వైసీపీ ప్రభుత్వ కక్షసాధింపు వైఖరితో రైతులు,ప్రజలకు ఇక్కట్లు - టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర
నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల పై న్యాయపోరాటానికి కార్యాచరణ రూపకల్పన నిమిత్తం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, రైతు సంఘాల నాయకులతో సాగునీటి వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాల కృష్ణ అధ్యక్షతన సమావేశం
రెండున్నరేళ్లుగా బిల్లులు చెల్లించకుండా వేధించడంపై ఆవేదన
సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీఎమ్మెల్యేలు బిసి జనార్దనరెడ్డి ,కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, రైల్వేకోడూరు ఇన్ చార్జి పంతగాని నరసింహ ప్రసాద్, రైతు సంఘ నాయకులు కుర్రా నరేంద్ర
ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అన్ని విధాలా నష్టపోయారు రాష్ట్రవ్యాప్తంగా నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి రూ.1277 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో పెండింగ్ లో ఉన్నాయి..మరో 500 కోట్ల రూపాయల వరకు జనరేట్ కాని బిల్లులు ఉన్నాయి.. బిల్లుల కోసం న్యాయపోరాటం చేపట్టబోతున్నాం
కోట పట్టణం అభివృద్ధి లక్ష్యంగా పని చేయండి కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
కమిటీ ఆదేశాల మేరకే అభివృద్ధి పనులు
మా నల్లపురెడ్డి కుటుంబం కంటే నాకు వైయస్సార్ కుటుంబమే ముఖ్యం అని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు కోటలో ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాలవల్ల నల్లపురెడ్డి కుటుంబీకులు కొంతమంది ని దూరం చేసుకోవడం జరిగిందని మరల అటువంటి పునరావతం కాకుండా చూసుకుంటానని ఆయన అన్నారు కోట అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ కమిటీ ఆదేశాల మేరకే అధికారులు విధులు నిర్వహిస్తారని తెలిపారు
కోటలో ప్రక్షాళన చేస్తున్నాం కోటలో వైసిపి బలోపేతానికి చర్యలు కోటలో అభివృద్ధి కమిటీని ప్రకటించిన ప్రసన్న నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రాజేంద్ర కుమార్ రెడ్డి, వినోద్ రెడ్డి, గాది భాస్కర్,షేక్ మొబిన్ 5 మంది కమిటీతో కోటలో అభివృద్ధి పనులు జరుగుతాయి బిల్డింగ్,లే ఔట్ అప్రూవల్ కు 2 రోజుల్లో అనుమతులు పంచాయతీలో అప్రూవల్ కు ఒక్క రూపాయి తీసుకున్న తాట తీస్తా: ప్రసన్న కోట పంట కాలువ పనులు త్వరలోనే దాదారాయి గుంట ఆక్రమణ స్థలాలు స్వాధీనం చేసుకోవాలంటూ ఆదేశాలు కోటలో ఎంపీటీసీ లు కోల్పోవడం బాధాకరం- దానికి నన్ను భాద్యుని చేయడం దుర్మార్గం:ప్రసన్న కోటలో శానిటేషన్ కు 30 లక్షలు డ్రా- విచారణ కు ప్రసన్న ఆదేశం పేర్నాటి,కొడవలూరు ధనుంజయ్య రెడ్డిలను కలుపుకుని పోతా బలమైన నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు దూరం అయ్యారు టీడీపీలో ఉన్న నల్లపరెడ్డి అభిమానులను వైసీపీలోకి తీసుకోని వస్తాం వైసీపీలో వర్గాలకు తావులేదు కోటలో పైసలు కోసం చిల్లర రాజకీయాలు చేస్తే తాట తీస్తా కోటలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట కోటలో నల్లపరెడ్డి కుటుంబం కు పూర్వపు వైభవం తీసుకొని వస్తాం పార్టీకి చెడ్డపేరు తెస్తే కుటుంబ సభ్యులను సైతం పక్కన పెడతాం నేటి నుండి కోటలో సమూల మార్పులు పంచాయతీ నిధుల పై సమీక్ష- ఎన్ సి ఆర్ కళ్యాణ మండపం కు 5 లక్షలు కేటాయింపు సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవనాలు పూర్తి చేయాలి ఐక్యత చాటిన నల్లపరెడ్డి కుటుంబం
ఆంధ్రప్రభ✍️ మీజూరు మల్లి✍️: కోటలో ఆనాడు దివంగత మహానేతలు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సుబ్బా రెడ్డి,హారనాధ్ రెడ్డి లు కోట గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి చేసి మంచి పేరు తీసుకొని వచ్చారు అని,74 ఏళ్లలో కోటను కంచుకోట మార్చి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు అనీ, అలాంటి కోటలో రెండు ఎంపిటిసి సెగ్మెంట్లు కొల్పవడం చాలా బాధాకరంగా ఉంది అని మాజీమంత్రి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సోమవారం కోటలోని ప్రసన్న కుమార్ రెడ్డి స్వగృహంలో కోట రాజకీయ ప్రక్షాళన,కోట అభివృద్ధి, వైసీపీ బలోపేతం పై విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోట గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 14,15 వ ఫైనాన్స్ నిధులు, డ్రీంకింగ్ పైప్ లైన్లు ఏర్పాటు, జనరల్ ఫండ్ నిధులు, పూడిక తీత పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు.
మా కుటుంబ పెద్దల హయాంలో ముగ్గురు సర్పంచ్ లు పనిచేస్తే మంచి పేరు తీసుకొని వచ్చారు అనీ, అలాంటిది ఇప్పుడు కోట గ్రామ పంచాయతీకి కొంతమంది చెడ్డ పేరు తీసుకొని 74 ఏళ్ల చరిత్రకు కళంకం తెస్తున్నారు అనీ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు, కోటలో వైసీపీకి బలం లేకుండా చేయడం చాలా బాధాకరంగా ఉంది అన్నారు,తనకు వైసీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యం అనీ, ఇటీవల ముఖ్యమంత్రి కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో 22 ఓట్లు టిడిపికి మెజార్టీ రావడం,రెండు ఎంపిటిసి లు కొల్పవడం పై తనను ప్రశ్నించారు అనీ చెప్పారు.
అందువలన నేను కోట పై దృష్టి పెట్టి 74 ఏళ్ల చరిత్రను కాపాడుకొనే దిశలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం అని ఆయన చెప్పారు, అందులో భాగంగానే కోటలో సర్పంచ్,8 మంది వార్డు సభ్యులతో పాటు కోటలో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశాము అని అందులో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి,నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, గాది భాస్కర్, షేక్ మొబిన్ బాషా లను నియమించి కోటలో ఏ పని చేయాలన్న కమిటీలోని 5 మంది సంతకాలు ఉంటేనే అధికారులు పనూలు చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఇకనుండి కోటలో అవినీతి అక్రమాలకు చోటు ఉండదు అని,కోటలో బిల్డింగ్ అప్రూవల్, లే ఔట్ అప్రూవల్, ఇటువంటి ఇళ్ల నిర్మాణాలు, దుకాణాల నిర్మాణానికి అనుమతులకు ఎటువంటి రుసుం లేకుండా రెండు రోజుల్లో పని పూర్తి చేసిపంపాలిఅనీ పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి కి ఆదేశాలు జారీచేశారు,అధికారులు ,రాజకీయ నాయకులు ఎక్కడైనా పైసలు అడిగినా,పనులు ఆలస్యం చేసిన వెంటనే తన సెల్ నెంబర్9989649999 కు కాల్ చేయాలి అని ఆయన సూచించారు, కోటలో ఎవరైనా చిల్లర రాజకీయాలు, చిల్లర కోసం చిల్లర పనులు చేస్తే కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా పార్టీ నుండి దూరం పెడతాం అని హెచ్చరించారు.
