సారా ఊట ధ్వంసం
నాగలాపురం నాగలాపురం మేజర్ పంచాయతీలో రాజీవినగర్అక్రమంగా సార నిల్వలపై ఎస్ఐ హనుమంతప్ప దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు రెండు వేల లీటర్లు అక్రమంగా నిల్వ ఉంచిన సారా బట్టీలను దాడులు నిర్వహించారు ఎస్సై హనుమంతప్ప మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచిన సారాబట్టీలపై సమాచారమిస్తే గోప్యంగా ఉంచి దాడులు నిర్వహిస్తామనితెలిపారు ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు జాడ కనిపించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో కిశోర్స్పెషల్ బ్రాంచ్ అధికారులు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు
మరోసారి 20వేల పైన కొత్త కేసులు.. మరణాల్లో సగం కేరళలోనే..
దిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 23,529 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల (18,870)తో పోలిస్తే 24శాతం అధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇదే సమయంలో మరణాలు కాస్త తగ్గడం ఊరటనిస్తోంది. అంతక్రితం రోజు 378 మంది కరోనాతో మరణించగా.. నిన్న ఆ సంఖ్య 311గా ఉంది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటగా.. ఇప్పటి వరకు 4,48,062 మందిని వైరస్ పొట్టనబెట్టుకుంది. కొత్తగా నమోదైన మరణాల్లో సగం ఒక్క కేరళలోనే వెలుగుచూడటం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో 12,161 కొత్త కేసులు నమోదవ్వగా.. 155 మంది కరోనాతో మరణించారు.
ఇదిలా ఉండగా.. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉంటుండటం సానుకూలాంశం. నిన్న మరో 28,718 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.85శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.82శాతంగా ఉంది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం మరో 65,34,306 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 88.34కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది....
రాష్ట్రంలో బీసీ జనగణన జరగాలి బీసీ జనగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి అడవిలోని జంతువులకి కూడా జంతుగణన ఉంది, బీసీ జనానికి మాత్రం జనగణన లేదు ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం కరువు ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో రూపాయి లేకుండా చేసి కులాలమధ్య చిచ్చు పెడుతున్న సీఎం వైసీపీలో రాజకీయ నిరుద్యోగం లేకుండా చేయడానికే కులానికో కార్పొరేషన్ ఈ రెండేళ్లలో ఏ ఏ కార్పొరేషన్ కి ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒట్టూరు సంపత్ యాదవ్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి
SPS నెల్లూరు జిల్లా,
జాతర బందోబస్తును పరిశీలించిన జిల్లా యస్.పి. గారు.. వెంకటగిరి పోలేరమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తును స్వయంగా, క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు... చరిత్రలో మొదటి సారిగా పోలేరమ్మ తల్లి ఊరేగింపు, నిమజ్జనం చేయు ప్రాంతాన్ని సందర్శించి, అధికారులకు తగు సూచనలు చేసిన యస్.పి. గారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ, సాంప్రదాయ బద్దంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన ఆదేశాలు.. వారం రోజుల నుండి పోలీసు అధికారులు ముమ్మరంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు..ఇతర శాఖల సమన్వయంతో.... ప్రజలు గుమికూడకుండా, తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచన జాతర సాంప్రదాయ బద్దంగా, కమిటీ పెద్దల నిర్ణయాలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించబడును... ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి... అనంతరం వెంకటగిరి MLA గారితో పరిస్థితులపై కొద్దిసేపు చర్చించిన యస్.పి. గారు...అడిషనల్ యస్.పి. గారి ఆధ్వర్యంలో బందోబస్తును చక్కగా వేసి పక్కాగా అమలు చేస్తున్న యస్.బి., గూడూరు డి.యస్.పి. లు, వెంకటగిరి CI గార్లను అభినందించిన యస్.పి. గారు... నిమజ్జనం సమయంలో అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన యస్.పి. గారు..
30.09.2021 న వెంకటగిరి టౌన్ లో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు స్వయంగా సందర్శించి, బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించారు.. జిల్లా యస్.పి. గారు మొదట పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్దకు వెళ్ళి దర్శనం చేసుకొని, చుట్టుపక్కల ప్రాంతం, ఆర్చి, కూడళ్ళ వద్ద, రాజావీధి, కాశీపేట, పెద్దదేవాలయం, మల్లమ్మ గుడి ప్రాంతం దగ్గర నిమజ్జనం ప్రాంతం వరకు వెళ్ళి, స్వయంగా అణువణువును, క్షుణ్ణంగా పోలీసు బందోబస్తును పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.. కమిటీ పెద్దల నిర్ణయం ప్రకారం, సంప్రదాయబద్దంగా జాతర నిర్వహించాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించేలా చూడాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బందోబస్తు చాలా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొద్ది సేపు వెంకటగిరి MLA శ్రీ రామనారాయణరెడ్డి గారితో జాతర విషయాలను చర్చించారు. నిమజ్జనం సమయంలో అధికారులకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తగిన సూచనలతో ఆదేశాలు జారీ చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం, గూడూరు డి.యస్.పి. శ్రీ రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి CI శ్రీ నాగమల్లేశ్వరరావు, SB CI-1 శ్రీ అక్కేశ్వర రావు, CI-2 శ్రీ రామకృష్ణ, ఇతర బందోబస్తు అధికారులు, సిబ్బంది ఉన్నారు