రవికిరణాలు నెల్లూరు :
కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం, పార్లపల్లి గ్రామంలో క్యాన్సర్ వ్యాధి బాధపడుతున్న పి.భాగ్యమ్మ కు రూ.25,000 పెరాలసిస్ తో బాధపడుతున్న ఎల్లు శ్రీనివాసులు రూ. 20,000 మొత్తం 45,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల్లూరు లోని తన నివాసంలో అందజేసిన కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
నెల్లూరు జిల్లాలోని జడ్పిటిసి స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలోని 46 జడ్పిటిసి స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసామని గర్వ పడకుండా అన్ని సామాజిక వర్గాలకు సమతూకం పాటించి పదవులు అప్పగించామని కాకాని పేర్కొన్నారు.... రాజకీయ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరూ పదవి ఆశించడం జన్మ హక్కు అన్నారు...
నెల్లూరు జిల్లాలో మొత్తం 46 మండలాలకు సంబంధించి 44 మండలాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ఎంపీపీగా పదవులు చేపట్టారన్నారు. మిగిలిన రెండు మండలాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే పదవి కోసం ఎక్కువ మంది ఆశించడం వల్ల ఇరువురు నేతలను సమన్వయం చేసి ఆ రెండు ఎంపీ స్థానాల్లో ఏర్పడిన సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారు పదవిని ఆశించడంలో తప్పు ఏమీ లేదన్నారు
10 లక్షలతో ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అనిల్
రవికిరణాలు నెల్లూరు :
నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రూ. 10 లక్షలతో ఆధునీకరించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ ఆదాలను కలిసిన ఇద్దరు ఎంపీటీసీలు
రవికిరణాలు నెల్లూరు :
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇద్దరు ఎంపిటిసిలు ఆదివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకూరుపేట మండలం లోని రావూరు ఎంపీటీసీ బి. కరుణాకర్, నరసాపురం ఎంపిటిసి వెంకటేశ్వర్లు రెడ్డి , ఇందుకూరుపేట కోఆప్షన్ సభ్యురాలు దిల్షాద్,. డిఎల్డిఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్, మైపాడు అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు.
రవికిరణాలు సంగం (26-10-2021) : సంగం మర్రిపాడు మండలాల వైసిపి అధ్యక్షులుగా పులగం, బొర్రా
సంగం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా అన్నారెడ్డి పాలెం గ్రామానికి చెందిన పులగం శంకర్ రెడ్డి మరియు మర్రిపాడు మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా చిలకపాడు గ్రామానికి చెందిన బొర్రా సుబ్బిరెడ్డి గార్లను నియమించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో సంగం మర్రిపాడు మండల కన్వీనర్లు మండల పరిషత్ అధ్యక్షులు గా నియమితులైన నందున వారి స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం నిరంతరం శ్రమించిన పులగం శంకర్ రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి గార్లను నూతన మండల కన్వీనర్లగా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన మండల కన్వీనర్లు అన్ని గ్రామాల నాయకులను సమన్వయం చేసుకొని పార్టీ అభివృద్ధికి దోహద పడ వలసిందిగా కోరారు.
పులగం శంకర్ రెడ్డి, బొర్రా సుబ్బిరెడ్డి గార్లు తమకు అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేస్తామని అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి గారి గెలుపుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.