కోటలో ఉన్న దాదా రాయి గుంట స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి అనీ, ఎన్ సి ఆర్ కళ్యాణ మండపం అభివృద్ధి కి 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి వృద్ధిలోకి తీసుకొని రావాలి ఇంచార్జ్ సెక్రటరీ స్వరూప రాణి కిఅదేశాలు ఇచ్చారు, కోటలో సచివాలయం బిల్డింగ్, రైతు భరోసా కేంద్ర భవనాలు నట్టనడకగా నడుస్తున్నాయి అని, వాటి నిర్మాణాలకు కాంట్రాక్ట్ రులు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వదు అనీ ఎవరైనా భవనాలు కట్టేందుకు ముందుకు వస్తే వారికి ఉచితంగా భవన నిర్మాణ పనులు అప్పగిస్తామని ఆయన వెల్లడించారు,కోట గ్రామ పంచాయితీ లో శానిటేషన్ పనులు కొరకు 30 లక్షల రూపాయాల నిధులు డ్రా చేశారు అనీ, ఆ నిధులను ఎలా ఖర్చు చేశారో లెక్కలు చూపాలి అని ఉన్నత అధికారులను విచారణకు ఆదేశించారు.
గతంలో నల్లపరెడ్డి కుటుంబానికి బలమైన అభిమానులు ఉండే వారు అనీ, వాళ్ళ అందరూ దూరం అయ్యి తెలుగుదేశం పార్టీలో, ఇతర పార్టీలో ఉన్నారు అనీ, వారందరినీ నెలాఖరులోగా ఇంటి ఇంటికి వెళ్లి వైసీపీలోకి ఆహ్వానిస్తాను అనీ, మరలా వారిని మా కుటుంబ సభ్యులు గా చేర్చుకొని పూర్వపు వైభవాన్ని తీసుకొని వస్తాను అని వెల్లడించారు, ఇంకా నుండి కోటలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కొడవలూరు ధనుంజయ్య రెడ్డి లను కూడా కలుపుకొని పోతాం అనీ, తనకు పార్టీ ,సియం జగన్ ముఖ్యం అన్నారు, తనకు వర్గాలు అవసరం లేదు అన్నారు, గతంగతహా నేటి నుండి కోటలో సరి కొత్త పాలన తీసుకొని వస్తాం, ఇంకా నుండి చిల్లర రాజకీయాలు చేస్తున్న వారికి చెక్ పెడుతున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, ఎర్రటపల్లి మధు సుధన్ రెడ్డి, గాది భాస్కర్, సర్పంచ్ వెంకట రమణమ్మ, షేక్ మొబిన్ బాషా, యజద్దాని,సుబ్రహ్మణ్యం, రాయపు పొలయ్య మరియు ఎస్సై పుల్లారావు, కోట ఇంచార్జ్ కార్యదర్శి స్వరూప్ రాణి, వైసీపీ నేతలు, కార్యకర్తలు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రవి కిరణాలు న్యూస్ తడ:
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నరు గౌ” శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారు దర్శించుకొన్నారు. వారిని ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మరియు కార్యనిర్వాహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి ఆలయ మర్యాదలతో పూర్ణకుంబ స్వాగతం పలుకుట జరిగినది. అనంతరం వేద పండితులచే శ్రీ అమ్మవారికి పూజలు నిర్వహించటమైనది, తదుపరి గవర్నరు గారికి శేష వస్త్రములు, ప్రసాదములు శ్రీ అమ్మవారి జ్ఞాపికను అందజేయుట జరిగినది. వేద పండితులచే వేదాఆశీర్వచనం జరిపించుట జరిగినది. ఈ కార్యక్రమములో శాసన మండలి సభ్యలు, వాకాటి నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్, MN హరేందిర ప్రసాద్, ASP, వెంకటరత్నం, RDO,పి. సరోజిని, DSP, రాజగోపాల్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు గోగుల తిరుపాలు, కర్లపూడి మదన్ మోహన్, ముంగర అమరావతి, మద్దూరు శారద, కామిరెడ్డి రేవతి, పొన్న నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
జగనన్న ఇళ్లు నిర్మాణంలో పేదలకు అండగా ఉంటాం
నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలోనే మోడల్ జగనన్న కాలనీ గా అధికారులు గుర్తించిన కావలి పట్టణంలోని ముసునూరు మెగా లేఅవుట్ లో పేదలైన 8,000 మందికి ఇంటి స్థలాల పట్టాలు చేయడం జరిగింది - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తొలి విడత లో 3,000 ఇళ్లు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. ఒక లక్ష 80 వేలు ప్రభుత్వం ఇస్తుందని, అలాగే లబ్ధిదారులు ఆమోదిస్తే బ్యాంకులు ద్వారా రూ. 30 వేలు పావలా వడ్డీ కి మంజూరు చేస్తారు - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం కూడా చేస్తున్నప్పటికీ, పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవేదన ఇళ్లు లేని పేదలకు జగనన్న ప్రభుత్వం చేస్తున్న సహాయం వృథా కాకూడదనే తాపత్రయం తో పలు రకాల ఆలోచనలు చేస్తున్నాను - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాపారులు పెద్ద మనసు తో పేదలు ఇళ్లు నిర్మాణాలకు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జగనన్న ముసునూరు మెగా లేఅవుట్ లో తొలి విడత లో నిర్మాణానికి మంజూరైన 3 వేలు ఇళ్లు పూర్తి గా నిర్మించేందుకు ఈ నెల 7 వ తేది నుండి ఏర్పాట్లు చేస్తున్నాం - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జగనన్న మెగా లేఅవుట్ లో పేదలందరికీ ఇళ్లు నిర్మించడంతో పాటు మౌళిక సదుపాయాలు పనులు పూర్తి చేసేలా అక్కడే ఉండి పనులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాం - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జగనన్న కాలనీ ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కావలి ఆహ్వానించి ఆయన చేతులు మీదుగా లబ్ధిదారులు తో గృహ ప్రవేశాలు చేయిస్తాం - ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
కావలి ఆర్డీవో కార్యాలయం లో జరిగిన జగనన్న కాలనీ లో ఇళ్లు నిర్మాణాలపై అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. శివారెడ్డి, పొదుపు సంఘాల అధికారులు, హౌసింగ్ శాఖ ఇంజనీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
పినాకిని సత్యాగ్రహ ( గాంధీ ) అశ్రమం... గాంధీ గారి స్వహస్తములతో ప్రారంబింపబడి... 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మానవహారం
01.10.2021 వ తేదీన సాయంత్రం 05.00 గంటలకు జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమం, పల్లెపాడు నందు గాంధీ గారి స్వహస్తములతో ప్రారంబింపబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2000 అడుగుల త్రివర్ణ పతాకం తో మానవహారం కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ స్వయంగా మహాత్ముని స్వహస్తాలతో 1921 వ సంవత్సరములో ప్రాంభించబడిన దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పిలవబడే విశిష్టమైన మన పినాకిని సత్యాగ్రహ ( గాంధీ ) అశ్రమం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గాంధీ జయంతికి ముందు రోజు అయిన నేడు నెల్లూరు అంబేద్కర్ బొమ్మ (VRC Center) నుండి గాంధీ బొమ్మ వరకు విద్యార్ధిని విద్యార్ధులతో 2000 అడుగుల మూడు రంగుల జండాతో మానవహారం ఏర్పాటు చేశామని తెలియచేసారు.
జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు మరియు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ దక్షిణ సబర్మతి ఆశ్రమంగా పిలవబడే విశిష్టమైన మన పినాకిని సత్యాగ్రహ (గాంధీ) ఆశ్రమానికి జాతీయ స్థాయి గుర్తింపునకు అందరం కలిసి ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు.
మొదటగా VRC కూడలి నందు గల డా.బి.ఆర్.అంబేడ్కర్ గారి విగ్రహమునకు జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తదుపరి VRC కూడలి నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ K.V.N. చక్రధర్ బాబు IAS, గారు, నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు, రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు గాంధేయ వాధులు, రెడ్ క్రాస్ జీవితకాల సభ్యులు పాదయాత్రగా గాంధీ బొమ్మ వరకు చేరుకొని గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..
ఈ కార్యక్రమ్మమునకు వివిధ కళాశాలకు, పాఠశాలలకు చెందిన విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు. పాల్గొన్న విద్యార్ధిని విద్యార్ధులు గాంధీ గారి వేషధారణ తో మరియు కోలాటం తో అందరినీ ఆకట్టుకొన్నారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ శ్రీ డి. సుధీర్ నాయుడు, రాష్ట్ర శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ డి. రవి ప్రకాష్, జిల్లా శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు శ్రీ గునపాటి ప్రసాద్ రెడ్డి, శ్రీ యాలమూరి రంగయ్య నాయుడు, శ్రీ యడవలి సురేష్, శ్రీ బయ్యా ప్రసాద్, శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్, శ్రీ గంధం ప్రసాన్నాంజనేయులు నెల్లూరు జిల్లా శాఖ కింద వున్న వివిధ ప్రాజెక్టుల కన్వీనర్లు, కొ- కన్వీనర్లు, గాంధేయ వాధులు, రెడ్ క్రాస్ జీవిత కాల సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ పి. చంద్ర శేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమునకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతము చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.
పదవీ విరమణ చేస్తున్న పోలీసు జాగిలాలను ఘనంగా సన్మానించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు
ఆప్యాయంగా జాగిలాలను చేతితో నుమురుతూ జాగిలాల సేవలు కొనియాడిన జిల్లా యస్.పి. గారు.. పదవీ విరమణ పొందుతున్న అధికారులతో సమానంగా పూలమాలలు, శాలువ, పూలతో ముంచెత్తుతూ ఘనంగా సన్మానం.... జిల్లా పోలీసు శాఖలో జాగిలముల సేవలు చిరస్మరణీయం... జంతువులలో విశ్వాసంగా, భాద్యతగా, చురుకుగా ఉండే వాటిలో జాగిలము ఒకటి.. సింధు జాగిలము 27.07.2011 న జననం,2012 లో IITA మైనాబాద్, హైదరాబాదు నందు ట్రైనింగ్.... DPO నందు నవంబర్ 2012 నుండి విధులు నిర్వహణ.. సింధు అనే జాగిలం లెబ్రాడర్ రిట్రీవర్(ఆడ) అనే జాతికి చెంది, ఎక్స్ ప్లోజివ్ ను కనుగొనుటలో ప్రత్యేక నైపుణ్యం కలదు.. పోలీసు శాఖకు 10 సంవత్సరాల 5 నెలలు సేవలు అందించింది.. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో రాష్టంలో ద్వితీయ స్థానం పొందింది.. గత 3 నెలల క్రితం IED లను తడ వద్ద కనుకోనబడినది.. అంతేకాకుండా VVIP, అసెంబ్లీ, TTD బ్రహ్మోత్సవాలు, కృష్ణ, గోదావరి పుష్కరాలలో ఎనలేని సేవలను అందించింది.. లక్కీ అనే జాగిలము 10.03.2011 న జననం, 2012 లో IITA మైనాబాద్, హైదరాబాదు నందు ట్రైనింగ్.... DPO నందు నవంబర్ 2012 నుండి విధులు నిర్వహణ.. లక్కీ అనే జాగిలం జర్మన్ షెఫర్డ్(ఆడ) అనే జాతికి చెంది, ట్రాకింగ్ లో ప్రత్యేక నైపుణ్యం కలదు.. పోలీసు శాఖకు 10 సంవత్సరాల 8 నెలలు సేవలు అందించింది.. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో ట్రాకింగ్ లో రాష్టంలో మొదటి స్థానం పొందింది.. హత్యలు, దొంగతనాలు, డెకాయిట్, కిడ్నాప్ వంటి కేసులను చేదన.. సుమారు 18 హత్యలు, దొంగతనం కేసులను చేధించిన లక్కీ... వయసు రీత్యా నిపుణుల సూచనల మేరకు పదవీ విరమణ చేసిన సింధు, లక్కీ అనే రెండు జాగిలాలు... నేడు పదవీ విరమణ సన్మాన సభ ఏర్పాటు చేసి, ఘనంగా సత్కరించిన యస్.పి. గారు.. పోలీసు శాఖకు మరువలేని సేవలందించిన జాగిలాలు పలువురిని ఆకర్షిస్తూ, నిబద్ధతతో విధులు నిర్వహణ ఈ జాగిలముల రక్షణ, ఆహార పోషణ, నియమాలు బాగుగా చూసుకున్న సిబ్బందిని అభినందించిన జిల్లా యస్.పి. గారు..
