క్రితం ఇండస్ట్రీ మరియు ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ (DPIIT) వారి ఇండస్ట్రీయల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ 2.0 (IPRS) లో దేశంలోని 349 ఇండస్ట్రియల్ పార్కులు & సెజ్‌లలో లీడర్ గా శ్రీసిటీ ర్యాంక్ కైవసం చేసుకోవడం విశేషం.
నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం ఎంపీపీ పదవీ స్వీకరణ శ్రీ కురుగొండ ధనలక్ష్మి గారు అ అధ్యక్ష పదవీ స్వీకరించగా ఉపఅద్యక్ష పదవీ శ్రీ నెలవల మమత స్వీకరించారు.
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ గౌరవనీయులైన కిలివేటి సంజీవయ్య గారి నాయకత్వంలో నాయుడుపేట మండలం ఎంపీపీ పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ కురుగొండ ధనలక్ష్మి గారు; ఉపాధ్యక్షులుగా శ్రీ నెలవల మమత గారు నియమితులైనారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు రమణారెడ్డి గారు,రాజారెడ్డి గారు,గ్రామ సర్పంచులు,మండల ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, యువ నాయకులు పాల్గొన్నారు.
ఇన్సాఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
8జీడీఆర్1 - మాట్లాడుతున్న ఇన్సాఫ్ కమిటీ జిల్లా అధ్యక్షులు
గూడూరు : ఈ నెల 17న నిర్వహించనున్న ఇన్సాఫ్ కమిటీ జిల్లా మహా సభలను గూడూరులోని షాదీమంజిల్ లో నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా తన్జీమ్ ఏ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని షాదీమంజిల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలో నిర్వహించనున్న జిల్లా మహాసభలకు ఇన్సాఫ్ కమిటీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, రాష్ట్ర కన్వీనర్ అప్సర్, జాయతీయ స్థాయి నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇన్సాఫ్ కమిటీ గౌరవాధ్యక్షులు షేక్. కాలేషా మాట్లాడుతూ మహాసభలకు మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా మాట్లాడుతూ ఇన్సాఫ్ కమిటీ మహాసభలలో భాగంగా కరోనా సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన మైనారిటీ సంస్థల నిర్వాహకులను సేవా పురస్కారం, ప్రసంశాపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. మాజీ ఎంపీ, హైదరాబాద్ మాజీ ఎంపీ, ఇన్సాఫ్ కమిటీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, రాష్ట్ర కన్వీనర్ అప్సర్ ఈ మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ముస్లింల సమస్యలు, హక్కులు తదితర అంశాలపై ఉపన్యసిస్తారని తెలిపారు. ఈ మహాసభలలోనే జిల్లా కమిటీ ఎంపిక ఉంటుందన్నారు. జిల్లాలోని 46 మండలాలలో నూతన కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ సలహాదారులు ఎండీ. అన్వర్ బాష, నియోజకవర్గ అధ్యక్షులు షేక్. హాషిం, షేక్. చాన్ బాష, సిరాజ్, నయూమ్, హసన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
రవి కిరణాలు న్యూస్ తడ:
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి శరన్నవరాత్రులు మొదటి రోజు శ్రీ పరమేశ్వరి అలంకారం చేయుట జరిగినది అలంకారం ఉభయకర్తలుగా శ్రీ శిoగన ఓబుల్ రెడ్డి శ్రీమతి పద్మజా రెడ్డి దంపతులు,చెన్నై వారు వ్యహరించినారు. చైర్మన్ దువ్వూరు బాలచంద్రా రెడ్డి, కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు, కర్లపూడి మదన్ మోహన్ జ్యోతి ప్రజ్వలనతో శరన్నవరాత్రులు అలంకారం ప్రారంభించిన్నారు