శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనార్థం ఆలయం వద్దకు కుటుంబ సమేతంగా విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దంపతులు, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గారు, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్.రామారావు గారు, అర్చకస్వాములు, వేద పండితు
అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆశీర్వచన మండపంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దంపతులకు అర్చక స్వాములు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గారు, దేవస్థాన ఈవో కేఎస్.రామారావు స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను, స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించి కేంద్ర హోం శాఖ మంత్రి దంపతులకు అందజేశారు.
తరువాత శ్రీశైలంలోని పంచమఠాలలో ఒకటైన ఘంట మఠం జీర్ణోద్ధరణ సందర్భంగా లభించిన పురాతన తామ్ర శాసనాలను ఆలయ ప్రాంగణంలో నిశితంగా పరిశీలించారు. శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు శాసనలకు సంబంధించిన చారిత్రాత్మక విశేషాలను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణిమోహన్, దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి వివరించారు.
అనంతరం పశ్చిమ మాడ వీధిలో అర్జున మొక్కలును నాటి నీళ్ళు పోశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెంట ఇంటెలిజెన్స్ ఐజీ శశిధర్ రెడ్డి, డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గారు, దేవస్థాన ఈవో కేఎస్.రామారావు, కర్నూల్ ఆర్ డిఓ హరి ప్రసాద్, ఆత్మకూరు డిఎస్పీ శృతి తదితరులున్నారు.
నగరంలోని మినీబైపాస్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను, అలాగే సర్వేపల్లి కాలువ ఆధునీకరణ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పరిశీలించి, జరుగుతున్న పనుల తీరును అడిగి తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు వేనాటి శ్రీకాంత్ రెడ్డి, కర్తం ప్రతాప్ రెడ్డి, గణేశం వెంకటేశ్వర్లు రెడ్డి, వేలూరు మహేష్, దేవిశెట్టి రాజగోపాల్, కోట శ్రీనివాసులు, నూనె మల్లికార్జున యాదవ్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనీల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం నందు::కోవిడ్ నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ,పోలీసు శాఖ,రెవిన్యూ మరియు మునిసిపల్ శాఖా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు...జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ (రెవిన్యూ), జాయింట్ కలెక్టర్ విదేహ్ ఖరే (హౌసింగ్), నియోజకవర్గ డెవలప్మెంట్ ఆఫీసర్ డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ సాంబశివా రెడ్డి, వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ, రాష్ట్ర చేనేత విభాగ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరవు,మున్సిపల్ కమిషనర్ మధు కిరణ్ రెడ్డి,అడిషనల్ డి ఎం హెచ్ వో డాక్టర్ అచ్యుత కుమారి,గూడూరు డి ఎస్ పి రాజగోపాల్ రెడ్డి మరియు,మునిసిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు
కావలి పరిధిలోని ఆముదాల దిన్నే గ్రామ సచివాలయంని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించారు. సచివాలయం పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన సేవలు అందించాలని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన వేళల్లో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వివరాలు, ఈ సర్వీసెస్, స్పందన ఫిర్యాదు