SPS నెల్లూరు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నందు సింధు మరియు లక్కీ అనే జాగిలములు 10 సంవత్సరాలు సేవలు చేసి, నిపుణుల సూచనల మేరకు, ఈ రోజు అనగా తేది.01.10.2021 న ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా యస్.పి శ్రీ విజయ రావు,IPS., గారు ఘనంగా సన్మానించారు..
ఈ సందర్భంగా జిల్లా యస్.పి. గారు మాట్లాడుతూ ఎంతో విశ్వాసంగా, భాద్యతాయుతంగా వ్యవహరిస్తూ, చురుకుగా ఉండే జంతువులలో జాగిలము ఒకటి... జాగిలముల పదవీ విరమణ పోలీసు అధికారులతో సమానంగా సన్మానించి, వాటి సేవలను కొనియాడడం జరిగింది.
సింధు అనే జాగిలము లాబ్రాడర్ రీట్రైవర్ జాతికి చెందినది. 27.07.2011 న జన్మించింది. సింధు ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ’, ఎ.పి. హైదరాబాద్ నందు పేలుడు పదార్ధాలు కనిపెట్టుటలో శిక్షణ పొందింది. శిక్షణ సమయంలో అసాధారణమైన ప్రతిభను కనపరిచి అద్భుతమైన గ్రేడ్ తో విజయవంతంగా శిక్షణను పూర్తిచేసింది. శిక్షణ పూర్తయిన తరువాత 2012 లో నెల్లూరు జిల్లాలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నందు నియమించబడిన విధి నిర్వహణలో సింధు ఎన్నో విధులు నిర్వహించినదని తెలిపారు. సింధు 10 సంవత్సరాల 5 నెలలు జిల్లాకు సేవలు అందించింది. సింధు హ్యండ్లర్ ARPC-2414 శ్రీ SK మస్తాన్ వలి. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో రాష్టంలో ద్వితీయ స్థానం పొందింది. 3 నెలల క్రితం IED లను తడ వద్ద కనుకోనబడినది.. అంతేకాకుండా VVIP, అసెంబ్లీ, TTD బ్రహ్మోత్సవాలు, జనరల్ ఎలక్షన్ లో కూడా విధులు మరియు ఇతర ముఖ్యమైన బందోబస్తు విధులను విజయవంతంగా నిర్వహించి, కృష్ణ, గోదావరి పుష్కరాలలో ఎనలేని సేవలను అందించింది.
లక్కీ అనే జాగిలము జర్మన్ షెఫర్డ్(ఆడ) అనే జాతికి చెందినది. 10.03.2011 న జన్మించింది. లక్కీ ‘ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ’, ఎ.పి. హైదరాబాద్ నందు ట్రాకింగ్ లో శిక్షణ పొందింది. శిక్షణ పూర్తయిన తరువాత 2012 లో నెల్లూరు జిల్లాలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నందు నియమించబడిన విధి నిర్వహణలో లక్కీ ఎన్నో విధులు నిర్వహించినదని తెలిపారు. లక్కీ 10 సంవత్సరాల 8 నెలలు జిల్లాకు సేవలు అందించింది. లక్కీ హ్యండ్లర్ ARPC-2413 శ్రీ PV సుకుమార్. 2013 లో రీఫ్రెష్మెంట్ కోర్సులో రాష్టంలో మొదటి స్థానం పొందింది. లక్కీ హత్యలు, దొంగతనాలు, డెకాయిట్, కిడ్నాప్ వంటి కేసులను చేదిస్తుంది. ఇప్పటి వరకు 18 హత్యలు, దొంగతనం కేసులను చేధించింది.
ఈ కార్యక్రమంలో యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం, డి.యస్.పి.(DTC) శ్రీ గోపాలకృష్ణ, యస్.పి.(ఎ.ఆర్.) శ్రీ యం.గాంధీ, SB CI-1 శ్రీ అక్కేశ్వరరావు, CI-2 శ్రీ రామకృష్ణ, RI అడ్మిన్ శ్రీ రమణారెడ్డి గార్లు, డాగ్ స్క్వాడ్ ఇంచార్జ్ ARSI నాగూర్ బాషా, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, BD టీం సిబ్బంది, ఇతర అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.