నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్ లేక్ వ్యూ కాలనీ13 వీధిలో పర్యటించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔹లేక్ వ్యూ కాలనీ 13 వీధిలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
🔹లేక్ వ్యూ కాలనీ13 వీధిలో వీలైనంత త్వరలో రోడ్డు పనులు పూర్తిచేయాలని అధికారులను కోరిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ
నెల్లూరు నగరంలోని స్థానిక 42 వ డివిజన్ జేమ్స్ స్కూల్ పక్కన దాదాపు 56 అంకణాలు స్థలం పార్కు కోసం కేటాయించడం జరిగింది ఈ
స్థలం కబ్జాకు గురవుతుంది ఏ ఐ వై ఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆ స్థలాన్ని కాపాడాలని అర్జీ ఇవ్వడం జరిగింది.....
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా కన్వీనర్ సయ్యద్ సిరాజ్ మాట్లాడుతూ స్థానిక 42 వ డివిజన్ లో ఎక్కువ శాతం మంది ముస్లింలు నివాసముంటున్న ప్రాంతంలో ఒక పార్కు కూడా లేనందువల్ల ఇక్కడ పార్కు నిర్మించాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ పార్కు స్థలాన్ని కేటాయించారు కానీ క్రమేణా ఈ స్థలం స్థానికంగా ఉండే వాళ్ళు ఇష్టానుసారంగా కబ్జా చేస్తూ పోయారు ఇప్పుడు అక్కడ దాదాపు 25 అంకణాలు మాత్రమే మిగిలి ఉంది ఈ స్థలాన్ని కూడా టీసీ కాలేషా అనే వ్యక్తి కబ్జా చేసి గోడను కూడా నిర్మించే ఈ స్థలం నాది అని అంటున్నాడు కనుక ఈ స్థలాన్ని కాపాడాలని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి అక్కడ గోడ ని తొలగించి పార్కు స్థలంగా కేటాయిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి నూర్ ఖాన్. మున్నా. పటాన్ భాష. గౌస్ బాష. దస్తగిరి. తదితరులు పాల్గొన్నారు
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పై టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు పంచ్ లు.... ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న
పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాదని నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా...
ఉదయగిరి మాజీ శాసన సభ్యులు బోలినేని రామారావు*
👉సజ్జల రామకృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సాక్షి మీడియా లకు సవాల్ విసిరిన ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు.
👉గత కొద్ది రోజులుగా సాక్షి మీడియా నాపై పులిచింతల ప్రాజెక్టు కట్టింది నేనేనని వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
👉వారికిదే నా సవాల్ పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్ట్ నాదేనని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునేందుకు సిద్ధం.
👉పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగి పోవడానికి కారణం నేనేనని సాక్షి మీడియా నాపై విష ప్రచారం చేస్తుంది ఇదే తొలిసారి కాదు ఇదే మాదిరి 2017 సంవత్సరం నుంచి నాపై అబద్ధపు ప్రచారం.. కథనాలు ప్రచురిస్తున్నది.
👉2004 వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రారంభమైన పులిచింతల ప్రాజెక్టు నాకెలా కాంట్రాక్టు ఇస్తారు, నాకు గాని నా కంపెనీకి సంబంధం లేని విషయంలో మీరు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
👉గతంలో సాక్షి పత్రిక లో నేను 280 కోట్ల అవినీతి చేసినట్లు తప్పుడు ప్రచారాలు చేశారు కిరాణా షాపుల మాదిరిగా పట్టిక తయారు చేసి ప్రచురించారు ఇసుకలో 150కోట్లు అవినీతి చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేశారు.
👉ఉదయగిరి నియోజకవర్గంలో ఇసుక ఎక్కడ దొరుకుతుందో మీరే చెప్పండి అని నేను ప్రశ్నిస్తున్నా. అలాంటిది ఇసుక లేని దగ్గర 150 కోట్ల అవినీతి ఎలా చేస్తాను ఉదయగిరి నియోజకవర్గం లో పెన్నానది లేదు.
👉పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు మీ పార్టీ సభ్యులే ప్రస్తుతం మీ పార్టీలోనే ఉన్నారు దీని పై నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడమని సజ్జల,అనిల్ కుమార్ యాదవ్ గార్లకు తెలియజేస్తున్నాను.
👉నా కంపెనీ పేరు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ నేను ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయటం లేదు.. పక్క రాష్ట్రంలో పనులు చేసుకుంటున్నాను.
నా పై ఇక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదు నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు క్షమాపణ చెప్పకపోతే సాక్షి మీడియా పై లీగల్ గా పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది.
