వెంకటగిరి నియోజకవరం డక్కిలి మండల YSRCP జడ్పీటీసీ శ్రీమతి శ్రీ కలిమిలి రాజేశ్వరి గారిని వెంకటగిరి లోని వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా సన్మానించిన వెంకటగిరి మండల అధ్యక్షురాలు MPP శ్రీ తంబిరెడ్డి తనుజ శివారెడ్డి గారు.మరియు వైస్ MPP భూపతి సుధాకర్ గారు. మరియు.వైస్సార్సీపీ నాయకులు శివారెడ్డి గారు సిద్దవరం కుమార్.మొదలియార్.మస్తాన్ రెడ్డి (సర్పంచ్)ఆమ్మపాలెం విజయ .వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
భారత్ బంద్..
తెలుగు రాష్ట్రాలలో పలు పరీక్షలు వాయిదా!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొంత కాలంగా జాతీయ రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 27న భారత్ బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. భారత్ బంద్‌కు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 వరకు భారత్ బంద్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు (సెప్టెంబర్ 27) నిర్వహించాల్సిన పలు ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.
రేపు భారత్ బంద్ కు రైతు సంఘాల పిలుపు... మద్దతిస్తున్న పార్టీలివే... వైసీపీ మద్దతుపై సోము వీర్రాజు ఆగ్రహం
ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా..
రేపు నిర్వహించాల్సిన ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వెల్లడించారు. భారత్ బంద్ వల్ల స్టడీ సర్కిల్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలు సైతం..:
భారత్ బంద్ నేపథ్యంలో రేపు మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంసీఏ, ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిరియాల రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనే తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం..!
రేపు భారత్ బంద్‌కు మద్దతిస్తున్న పార్టీలివే..రాష్ట్రపతి ఆమోదం పొందిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ బిల్లులను ఆమోదించి ఏడాది అవ్వడంతో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఈ నెల 27న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు రైతులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బంద్‌కు మద్దతు ఇవ్వగా, బిహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటానని ప్రకటించారు. కాంగ్రెస్ కూడా నిరసనల్లో పాల్గొంటామని తెలిపింది. తాజాగా బ్యాంకర్స్ ఆఫీసర్స్ యూనియన్ కూడా భారత్ బంద్‌కు మద్దతిస్తున్నట్లు పేర్కొంది.
కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లాలోని కదిరి సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అక్రమాలపై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రే రూ.21.50 లక్షల చలానా డబ్బును ముగ్గురు ఉద్యోగులు జమ చేశారు. దీంతో ఉన్నతాధికారులు నకిలీ చలానాలపై విచారణ చేపట్టారు. రూ.5 వేల చలానాకు రూ.50 వేలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు మార్చారు.
దిల్లీ: దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఇవాళ దిల్లీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ‘‘ ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. న్యాయవాదులకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లా కళాశాలల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలి. మహిళలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు నా మద్దతు ఉంటుంది. మహిళలంతా ఐక్యంగా ఉండాలి. కోర్టుల్లో మహిళా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి. వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి’’ అని జస్టిస్ ఎన్వీరమణ అన్నారు.
రవికిరణాలు :
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, సభ్యులు, ఆప్షన్ సభ్యులు, మరియు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులను రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో అభినందించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ మండలం ఒక రాజకీయ చైతన్య మండలం ఈ మండలంలో ఏకపక్షంగా
వై. ఎస్.ఆర్ సి. పి గెలిచింది అంటే ఈ గొప్పతనం నాది కాదు రూరల్ కార్యకర్తలు మరియు ప్రజలు చేసిన కష్టం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిరంతర కష్టం, అంకిత భావం, వారి చెమట చుక్కల త్యాగం తో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు విజయం సాధించాను.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి . కార్యకర్తలు లేకుంటే నేను లేను నిరంతరం వారు చేస్తున్న శ్రమ కారణంగానే నెల్లూరు రూరల్ లో అద్భుత విజయాలు సాధించాము. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి . నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ కార్యకర్తలకు భరోసా కల్పించే గొప్ప నాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల విశ్వాసంతో ఇంతటి ఘనవిజయాన్ని అందించిన నెల్లూరు రూరల్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత్ బంద్‌కు టీడీపీ పిలుపు..
రవికిరణాలు :
గళమెత్తుదాం.. కదం తొక్కుదాం.. కదలిరండి.. కలిసి రండి..!!
దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి చేసేలా, అప్రజాస్వామిక విధానంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. సోమవారం (27 సెప్టెంబర్ 2021) నిర్వహిస్తోన్న భారత్ బంద్‌కు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కావలి నియోజకవర్గంలో ప్రజా సంఘాలు, అఖిలపక్షంతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 27వ తేదీన భారత్ బంద్‌లో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు సానుభూతిపరులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం..
జై చంద్రబాబు.. జై తెలుగుదేశం..!!
కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయం