అదుపుతప్పి పొలాల్లోకి తీసుకెళ్లినా ఆర్టీసీ బస్సు.
నెల్లూరు నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్ పెళ్లకూరు మండలం తెంకాయతోపు వద్ద అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తున్న ఒక్కరికీ మాత్రమే స్వల్ప గాయలు గాక మిగతా ప్రయాణిస్తున్న వాళ్ళు క్షేమంగా ఉన్నారని పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్ తెలియజేశారు.పొలంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏమైనా గాయాలు అయి ఉంటాయని అక్కడే ఉన్న స్థానికులు 108కు సమాచారం అందించగా 108 వాహనం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుoది.అనంతరం పెళ్లకూరు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేస్తూ వాహనాలను తరలిస్తున్నారు..
పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి సింహపురి రెడ్డి సంఘం సభ్యులు గౌరవ పూర్వక పలకరింపు
ఈరోజు సింహపురి రెడ్డి సంఘం ప్రతినిధులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలవడం జరిగింది, పేర్నాటి సతీమణి శ్రీమతి హేమ సుస్మిత రాష్ట్ర వితనాభివృద్ది సంస్థ ఛైర్మన్ గా పదవీభాద్యతలు స్వీకరించిన సందర్భంగా సింహపురి రెడ్డిసంఘం ప్రతునిధులు నెల్లూరు పట్టణంలో శ్యాం ప్రసాద్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అభినందించి శాలువా,పుష్ప గుచ్ఛంతో ఘనంగా సత్కరించారు, ఈ సందర్భంగా తిప్పగంటపాలెం గ్రామానికి సంభందించి సాగునీటి విషయమై ఎల్లంటి సనత్ కుమార్ రెడ్డి, పేర్నాటి దృష్టికి తేగా స్పందించిన పేర్నాటి త్వరలో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ గారిని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళదామని తెలిపారు, పెర్నాటిని కలిసిన వారిలో సింహపురి రెడ్డి సంఘం అధ్యక్షుడు వి, చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బి.దశరథ రామి రెడ్డి, పిఆర్వో కె. జనార్థన్ రెడ్డి,సెక్రటరీ ప్రజెంద్రారెడ్డి, చిల్లకూరు రెడ్డి సంఘం అధ్యక్షుడు కె,సనత్ కుమార్ రెడ్డి, గౌ అధ్యక్షుడు పి.రఘురామి రెడ్డి, ప్రతినిధులు, ఎం శ్రీనివాసులురెడ్డి, ఏ,భాస్కర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, వై, సనత్ కుమార్ రెడ్డి, సిహెచ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం
ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామం లో జరుగుతున్న పనులు, కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన
మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
ఈ కార్యక్రమంలో
నెల్లూరు జిల్లా DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు , నెల్లూరు జిల్లావిజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, ఇందుకూరుపేట కో-పరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జయరామ్ స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు
చెంగాళమ్మను దర్శించుకున్న శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి కుటుంబ సభ్యులు.
సుళ్లూరుపేట శ్రీ శ్రీ చెంగాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి కుటుంబ సభ్యులు. చెంగాలమ్మ ఆలయం వద్ద ఉపసభాపతి కి స్వాగతం పలికిన సుళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య,ఆర్డిఓ సరోజిని, మున్సిపాల్ చైర్ పర్సన్, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొ
జల వనరులు కాదు.... ధన వనరుల శాఖ మంత్రి....
పులిచింతల ప్రాజెక్టు పై అవగాహన తెచ్చుకో
చేతకాని దద్దమ్మ మంత్రి అనిల్
మంత్రి పదవిని రక్షించుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు
మంత్రి అనిల్ పై విరుచుకుపడ్డ టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు, ఆగస్ట్..7...
ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది దిగ్గజాలు జలవనరుల శాఖ నిర్వహించి మంచి పేరు తీసుకు వచ్చారని కానీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వంటి అవినీతి మంత్రి లేడని జలవనరుల శాఖను ధన వనరుల శాఖగా మార్చి వేసిన ఘనత మంత్రి అనిల్ కే దక్కుతుందని టిడిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు తెలుసుకొని మాట్లాడాలని వ్యంగంగా వ్యాఖ్యానించారు. పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. అప్పుడే జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందన్నారు.
డబ్బులు మిగుల్చుకోవాలన్న లక్ష్యంతో 33 గేట్లు పులిచింతలకు పెట్టాల్సి ఉంటే 24 గేట్లు మాత్రమే పెట్టారని వివరించారు.. ఒక్కసారిగా పులిచింతల్లో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో గేట్లు కొట్టుకో కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాదం పెట్టిన తర్వాత రాష్ట్రం అధోగతి పాలు అయిందని కనీసం ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు కూడా ఆర్థిక పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చివరకు రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించారంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలన ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.. ప్రజా వేదిక కూల్చివేత దగ్గర్నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు
నెల్లూరు పెన్నా నదిలో ఇసుక, గ్రావెల్ తవ్వకాల ద్వారా మంత్రి అనిల్ వందల కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. చివరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పై కూడా కేసు పెట్టడంలో మంత్రి అనిల్ హస్తం ఉందని ఆరోపించారు. సొంత పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టిస్తున్న మంత్రి అనిల్ ను ఏం పిలవాలో అర్థం కావడం లేదన్నారు. తన మంత్రి పదవి పోతుందన్న సంకేతాలు రావడంతో దానిని కాపాడుకునేందుకు నోటికి ఇష్టం వచ్చినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు.