నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధి గిరిజన కాలనీలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, వెంకటరమణ, జాకీర్, నాగరాజు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
06.10.2021 వ తేదీన ఉదయం 11.00 గంటలకు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు Cobblers (చెప్పులు కుట్టు వారు) మరియు Waste Paper Pickers (చిత్తు కాగితములు ఏరుకునే వారు) ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో Cobblers (చెప్పులు కుట్టు వారు) మరియు Waste Paper Pickers (చిత్తు కాగితములు ఏరుకునే వారు) ఆర్ధికంగా ఇబ్బందులకు గురై వారి కుటుంబాలను నడుపుకొనుటకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కష్ట కాల సమయంలో జాన్ హోప్కిన్స యునివర్సిటి వారి సౌజన్యంతో Cobblers (చెప్పులు కుట్టు వారు) మరియు Waste Paper Pickers (చిత్తు కాగితములు ఏరుకునే వారు) వారికి ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగినది అని తెలియచేసారు.
ఇదే విధంగా గతంలో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగినది అని తెలియచేసారు. లాక్ డౌన్ సమయంలో ఉచితంగా నాణ్యమైన 55,000 భోజనాలు, బట్టలు, దుప్పట్లు, సబ్బులు, బ్రష్ లు, టూత్ పేస్ట్ లు, షాంపూలు 73 రోజుల పాటు 4 వివిధ పునరావాస కేంద్రాలలో పంపిణీ చేయటం జరిగిందని తెలియచేసారు. ఇదే కాకుండా జిల్లా రెడ్ క్రాస్ నూతన కమిటీ వచ్చినప్పటి నుండి వివిద సేవ కార్యక్రమములు చేయటం జరుగుతోందని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ గునపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీ యడవలి సురేష్, శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, నెల్లూరు జిల్లా శాఖ కింద వున్న ARV ప్రాజెక్టు కన్వీనరు శ్రీ బి.వెంకు రెడ్డి, రెడ్ క్రాస్ జీవిత కాల సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు : అంతరిక్ష రంగంలో ఇస్రో మన దేశం నిజంగా గర్వించదగ్గ గొప్ప సంస్థని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ పేర్కొన్నారు సోమవారం ఉదయం వారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట లో వెలసి వున్న శ్రీ చెంగాలమ్మ దేవస్థానాన్ని దర్శించుకుని పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు శ్రీహరికోటలోని షార్ సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం చేరుకుని అక్కడి ఎం.ఆర్.కే. ఆడిటోరియంలో చిన్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల లో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. తదనంతరం గవర్నర్ వారోత్సవాల టీజర్ వీడియోను ఆవిష్కరించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. అంతరిక్ష పరిశోధన, అన్వేషణలో చాలా సంవత్సరాలుగా మనకు గొప్ప వారసత్వం ఉందన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్రో మనదేశం నిజంగా గర్వించదగ్గ గొప్ప సంస్థ అని ప్రశంసించారు. ఇస్రో అంచలంచలుగా ఎదిగి జిఎస్ఎల్వి మార్క్-3 ప్రయోగ స్థాయికి చేరుకుందన్నారు. ఇస్రో పితామహు లైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తదితర దిగ్గజాలు అందించిన విశిష్ట సేవలను మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వారందించిన స్ఫూర్తి, విశిష్ట సేవలు అభినందనీయమన్నారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కన్న కలలను ప్రొఫెసర్ సతీష్ ధావన్ సాకారం చేశారన్నారు. 1957 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన తొలిసారిగా మానవులు రూపొందించిన భూ ఉపగ్రహం స్పుత్నిక్ -1 ప్రయోగించిన దృష్ట్యా 1999 లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరపాలని ప్రకటించిందన్నారు. ఈ సంవత్సరం ఈ వారోత్సవాల్లో అంతరిక్షంలో మహిళలు అనే అంశంపై చాలా ప్రత్యేక దృష్టి సారించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతరిక్ష శాస్త్రంలో లో మహిళల పాత్ర ప్రోత్సహించడానికి, గుర్తించడానికి ఈ అంశం సరైనదిగా భావిస్తున్నానన్నారు. మహిళల పట్ల చూపే గౌరవ మర్యాదలు ఆదేశం ప్రగతికి మంచి కొలమానాలను అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇస్రోలో మహిళలకు గౌరవం ఇచ్చి అన్ని కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతరిక్ష ప్రయోగ సమయంలో కంట్రోల్ రూమ్ నందు విధంగా విధులు నిర్వహిస్తున్న మహిళలను చూసినప్పుడు సంతోషం కలిగిందని ఇందుకు డాక్టర్ స్వాతి మోహన్ ఇండియన్ అమెరికన్ స్పేస్ సైంటిస్ట్ చర్యలను ను ఉదహరించారు. అంతరిక్ష పరిశోధనలో భారతీయ మహిళల ఆసక్తి, ధైర్యసాహసాలు విదేశాలలో సైతం కనపరచడం అభినందనీయమని, ఇందుకు దిగ్గజాలయిన కల్పనా చావ్లా సునీత విలియమ్స్ ను పేర్కొనవచ్చన్నారు. అంతేకాకుండా ఇటీవల తెలుగు మహిళ శిరీష బండ్ల అంతరిక్షంలో ఎగిరి మూడవ మహిళగా చరిత్ర సృష్టించిందన్నారు. అంతరిక్ష పరిశోధన, అన్వేషణ, ప్రయాణంలలో వారు రోల్ మాడల్గా నిలిచారన్నారు. వారు సృష్టించిన చరిత్రతో మరెంతో మంది యువతులు అంతరిక్ష రంగంలో అడుగు పెట్టేందుకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ముఖ్య ఉద్దేశం అంతరిక్ష సాంకేతికత దాని ప్రయోజనాలను విస్తృతంగా తెలియజేయడమేనన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనపై అవగాహన కలిగించే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఆన్లైన్ ద్వారా వివిధ పోటీ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇస్రో ఎన్నో ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించి గణనీయమైన సేవలు అందించిందని వారు కొనియాడారు. ఉపగ్రహ పరిశోధన ద్వారా విపత్తుల నిర్వహణ, వాతావరణం ముందస్తు హెచ్చరికలు, మత్స్యకారులకు సూచనలు, ఓషణోగ్రఫీ, టెలీమెడిసిన్ టౌన్ ప్లానింగ్, సమాచార వ్యవస్థ, డిటిహెచ్, మొబైల్ ఫోన్ కనెక్షన్ వంటి విస్తృత సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ కలలు కన్నట్లుగా భారతీయ రోదసీ కులు అంతరిక్షంలో అడుగు పెట్టేందుకు చేస్తున్న కృషి గర్వించదగ్గ విషయమని అందులో భారతీయ ఆస్ట్రోనాట్ గా మహిళ ఉంటే చాలా సంతోషమని వారు అన్నారు. అప్పటి డాక్టర్ విక్రమ్ సారాభాయ్ , ప్రొఫెసర్ సతీష్ధావన్ నుండి నేటి ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ వరకు వేలాది మంది ఇస్రో ఉద్యోగులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమన్నారు. అంతకుమునుపు షార్ డైరెక్టర్ శ్రీ ఏ రాజ రాజన్, సార్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రగతిని వివరించారు వారోత్సవాల కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్.వెంకటరామన్ వారోత్సవాల వివరాలను ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలియజేశారు. గవర్నర్ గారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను వివరించి కొనియాడారు. తదుపరి గవర్నర్ గారికి షార్ డైరెక్టర్ జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షార్ అసోసియేట్ డైరెక్టర్ శ్రీ ఎం బి ఎన్ మూర్తి, కంట్రోలర్ శ్రీ ఎం శ్రీనివాసులు రెడ్డి, సంయుక్త కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, అదనపు ఎస్పి శ్రీమతి వెంకటరత్నం పలువురు షార్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
నియోజకవర్గ అభివృద్ధి పై సీఎంకు ఎమ్మెల్యే వినతి
స్ధానిక ఎన్నికల విజయం పై ఎమ్మెల్యే కు సీఎం అభినందన
సీఎం జగన్ ను కలిసిన ఎమ్మెల్యే ఆదిమూలం, జడ్పిటిసి సుమన్ కుమార్
సత్యవేడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, నారాయణవనం జడ్పిటిసి సభ్యులు కోనేటి సుమన్ కుమార్ లు ముఖ్యమంత్రి జగనన్నను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో సత్యవేడు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, నాడు - నేడు పనులు, జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు, సచివాలయాలు, వెల్ నెస్, రైతు భరోసా, పాల కేంద్రాలు, ఇరిగేషన్ పనుల పురోగతిని సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో ఏడు జెడ్పిటిసి స్థానాలు, 80 కి 76 ఎంపీటీసీ స్థానాలు కైవసం చేసుకోవడం పై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ, ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం సంతోషమన్నారు. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందు ఉండాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చడంలో తప్పక సహకరిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో పార్టీని ప్రభుత్వాన్ని విజయ పథంలో నడిపించాలని ఎమ్మెల్యే ఆదిమూలంకు సీఎం సూచించారు.
సుమన్ నాన్న కు అండగా..
పార్టీ కార్యక్రమాల్లో నాన్న (ఆదిమూలం) కు అండగా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నారాయణవనం జడ్పిటిసి సభ్యులు సుమన్ కుమార్ కు సూచించారు. పార్టీ పటిష్టతకు అందరిని కలుపుకోవాలన్నారు. యువకుడు.. తప్పక భవిష్యత్తు ఉందని కితాబిచ్చారు. ఈ సందర్భంగా గా ఎమ్మెల్యే ఆదిమూలం, జడ్పిటిసి సుమన్ కుమార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహూకరించి ఘనంగా సత్కరించారు.
లా అండ్ ఆర్డర్ పై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
అమరావతి.
హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, ఇంటలిజెన్స్ చీఫ్ కే వి రాజేంద్రనాథ్ రెడ్డి, లా సెక్రటరీ వి సునీత, డీఐజీ (టెక్నికల్ సర్వీస్) జి పాలరాజు, విశాఖ రేంజ్ డీఐజీ ఎల్ కె వి రంగారావు, ఏలూరు రేంజ్ డీఐజీ కె వి మోహనరావు, గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ సి ఎం త్రివిక్రమ వర్మ, కర్నూలు రేంజ్ డీఐజీ పి వెంకట్రామి రెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా, దిశ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
అర్బన్ ఎస్పి ఆరిఫ్ హఫీజ్ అసాంఘిక కార్యాకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. లిక్విడ్ గంజాయి గుజరాత్ తరలిస్తున్న పాత గుంటూరు కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశాం. ఒక లీటర్ లిక్విడ్ గంజాయి పట్టుకున్నాం.దీని విలువ మూడు లక్షల రూపాయిలుంటుంది. వైజాగ్ నుండి గుజరాత్ లోని వడోదరకు తరలిస్తున్నారు. రవాణా చేయటానికి సులభంగా ఉండటంతో లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే గంజాయి రవాణా చేస్తున్నారు.
పెరిగిన ధరలను అరికట్టాలని నిరసన ర్యాలీ - సిపిఎం*
నిరసన ర్యాలీలో పాల్గొన్నసిపిఎంనాయకులు.
04-10- 2021. కావలి.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్, కరెంటుచార్జీలనుతగ్గించాలని మరియు చెత్త పన్ను, ఇతర యూజర్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఉదయగిరి రోడ్డు సెంటర్,నుండిప్రదర్శనబయలుదేరి, గాంధీ బొమ్మ సెంటర్, కోర్ట్ సెంటర్, అంబేద్కర్ బొమ్మ, ఆర్టీసీ మీదుగా ఆర్డీవో ఆఫీస్ కి చేరి అనంతరం ఆందోళన చేసి,ఆర్డీవో గారికి అర్జీని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మూలం రమేష్, పి . శ్రీరాములు గార్లతో పాటు కావలి సిపిఎం పట్టణ కార్యదర్శి పి . పెంచలయ్య సిఐటియుజిల్లానాయకురాలు ఎస్.కె. రెహనాబేగంలు పాల్గొనిమాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలనుఅవలంబిస్తున్నారనితీవ్రంగాదుయ్యబట్టారు. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్, కరెంటుఛార్జీలువిపరీతంగా పెంచిప్రజలమీదమోయలేనిభారాలుమోపుతున్నారని పెరిగిన ధరలతో ప్రజలు కొని తినలేని పరిస్థితి లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాతరైతుకార్మిక ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందనిప్రభుత్వ రంగసంస్థలనుప్రైవేటీకరించడంలక్షలమందికార్మికులను వీధులపాలుచేస్తోందని కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ అనేకమందిరైతులు,కార్మికులు చనిపోతున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం స్పందించి సమస్యలనుపరిష్కరించకుండా పోరాటాలను అణచివేసే ధోరణితో పరిపాలన సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు.ఈ పోరాటాలు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాయనిహెచ్చరించారు. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ విధానాలనుఅమలు చేస్తూ మన రాష్ట్రంలో కరెంటు చార్జీలు, ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్త పన్ను పెంచి ప్రజల నుండి ఖజానా నింపుకోవాలని చూస్తున్నదని అన్నారు. ప్రజలపై భారాలుమోపనని చెప్పి అధికారంలోకివచ్చిన ముఖ్యమంత్రిగా వచ్చిననాటినుండిరకరకాల పేరుతో ప్రజలపైభారాలు మోపుతున్నారని కరోన కష్ట కాలంలో ప్రజలు ఉంటే ఆదుకోవాల్సిన రెండు ప్రభుత్వాలు అదుకోకుండా ప్రజలపై భారాలపై భారాలు మోపడం ఇది ఎంతవరకు న్యాయమని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా అన్ని రకాల పెరిగినధరలు, చార్జీలు తగ్గించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించకపోతేప్రజాపోరాటాలు ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధిచెబుతాయనిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్.కె అమీర్,భాషా,వై.కృష్ణమోహన్,పి .పెంచలనరసింహం,జి.మధుసూదనరావు,పి.సుబ్రమణ్యం,బి.వెంకటేశ్వర్లు, పి .సత్యనారాయణ సిఐటియు నాయకులు వై. రవి,ఆనందరావు,మాలకొండయ్య,టీ .శీనయ్య,పి .జేమ్సడి.వై.ఎఫ్.ఐ.నాయకులు పి . కోటేశ్వరరావు, క్రాంతికుమార్,శివకోటయ్య,ఓ.రమేష్,భాస్కర్,మహి ళా నాయకులు పి. అనిత, పి .చిన్నమ్మ,సునీత,జ్యోతి, అనురాధ, మంగమ్మ తో పాటు ప్రజలు కార్మికులు పాల్గొన్నారు