రాష్ట్రంలో బీసీ జనగణన జరగాలి బీసీ జనగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి అడవిలోని జంతువులకి కూడా జంతుగణన ఉంది, బీసీ జనానికి మాత్రం జనగణన లేదు ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ బీసీలకు న్యాయం కరువు ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో రూపాయి లేకుండా చేసి కులాలమధ్య చిచ్చు పెడుతున్న సీఎం వైసీపీలో రాజకీయ నిరుద్యోగం లేకుండా చేయడానికే కులానికో కార్పొరేషన్ ఈ రెండేళ్లలో ఏ ఏ కార్పొరేషన్ కి ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒట్టూరు సంపత్ యాదవ్ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి
SPS నెల్లూరు జిల్లా,
జాతర బందోబస్తును పరిశీలించిన జిల్లా యస్.పి. గారు.. వెంకటగిరి పోలేరమ్మ జాతర వద్ద ఏర్పాటు చేసిన పటిష్ట బందోబస్తును స్వయంగా, క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు... చరిత్రలో మొదటి సారిగా పోలేరమ్మ తల్లి ఊరేగింపు, నిమజ్జనం చేయు ప్రాంతాన్ని సందర్శించి, అధికారులకు తగు సూచనలు చేసిన యస్.పి. గారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ, సాంప్రదాయ బద్దంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగిన ఆదేశాలు.. వారం రోజుల నుండి పోలీసు అధికారులు ముమ్మరంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు..ఇతర శాఖల సమన్వయంతో.... ప్రజలు గుమికూడకుండా, తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచన జాతర సాంప్రదాయ బద్దంగా, కమిటీ పెద్దల నిర్ణయాలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్వహించబడును... ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి... అనంతరం వెంకటగిరి MLA గారితో పరిస్థితులపై కొద్దిసేపు చర్చించిన యస్.పి. గారు...అడిషనల్ యస్.పి. గారి ఆధ్వర్యంలో బందోబస్తును చక్కగా వేసి పక్కాగా అమలు చేస్తున్న యస్.బి., గూడూరు డి.యస్.పి. లు, వెంకటగిరి CI గార్లను అభినందించిన యస్.పి. గారు... నిమజ్జనం సమయంలో అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన యస్.పి. గారు..
30.09.2021 న వెంకటగిరి టౌన్ లో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు స్వయంగా సందర్శించి, బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించారు.. జిల్లా యస్.పి. గారు మొదట పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్దకు వెళ్ళి దర్శనం చేసుకొని, చుట్టుపక్కల ప్రాంతం, ఆర్చి, కూడళ్ళ వద్ద, రాజావీధి, కాశీపేట, పెద్దదేవాలయం, మల్లమ్మ గుడి ప్రాంతం దగ్గర నిమజ్జనం ప్రాంతం వరకు వెళ్ళి, స్వయంగా అణువణువును, క్షుణ్ణంగా పోలీసు బందోబస్తును పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు.. కమిటీ పెద్దల నిర్ణయం ప్రకారం, సంప్రదాయబద్దంగా జాతర నిర్వహించాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించేలా చూడాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బందోబస్తు చాలా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొద్ది సేపు వెంకటగిరి MLA శ్రీ రామనారాయణరెడ్డి గారితో జాతర విషయాలను చర్చించారు. నిమజ్జనం సమయంలో అధికారులకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తగిన సూచనలతో ఆదేశాలు జారీ చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యస్.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం, గూడూరు డి.యస్.పి. శ్రీ రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి CI శ్రీ నాగమల్లేశ్వరరావు, SB CI-1 శ్రీ అక్కేశ్వర రావు, CI-2 శ్రీ రామకృష్ణ, ఇతర బందోబస్తు అధికారులు, సిబ్బంది ఉన్నారు
నెల్లూరులో రెండు రైల్వే బ్రిడ్జిలు కట్టండి
రైల్వే జీఎంకు ఎంపీ ఆదాల వినతి
నెల్లూరు నగరంలో రెండు రైల్వే బ్రిడ్జిలను నిర్మించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి రైల్వే జీఎం గజానన్ మాల్యాను కోరారు. విజయవాడలో గురు వారం సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉన్న ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ మేరకు కోరారు. నెల్లూరు నగర పరిధిలోని రంగనాయకులపేట లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. కొండాయపాలెం లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని అడిగారు. ఈ ప్రాంతాల్లో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల సత్వరం వీటిని ఏర్పాటు చేయాలని కోరారు.