వెంకటాచలం మండలం కంటేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..
ఎస్సీ కాలనీ వాసుల ఆధీనంలోనే 10 గ్రావెల్ టిప్పర్లు..
ఎస్సైని నమ్మి వాహనాలను అప్పగించలేమని ఆయన ముఖం మీదే చెప్పిన కాలనీ వాసులు..
తహసీల్దార్ కు కూడా అదే రీతిలో సమాధానం
40కి పైగా టిప్పర్లు, కొన్ని ప్రొక్లెయిన్లను అక్కడి నుంచి పంపించేసిన తర్వాతే పోలీసులు వచ్చారని ఆగ్రహం..
జిల్లా ఉన్నతాధికారులు వచ్చి గ్రావెల్ తవ్విన అటవీ భూములను పరిశీలించడంతో పాటు మిగిలిన 40 టిప్పర్లు, ఐదు ప్రొక్లెయిన్లు కూడా సీజ్ చేయాలని డిమాండ్..
గ్రావెల్ మాఫియా వెనుక ఉన్న పెద్ద తలకాయను కూడా బయటకు తేవాలని షరతు..
అటవీ భూముల్లోని విలువైన సంపదను కొల్లగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
జూన్ 22న కూడా ఇదే అటవీ భూమిలో, ఇదే ప్రాంతంలో టిప్పర్లు, ప్రొక్లెయిన్లను సీజ్ చేశామని ప్రకటించి గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారని గుర్తు చేసిన కాలనీ వాసులు..
అప్పుడు వదిలేయడంతోనే ఇప్పుడు తమ ప్రాణాల మీదకు వచ్చిందని ఆవేదన..
నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం పోటుపాలెం గ్రామం పంచాయతి పురిటిపాలెం గ్రామం💥
♦️
♦️ పురిటి పాలెం గ్రామాన్ని వెన్నాడుతున్న రోడ్ల సమస్యలు
♦️తారు రోడ్డు మంజూరు అయిన గుంటలుగా కంకర రాల్లకే పరిమితమైన పురిటి పాలెం రోడ్డు మీద గర్భిణి స్త్రీలు హాస్పిటల్ వెళ్ళాలంటే వొళ్లంతా అధిరి మధ్యలోనే ప్రసవించడం అలాగే ఒక వ్యక్తి కి పాము కాటు తెలు కాటు వేస్తే హస్పిటల్ కి తీసుకెళ్లే లోగా చనిపోయే అటువంటి పరిస్తితి
♦️ రోడ్డునిర్మాణాలు పనులు సగానికే ఆగిపోయిన రోడ్డును పట్టించుకునే నాధుడే లేడు
♦️ పురిటిపాలెం గ్రామం సమస్యలకు . నిలయం చెప్పుకోవచ్చు
♦️ చోద్యం చూస్తున్న శాఖ అధికారులు
♦️ పురిటిపాలెం గ్రామం నుంచి రోటరీ నగర్ బైపాస్ వరకు తారు రోడ్డు 2.87లక్షలు రుపాయిలతో రోడ్డు మంజూరు
♦️ రోడ్డు నిర్మాణం పునాదులు వేశారు కంకర తోలారు అక్కడ పరిస్తితి చూస్తే యదా రాజ తథా సితి అన్నట్టే ఉంది
♦️అయినా ఫలితం శున్యం
♦️ పురిటిపాలెం గ్రామం ప్రజల కష్టాలు తిరేది ఎన్నడూ..
♦️ పురిటిపాలెం నేతలు రంగంలోకి దిగిన స్పందించని అధికార యంత్రాంగం
♦️జిల్లా కలెక్టర్ గారు పురిటి పాలెం రోడ్లు మరియు స్మశానాినికి గ్రామ ప్రజలు సమస్యల పై దృష్టి సారించండి
👉R&B శాఖ అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల పట్టింపు లేనితనం పురిటిపాలెం గ్రామానికి శాపంలా మారాయి. 2వేల మందికి పైగా జనాభా ఉన్న పోటు పాలెం పంచాయతి ఈరొడ్డు సమస్య భయం పట్టి పీడిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే.. ఎటు నుంచి వరద ముంచెత్తుతుందోనన్న ఆందోళన గ్రామవాసులను కలవరపెడుతోంది. దీనికి ప్రధాన కారణం.. పురిటిపాలెం గ్రామం ప్రజలు సమస్యలు ను సచివాలయం సిబ్బంది మరియు ఆ యా శాఖ అధికారులు పట్టించుకోకపోవడమే.
👉రోడ్డు నిర్మాణం పూర్తి , కాకపోవడం అలాగే ప్రజలకు కనీసం ఒక వ్యక్తి చనిపోతే పూడ్చడానికి కూడా స్మశానం కూడా లేదు చనిపోయినా వ్యక్తినీ పోడ్చలంటే ఒక మనిషి నిళల్లో మునిగి వెళ్ల వలసిన పరిస్తితి, పంచాయతీ లసమన్వయ లోపం.. ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. వర్షాకాలంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలూ పడకేశాయి. ఆ బాధ్యత తమది కాదంటే.. తమది కాదంటూ రెండు వ్యవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పురిటి పాలెం గ్రామంలో ప్రదాన తారు రోడ్లు నిర్మాణం 2015లో వచ్చిన వరదలకు ఉన్న రోడ్డు కూడా కొట్టుకో పోయింది అని గ్రామస్థులు చెప్తున్నారు ప్రధాన కారణం ఇదేనని అప్పట్లో పురిటి పాలెం పర్యటించిన జిల్లా కలెక్టర్ గారు తేల్చి చెప్పినా.. తీసుకున్న చర్యలు నామమాత్రమే అవడం గమనార్హం.
💥పత్రాలకే పరిమితం
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తేనే నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు పురిటిపాలెం గ్రామ ప్రజలు కన్నీటి బాధను చూసి కాస్త కనికరించండి💥
💥కొస మెరుపు💥
👉పురిటిపాలెం గ్రామం తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేసి తారు రోడ్డు కి వచ్చిననిధులు తిసుకొని నిర్మాణం పూర్తి చేయకుండా ఉన్న కాంట్రాక్టరు మీద R&B అధికారులు మీద మరియు ఆయా శాఖల అధికారులు మీదవెంటనే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని గౌరవ
జిల్లా కలెక్టర్ గారికి పురిటిపాలెం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
అధికారులారా ..అర్హులకు సంక్షేమ పథకాలను దూరం చేయకండి!
**తహసీల్దారు బదిలీపై వెళ్ళిన ఆమె చేసిన అక్రమాలపై న్యాయ పోరాటం ఆగదు
**
పొదలకూరు
ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాజకీయ నేతల ఒత్తిళ్లలకు తలొగ్గి, నిజమైన అర్హులకు దూరం చేయవద్దని టీడీపీ మండల,పట్టణ అధ్యక్షులు తలచీరు మస్తానయ్య, బొద్దులూరు.మల్లిఖార్జున నాయుడు అన్నారు. సోమవారం స్థానిక సీనియర్ టిడిపి నాయకులు భాస్కర్ రెడ్డి నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో, లంచాలకు ఆశపడి నిజమైన పేదలకు, అర్హులకు మొండి చేయి చూప వద్దని వారు హితవు పలికారు. పొదలకూరు తహసీల్దారుగా మరో ఏడాది తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరినా, ఆమె చేసిన అక్రమాలు, అవినీతి ఆరోపణలన్ని తో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడంతో తహసీల్దారు పదవీకాలం పొడిగింపు చేయలేదని, సీసీఎల్ ఏకి సరెండర్ చేసిన కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. తహసీల్దారు బదిలీపై వెళ్ళిన ఆమె చేసిన అన్యాయాలు, అక్రమాలు ఆధారాలతో సహా ఉన్నాయని టీడీపీ న్యాయ పోరాటం నుంచి ఆమె తప్పించుకోలేదన్నారు. తమ దగ్గర వున్న ఆధారాలతో న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తామన్నారు. పేదలకు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా అందాల్సిన సంక్షేమ పథకాలను, రక్షణ ను మండల అధికారుంతా పార్టీలకతీతంగా అందించాలన్నారు. ఈ రెండేళ్ళలో రైతులు పొందిన 1 బీలు, అండగళ్ళలో కొన్నింటిని తహసీల్దారు పోతూ పోతూ వెబ్ ల్యాండ్ లో తొలగించారని,ఆయా రైతులు వాటిని పరిశీలించుకోవాలని సూచించారు.అవినీతి,అక్రమాలపై పోరాటంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవూరు. బక్కయ్య నాయుడు, నీలం సుందర్ రామిరెడ్డి,అక్కెం సుధాకర్ రెడ్డి,బొగోలు.భాస్కర్ రెడ్డి, ఆదాల సుగుణమ్మ,కొమ్మి చిరంజీవి,శ్రీనివాసులు,వెంకట రెడ్డి,ఆదాల మురళి పాల్గొన్నారు.