వైసీపీ మైనింగ్ మాఫియా అక్రమాలను ఆధారాలతో బయటపెడితే ఎదురుదాడులు, బూతు పంచాంగం, అభూత కల్పనలతో ప్రజలను గందరగోళం చేసేలా ఆరోపణలు చేస్తారా..
మేం వ్యక్తిగతంగా ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు..మా పోరాటం వైసీపీ మైనింగ్ మాఫియాపైనే..
జిల్లాలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు రాజ్యమేలుతుంటే ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నారు..
ఎస్సైలు వాడుతున్న భాష చూస్తుంటే కడుపురగిలిపోతోంది..
అల్లూరు తహసీల్దార్ రామక్రిష్ణ కార్యాలయాన్ని ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు బాడుగకు ఇస్తున్నారు...
కావలి రూరల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి కూలిచేసుకుని బతికే దళిత కుటుంబాన్ని వారం పాటు స్టేషన్ లో పెట్టి వేధించారు..
అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే వైసీపీ కాదు మా శత్రువు...తహసీల్దార్లు, ఎస్సైలు, సీఐలు, ఆర్డీఓల కుటుంబాలను కూడా రోడ్డుకు ఈడుస్తాం..
జిల్లాలోని అరాచక పరిస్థితులపై నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర..
సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు, గ్రావెల్ మాఫియాపై సోమిరెడ్డి అనేక సార్లు ఆర్టీఐ ద్వారా, స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులకు తెలియజేసినా పట్టించుకున్న నాథులు లేరు.
మైనింగ్ మాఫియాకు సంబంధించిన టిప్పర్లు, ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే పట్టించుకోకుండా రైతుల ట్రాక్టర్లను మాత్రం సీజ్ చేసి కోర్టుకు సరెండర్ చేస్తున్నారు..
జంగాలపల్లికి చెందిన పేద మహిళ తన పొలం నుంచి తన ఇంటికే మట్టి తోలుకుంటుంటే వెంకటాచలం ఎస్సై ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు..
మాఫియాకు ఒక న్యాయం, రైతులకు ఒక న్యాయమా అని సామాన్యులే బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు..కలెక్టరే సమాధానం చెప్పాలి...
కంటేపల్లి ఎస్సీ కాలనీ రైతులు విద్యుత్ తీగల ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడి న్యాయం చేయమని నిలదీస్తే దానికి టీడీపీనే తిడతారా..
గ్రావెల్ అక్రమ మైనింగ్ గురించి మేం ఎవరిపైనా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయలేదు..మాఫియాపైనే చేశాం..
అధికారుల పరిశీలనలో పట్టుబడిన కాంట్రాక్టర్లే తమ తప్పును ఒప్పుకుని అధికారులకు స్మేట్మెంట్లు ఇచ్చారు..
మీరేమో టీడీపీ నాయకులు దోపిడీ చేశారని తప్పుదారి పట్టిస్తున్నారు..
ఏ రైతు మట్టి ఎత్తుకున్నా, పొలాలను చదును చేసుకున్నా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు..వైసీపీ గ్రావెల్ మాఫియాపైనే మా పోరాటం..
ఈ జిల్లాలో పరిస్థితులు ఘోరాతిఘోరంగా ఉన్నాయి..ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, అరాచకం..
బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పీకేందేందయ్యా అని ఎస్పీని ఒక ఎమ్మెల్యే అడిగితే ఇక ఈ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఏంటి..
ఎస్పీకి అర్జీ ఇస్తే అన్యాయంగా కేసులు పెడుతున్నారు..కలెక్టర్ ను కలిస్తే తహసీల్దారు కార్యాలయాల్లోకి రానీయడం లేదు..
మా నాయకులు, కార్యకర్తలను మీ ఎస్సైలు తిట్టేభాషతో తట్టుకోలేకున్నాం..కడుపు మండిపోతోంది..ఎస్పీ గారూ....
ఈ జిల్లా చరిత్రను ఒక్కసారి తెలుసుకోండి.. 1992,93లో కావలి, అల్లూరులో పోలీసు స్టేషన్లపై తిరగబడి ఎస్సైల గుడ్డలిప్పిన విషయం గుర్తుంచుకోండి..
అధికారుల గురించి మేమైనా మాట్లాడితే పోలీసు, రెవెన్యూ అసోసియేషన్లు స్పందిస్తారు....
ఒక పార్టీ నాయకుల కుటుంబసభ్యుల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు..
అల్లూరు తహసీల్దార్ రామక్రిష్ణ...తన కార్యాలయాన్ని ఏకంగా రాత్రుళ్లు బాడుగకు ఇస్తున్నాడు..
రూ.3 వేలు ఇస్తే తహసీల్దార్ కార్యాలయం, రూ.5 వేలు ఇస్తే తహసీల్దార్ గదే అప్పగించేస్తున్నాడు...
ఆ రాత్రి అక్కడ బార్ నడుపుకోవచ్చు...ఇంకేమైనా చేసుకోవచ్చు...అది తహసీల్దార్ కార్యాలయమా, బ్రోతల్ హౌస్, బార్ అండ్ రెస్టారెంటా అర్థం కావడం లేదు..
కావలి రూరల్ ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఒక దళితుడిని వారం రోజులుగా నిత్యం తీసుకెళ్లి స్టేషన్ లో నిర్బంధిస్తున్నాడు..మా నాయకులంతా ఫోన్ చేశాం...లాయర్ వెళ్లినా కేసు ఏందో చెప్పడు..ఏ కేసు లేకుండా కూలికి పోయే దళిత కుటుంబాన్ని వేధిస్తున్నాడు..
మీ ఎస్సైలు మా కుటుంబ సభ్యులను ఉద్దేశించి దూషిస్తున్నారు..మేం పొరబాటున నోరుజారి మీ కుటుంబసభ్యుల గురించి మాట్లాడితే పోలీసు అసోసియేషన్ నాయకులు ఊరుకుంటారా..
అధికారుల ప్రవర్తన మార్చుకోకపోతే వైసీపీ కాదు మా శత్రువు...తహసీల్దార్లు, ఎస్సైలు, సీఐలు, ఆర్డీఓల కుటుంబాలను కూడా రోడ్డుకు ఈడుస్తాం..