బిట్రగుంటలో రైల్వే పరిశ్రమ పెట్టండి
బిట్రగుంట రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న 1600 ఎకరాల ఖాళీ స్థలంలో ఒక పరిశ్రమ ఏర్పాటుకు సిఫార్సు చేయాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అడిగారు. మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మిగతా వ్యవహారాలు నడిపిస్తామని చెప్పారు. సింగరాయకొండ రైల్వే స్టేషన్ తో సహా ముఖ్యమైన స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఉండేచోట లిఫ్ట్ లు ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా సీనియర్ సిటీజన్లకు మహిళలకు సౌకర్యం కలుగుతుందని చెప్పారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే మార్గం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు ఇచ్చేందుకు సరైన పరిస్థితులు లేవు. అందువల్ల రైల్వే నిధులతోనే ఈ మార్గాన్ని పూర్తి చేసేందుకు సిఫార్సు చేయాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేము మాట్లాడుతామని పేర్కొన్నారు. కొడవలూరు మండలం లోని రాజుపాలెం లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్.వి.ఎన్.ఎల్ సంస్థ మూడో రైల్వే లైన్ పనులు చేస్తోందని, ఆ సంస్థకు సామాజిక బాధ్యత కింద నెల్లూరు నగరంలో మూడో రైల్వే లైన్ కు సమాంతరంగా ఉన్న ఖాళీ ఉన్న స్థలాల్లో పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని కూడా జీఎం కు అందజేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని క్రొత్త 24వ డివిజన్, కల్లూరు పల్లి, ఇందిరమ్మ కాలనీ, హౌసింగ్ బోర్డ్, ప్రాంతాలలో 14వ రోజు నేను - నా కార్యకర్త కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
24వ డివిజన్, కల్లూరు పల్లి లోని ఎస్.కె సత్తార్ అనే కార్యకర్త ఇంటి నుంచి నేను - నా కార్యకర్త కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ & ఇంధన శాఖామంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి గౌరవ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరుకు విచ్చేసిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసిన SPS నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు....... అనంతరం కొద్ది సేపు జిల్లాలోని పలు విషయాలపై ఇరువురు చర్చించారు..
DG గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు..
వెల్ఫేర్ డే సందర్భంగా భద్రత లోనుల పరిమితిని పెంచిన గౌరవ DG గారు.. పోలీసుల సంక్షేమమే నా ప్రధమ కర్తవ్యం... మనమంతా ఒకే కుటుంబం.. ప్రతి జిల్లాలో సిబ్బంది సంక్షేమం కొరకు వారానికి ఒక రోజును కేటాయించాలని ఆదేశం.. కోవిడ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియని సమయంలో కింది స్థాయి నుండి ఉన్నతాధికారి వరకు రోడ్లపై నిలబడి సమాజ సేవ చేసారు.. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.. కోవిడ్ కారణంగా మరణించిన పోలీసుల సేవలు చిరస్మరణీయం.. కమిటీ నిర్ణయం మేరకు లోనులు పరిమితి పెంచి, వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది.. DG గారు.. భద్రతలో పర్సనల్, మ్యారేజ్, ఎడుకేషనల్ తదితర అన్ని లోనులు పరిమితి పెంచాం.. వినియోగించుకోండి..
తేది.29.09.2021 న రాష్ట్ర డిజిపి గౌరవ శ్రీ గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గారు భద్రత లోనుల పరిమితిని పెంచడం, వడ్డీ రేట్లను తగ్గింపుపై రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల యొక్క యస్.పి.లతో, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ DG గారు మాట్లాడతూ రాష్ట్ర పోలీసుల సంక్షేమంలో భాగంగా భద్రత స్కీం ద్వారా పోలీసులకు ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచడం... ఆ రుణాలకు వడ్డీ ధరలు తగ్గించడంపై చర్చ సాగింది. త్వరలో దీన్ని అమలు పరచనున్నట్లు డిజిపి గారు వెల్లడించారు. భద్రత మరియు ఆరోగ్య భద్రత క్రింద తీసుకొనివచ్చిన నూతన పాలసీలు, ప్రస్తుతం అమలులో ఉన్న గృహ, విద్య, వ్యక్తిగత రుణాల పరిమితి పెంచడం తదితర అంశాలపై యూనిట్ అధికారులతో చర్చించారు. అదేవిధంగా వారంలో ఒక రోజు “వెల్ఫేర్ డే” గా పాటించాలని, తద్వారా పోలీసు సిబ్బంది యొక్క సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, కోవిడ్ సంబంధిత సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాలని జిల్లా యూనిట్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యస.పి. గారితో పాటు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) శ్రీమతి వెంకటరత్నం, యస్.బి. డి.యస్.పి. శ్రీ కోటా రెడ్డి, SB CI-1 శ్రీ అక్కేశ్వరరావు, CI-2 శ్రీ రామకృష్ణ, DPO AO, పి.సూపరింటెండెంట్, DPO సిబ్బంది, పోలీసు అసోసియేషన్ సభ్యులు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.